చక్రవాకం (సినిమా)
స్వరూపం
చక్రవాకం (1974 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదన రావు |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి.రంగారావు, నాగభూషణం, రాజసులోచన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" ఆధారంగా, డి. రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్, జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒక కారణంగా చెబుతారు.
కథ
[మార్చు]వాణిశ్రీ, శోభన్ లు ప్రేమికులు. ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళకు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేమికులు దూరం కావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
తారాగణం
[మార్చు]- ఉప్పు శోభన్ బాబు
- వాణిశ్రీ
- చంద్రకళ
- సామర్ల వెంకట రంగారావు
- అంజలీదేవి
- నాగభూషణం
- జి.వరలక్ష్మి
- అల్లు రామలింగయ్య
- కృష్ణకుమారి
- రాజసులోచన
- పద్మనాభం
- శ్రీధర్
- రాజబాబు
- డి రామానాయుడు
- వి.మధుసూధనరావు
- కె.వి. చలం .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వీరమాచినేని మధుసూదనరావు
- కధ: కోడూరి కౌసల్యాదేవి(ఆరికేపూడి)
- మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
- సంగీతం: కె.వి.మహాదేవన్
- నేపథ్య గానం: విస్సంరాజు రామకృష్ణ, పులపాక సుశీల
- కళ: కృష్ణారావు
- కూర్పు: మార్తాండ్
- ఛాయా గ్రహణం: మార్కస్ బాట్లే
- నిర్మాత: దగ్గుపాటి రామానాయుడు
- నిర్మాణ సంస్థ: సురేష్ మూవీస్
- విడుదల:27:09:1974.
పాటలు
[మార్చు]- వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - పి.సుశీల, రచన: ఆత్రేయ
- ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది. ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది - వి.రామకృష్ణ, పి.సుశీల, రచన: ఆత్రేయ
- వీణ లేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేని - వి.రామకృష్ణ, పి.సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
- కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందర - వి.రామకృష్ణ, పి.సుశీల , రచన: ఆచార్య ఆత్రేయ
- ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్నా ఎలావున్నా వినుమా- పి.సుశీల,రచన: ఆచార్య ఆత్రేయ
- వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము- పి.సుశీల, రచన: ఆత్రేయ
- వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశృతి అది ఏలాగైనది విషాదగీతీ- పి.సుశీల, రచన: ఆత్రేయ
- వెళ్ళిపో వెళ్ళిపో వెళ్లాలంటే వెళ్ళిపో ఓ కుళ్ళుమోతు- పి.సుశీల, వి.రామకృష్ణ., రచన: ఆచార్య ఆత్రేయ.
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.