Jump to content

చంద్రయ్య శివన్న

వికీపీడియా నుండి
చంద్రయ్య శివన్న
చంద్రయ్య శివన్న
జననంచంద్రయ్య శివన్న
మే 25, 1984
పాలమూరు జిల్లా, నర్వ మండలం, లంకాలగ్రామం
ఇతర పేర్లుచంద్రయ్య
ప్రసిద్ధిభాషా శాస్త్రవేత్త
మతంహిందూ
తండ్రిసోమయ్య
తల్లిబాలకిష్టమ్మ

చంద్రయ్య శివన్న, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భాషావేత్త. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొంది, ఏవీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఆ తరువాత నెల్లూరులోని 'ప్రాచీన తెలుగు  విశిష్ట అధ్యయన కేంద్రంలో 'అసోసియేట్ ఫెలో'గా పనిచేసాడు.[1] ప్రస్తుతం హైదరాబాదులోని నిజాం కళాశాల, తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అమెరికన్ ఇనిస్టిటూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ లో విదేశీ విద్యార్థులకు తెలుగు బోధిస్తున్నారు. యు.జి.సి. కేర్ లిస్టెడ్ జర్నల్ ఐన "నడుస్తున్న తెలంగాణ" మాస పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చంద్రయ్య శివన్న 1984, మే 25న తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, నర్వ మండలంలోని లంకాల గ్రామంలో జన్మించాడు. తండ్రి దొరకుంట సోమయ్య, తల్లి బాలకిష్టమ్మ. వలస కష్టంనుంచి బయటపడ్ద చంద్రయ్య పదవ తరగతిలో నర్వ మండలం స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణునిగా నిలిచాడు. పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్‌లో 92 మార్కులు రావడం, తరువాతి కాలంలో భాషా సాహిత్యాల పరిశోధనకు ప్రేరణనిచ్చింది. పాఠశాలలో చదువు చెప్పిన గురువు చెన్నయ్య, గురుస్థానీయులు రమేశ్, యూనివర్సిటీ స్థాయిలో ప్రొ. కాశీం, రీసెర్చ్ సూపర్‌వైజర్ ప్రొ. పమ్మి పవన్‌కుమార్ ల మార్గదర్శనం తన భాషాసాహిత్య అధ్యయనాలకు తోడ్పడింది.

చదువులో కొనసాగిన ఒడిదుడుకులు

[మార్చు]

పదవ తరగతి తర్వాత ఆర్థిక కారణాలవల్ల మరో రెండు సంవత్సరాలు చదువు మానేసాడు. ఆ తరువాత హైదరాబాదులో ఐదు సంవత్సరాలు పగలంతా పెయింయింట్ చేసేవాడు. రాత్రి కళాశాలకు వెళ్ళేవాడు. తెలంగాణ సారస్వత పరిషత్తులో పి.డి.సి, బి.ఏ (ఎల్) పూర్తి చేసాడు.

ప్రతిభా పురస్కారం

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదు విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎం.ఏ. తెలుగు రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానాన్ని సంపాదించాడు. అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. తరువాత రీసెర్చ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే, నెట్ పరీక్ష ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోఫిప్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలోనే ఎం. ఫిల్, పిహెచ్.డీ డిగ్రీలను అందుకున్నాడు.

సాహిత్య విమర్శలో కొత్తకోణం

[మార్చు]

డా. చంద్రయ్య ఇటీవల రాసిన “తెలుగు కవిత్వంలో అకేషనాలిటీ: రెగ్యులారిటీ” అనే విమర్శా వ్యాసం తెలుగు సాహిత్య విమర్శలోనే కొత్త విమర్శా పద్ధతిని ఆవిష్కరించింది. ఇటీవల కరోనా మీద వెలువడిన కవిత్వంపై ఆయన రాసిన విమర్శ వ్యాసం మొట్టమొదటిది కావడం విశేషం. “తెలుగు సినిమాల్లో వాడబడుతున్న తెలంగాణ భాష” గురించి ఆయన సుధీర్ఘ వ్యాసాన్ని రాసాడు. ఇవన్నీ విమర్శకులచేత మన్ననలను పొందాయి.[2]

వెనుకబడిన పాలమూరు జిల్లా ప్రాంతం నుంచి వచ్చిన చంద్రయ్య తన మూలాలను ఎన్నడూ మరిచిపోలేదు. ఆ ప్రజల జీవితాలను కవితలుగా, పరిశోధన వ్యాసాలుగా రాసాడు. ఎం.ఫిల్. పిహెచ్. డి. సిద్ధాంత గ్రంథాలతో పాటు 25కు పైగా జాతీయ సదస్సులు, 10 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలను సమర్పించాడు. 10కిపైగా జాతీయ, అంతర్జాతీయ కార్యశాలల్లో (వర్కషాప్స్)లో పాల్గొన్నాడు. తెలంగాణ భాషపై పరిశోధన వ్యాసాలను రాసాడు. వివిధ పత్రికల్లో సామాహిక, సాహిత్య వ్యాసాలు ముద్రించబడ్డాయి. 2019లో ‘ఎడారి వాసన’ కవితా సంపుటిని ప్రచురించాడు.[3]

వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని వ్యాసాలు, ముద్రించిన పుస్తకాలు

