చక్కెర సీతాఫలం
Annona squamosa | |
---|---|
![]() | |
దస్త్రం:Sugar apple with cr6666oss section.jpg | |
Sugar-apple with cross section | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. squamosa
|
Binomial name | |
Annona squamosa |
చక్కెర సీతాఫలం ను మంచి సీతాఫలం, చక్కెర ఆపిల్, సీతాఫలం అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం Annona squamosa. దీనిని ఇంగ్లీషులో Sugar-apple అంటారు. అనోనా ప్రజాతికి చెందిన ఇది అనోనేసి కుటుంబానికి చెందినది. చక్కెర సీతాఫలం చెట్టు అనేక చిన్న చిన్న కొమ్మలతో ఉన్న చిన్న వృక్షం. ఇది 3 మీటర్ల (9.8 అడుగులు) నుంచి 8 మీటర్ల (26 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. ఇది అన్ని కాలాలలో పచ్చగా పెరుగుతూ అనేక సంవత్సరముల పాటు తీయని ఫలాలను అందిస్తుంది. ఈ చెట్టుకు కాసే ఫలాలను సీతాఫలాలు అంటారు. సీతాఫలాలకు చెందిన రకాలు చాలా ఉన్నప్పటికి చక్కెర సీతాఫలం చెట్టుకు కాసిన కాయలు చాలా రుచిగా ఉంటాయి. అందువలన ఈ చెట్టుకు కాసిన కాయలను చిన్నలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీటి కాయలలోని గింజలు సపోటా గింజల వలె నల్లగా అదే పరిమాణం కలిగి ఉంటాయి. వీటి కాయలను తినేటప్పుడు పండు యొక్క పై చర్మాని వలచి లేదా పండును రెండుగా చీల్చి దాని లోపల విత్తనానికి అతుకొని ఉన్న తెల్లని గుజ్జును తింటారు. విత్తనంపై ఉన్న తెల్లని కండ చాలా రుచిగా తీయగా ఉంటుంది. ఆపిల్ కాయ సైజులో ఉండే వీటి కాయలు ఆకుపచ్చ రంగును కలిగి వీటి గింజ పరిమాణంలో అనేక గింజలు అతికించినట్టు గతుకులు గతుకులుగా ఉంటుంది. ఈ చెట్టు రెండు సంవత్సరల వయసు నుంచే పూత పూసినప్పటికి ఇవి పూత నిలుపుకొని కాయలు కాయడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.
గ్యాలరీ[మార్చు]
Sugar apple (right), with Taiwanese "pineapple shijia" (atemoya) (left)