చంద్రశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రశ్రీ దళిత కళాకారిణి, కవయిత్రి. ఈమె సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలో 1966 ఫిబ్రవరి 23న సరోజిని, జయచంద్ర దంపతులకు జన్మించినది సత్తెనపల్లిలో ప్రాథమిక విద్య, చీరాల మహిళా కళాశాలలో ఇంటర్‌, విఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌కె కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. నెలపొడుపు నాడు పుట్టిందని తల్లిదండ్రులు ఈమెకు ‘చంద్రశ్రీ’ అని పేరు పెట్టారు. పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థలో కన్సల్టెంటుగా, సామాజిక కార్యకర్తగా విధులు నిర్వహించారు. రైతు కూలి సంఘం నాయకుడు శివసాగర్‌ను వివాహమాడారు. ‘ఏకలవ్య’ కళామండలి స్థాపించి దళిత, బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమ విస్తృతికి కృషి చేశారు. ‘దళిత మహిళా గానం’, ‘అనగనగా ఒక నేను’ (శివసాగర్‌ ఆత్మకథ), ‘అంబేడ్కర్‌ సుప్రభాతం ’, ఆల్బమ్‌లు వెలువరించారు. సుదీర్ఘ రాగాలతో పౌరాణిక నాటక పద్యాలను హృదయరంజకంగా గానం చేసేవారు. ‘దళిత మహాసభ ’ పక్షాన డా. కత్తి పద్మారావు ఆమెకు ‘కళారత్న’ బిరుదు ప్రదానం చేశారు. హైమావతీ భీమన్న నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సాహిత్య సదస్సులో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ‘అంబేడ్కర్‌ సుప్రభాతం’ ఆల్బమ్‌ను ఆవిష్కరించి చంద్రశ్రీని అభినందించారు. కేన్సర్తో బాధపడి 7.7.2012 న చీరాల రామకృష్ణాపురంలో చనిపోయింది.

మూలాలు[మార్చు]