[మార్చు]
  • తరమెళ్లిపోతున్నది[4]
  • తెలుగు కవిత్వంలో అకేషనాలిటీ, రెగ్యులారిటీ
  • సోషల్ మీడియాపై ఎగరేసిన పతాక-పాట[5]
  • డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు[6]
  • తొలి తెలంగాణ సాంస్కృతిక పదకోశం
  • పలుకుబడులకు పట్టం గట్టిన కాళన్న[7]
  • ఇప్పుడు తెలుగు కవితేమంటుంది
  • తెలుగు సినిమాల్లో వాడబడుతున్న తెలంగాణ భాష
  • తెలంగాణ సాంస్కృతిక పదకోశం (పండుగలు, జాతరలు)
  • పలుకుబడి (తెలంగాణ తెలుగు భాషాపరిశోధన వ్యాసాలు)
  • ఉపయుక్త (సాహిత్య పరిశోధనావ్యాసాలు)

గురజాడ జాతీయ యువ పురస్కారం

[మార్చు]

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉన్నప్పుడు సాహితీ మిత్రులతో కలిసి 2013లో ‘అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చా వేదిక’ను ఏర్పాటు చేసాడు. ఈ సంస్థ ద్వారా నిపుణులచేత అనేక భాషా సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటుచేయడమైంది. ఈ కృషికి గుర్తింపుగా గురజాడ ఫౌండేషన్ వారు ‘గురజాడ జాతీయ యువ పురస్కారాన్ని’ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి చేతులమీదుగా అందుకున్నాడు.

భాషా పరిశోధకుడిగా

[మార్చు]

ఎం.ఫిల్. పరిశోధనాంశం:

[మార్చు]

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భంలో తెలంగాణ కవులు తెలంగాణ భాషలో కవిత్వం రాసాడు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష వివక్షకు గురైందని కవులు తెలంగాణ భాషలో విస్తృతంగా కవిత్వాన్ని వెలువలించారు. ఈ భాషలోని ప్రత్యేకతను నిరూపించడానికి “తెలంగాణ ఉద్యమ కవిత్వం: భాషా వైవిధ్యం” అనే అంశాన్ని స్వీకరించి, 2012లో ఎం.ఫిల్. పరిశోధన పూర్తిచేసాడు.[8]

పిహెచ్.డి. పరిశోధనాంశం:

[మార్చు]

“తిమ్మాజిపేట మండల మౌఖిక భాష- వర్ణనాత్మక వ్యాకరణం” తెలంగాణ భాషను మరింత పరిశోధించి, తెలంగాణ భాషా ప్రత్యేకతను పరిశోధించాలనుకొని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట మండల మౌఖిక భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాశాడు. ఈ పరిశోధన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ భాష గురించి విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన మొట్టమొదటి పిహెచ్.డి. పరిశోధన 2017లో పూర్తి చేసాడు. ఈ పరిశోధన తెలంగాణ భాష పరిశోధనకు ఒక ప్రధాన ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుంది.[9]

తెలుగులో తొలి సాంస్కృతిక పదకోశ నిర్మాతగా

[మార్చు]

డా. చంద్రయ్య తెలుగులో తొట్టతొలి సాంస్కృతిక పదకోశాన్ని నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇది తెలుగు భాషాశాస్త్ర చరిత్రలో మొట్టమొదటి ప్రయోగంకావడం విశేషం. తెలంగాణ సాహిత్య అకాడమీ అప్పటి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ సాంస్కృతిక పదకోశం’ అనే ప్రాజెక్టుకు రీసర్చ్ సూపర్‌వైజర్‌గా పనిచేసాడు. తెలంగాణలోని వివిధ జిల్లాలు పర్యటించి సాంస్కృతిక పదసంపదను సేకరించి నిర్మించిన ఈ గ్రంథాన్ని ప్రస్తుతం తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ముద్రించారు. ఇది తరువాతి సాంస్కృతిక పదకోశాలను నిర్మించాలనుకునేవారికి ఒక ఆధార గ్రంథంగా ఉపయోగపడతుంది. తెలంగాణ ప్రజల పూజా విధానాలను, వారి ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.[10]

మూలాలు

[మార్చు]
  1. Wikisource link to chandraih shivanna. వికీసోర్స్. 
  2. "Clipping of NavaTelangana Telugu Daily - NavaTelangana". epaper.navatelangana.com. Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-26.
  3. ఎడారి వాసన కవితా సంపుటి. 2019.
  4. "తరమెళ్లిపోతున్నది".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. "Clipping of NavaTelangana Telugu Daily - NavaTelangana". epaper.navatelangana.com. Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-26.
  6. "Clipping of Sakshi Telugu Daily - Andhra Pradesh". epaper.sakshi.com. Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-26.
  7. "పలుకుబడులకు పట్టం గట్టిన కాళన్న".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  8. తెలంగాణ ఉద్యమ కవిత్వం: భాషా వైవిధ్యం ఎం.ఫిల్. పరిశోధనాంశం. 2012.
  9. తిమ్మాజిపేట మండల మౌఖిక భాష- వర్ణనాత్మక వ్యాకరణం పిహెచ్.డి. పరిశోధనాంశం. 2017.
  10. "Clipping of NavaTelangana Telugu Daily - NavaTelangana". epaper.navatelangana.com. Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-26.