Jump to content

చర్చ:అపూర్వ రాగంగళ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మంచి వ్యాసం ప్రతిపాదన-నేపథ్యం

[మార్చు]

సముదాయ సభ్యులకు, ముఖ్యంగా వ్యాసాన్ని సృష్టించి విస్తరించి ప్రాజెక్టు టైగర్ వ్యాసాల్లో ఆమోదం పొందేలా తీర్చిదిద్దిన స్వరలాసిక గారికి,
సోదర సమీక్ష పద్ధతిలో మంచి వ్యాసాన్ని నిర్ణయించే పద్ధతిని తెలుగు వికీపీడియాలో ప్రారంభించుకునేందుకు, మంచి వ్యాసం ప్రమాణాలు రూపొందించి వాటిని ప్రయోగించి చూస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ వ్యాసాన్ని మంచి వ్యాసంగా ప్రతిపాదించాను. సాధారణంగా ప్రతిపాదించి నెగ్గినవారు వ్యాసంలో గట్టి కృషిచేసినవారే అయివుంటారు. కానీ ఇక్కడ నేను అలా కాకుండా ప్రతిపాదించడానికి కారణం, మన తెలుగులో తద్భిన్నమైన పద్ధతులు తీసుకువద్దామని. మంచి వ్యాసం అన్నది వ్యక్తిగత కృషి కిందకి వస్తోంది. ఈ పద్ధతిలో చేస్తే కొంతమేరకు సమిష్టి కృషికి బీజాలు వేసినవారమవుతామని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మన్నించి స్వరలాసిక గారూ, తదితరులు ఈ వ్యాసాన్ని సమీక్షకు తీసుకున్న సహ-వికీపీడియన్ చేసే సూచనలు సమిష్టిగా అమలుచేద్దామని ప్రతిపాదిస్తూన్నాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 12:21, 5 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]