చర్చ:అబద్దాల కథలు (ఊరి పేర్లు - ప్రచారాలు)
'ఊరి పేర్లకు నిజమైన కారణాలు తెలిసినవారు ఆ కధనాలను ఖచ్చితమయిన ఆధారాలతో సహా ఈ అబద్ధాల కథలకు దిగువున 'అసలు నిజం'గా జోడించవచ్చు.'
అంటే-
ఆ ఊరి పేరుకు సంబంధించి గ్రంధస్థమైన (పురాతన గ్రంధాలు) లేదా శాసనబద్ధమైన సమాచారం మాత్రమే ఖచ్చితమైన సమాచారంగా భావించవలసి ఉంటుంది. అలా కాని వాటినన్నింటినీ 'ప్రచారాలు' గానూ, 'అబద్ధాలు' గానూ పరిగణించడం సమంజసం. 'అనేవారట..., ఉండేదట... ' వంటి 'ట'కారాలు నిజమని నిర్ధారణ చెయ్య కూడదు కదా! అసలు నిజం తెలియజేసేముందు ఆ ఆధారాలను నిర్ధారించుకోవడం వల్ల ఇంతవరకూ అబద్ధాలలోనే ఉండిపోయిన మనం రేపటి తరానికైనా సరియైన సమాచారం అందించినవాళ్ళం కాగలమన్నది నా సూచన. ఆపై విజ్ఞుల నిర్ణయం...... Malladi kameswara rao (చర్చ) 18:19, 2 నవంబర్ 2012 (UTC)
- ఈ వ్యాసం చాలా ఆసక్తి కరంగా ఉంది. ఈ అబధ్హల కథలలో ఎన్నో నిజాలు దాగుంటాయి. చిన్న చిన్న ఊర్లకు పల్లెల పేర్లు శాసనాలలో కాని పురాతన దస్తావేజులలో కాని చేరడానికి అవకాశం ఉండదు కదా ? --t.sujatha (చర్చ) 03:25, 13 ఫిబ్రవరి 2013 (UTC)
కాపీరైట్ వుల్లంఘన ?
[మార్చు]ఇది కాపీరైట్ ఉల్లంఘన అనుకుంటాను. Chavakiran (చర్చ) 04:05, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- రచయిత స్వయంగా చేర్చిన విషాలు కాఫీ^రైట్ ఉల్లంఘన ఎలా ఔతుంది.--t.sujatha (చర్చ) 07:43, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- విశాలాంధ్ర పత్రికలో కూడా రచించింది మల్లాది కామేశ్వరరావు. అతనే వికీలో కథనాన్ని టూకీగా ఇక్కడ చేరుస్తున్నారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన కాదని భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:53, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- రచయిత స్వయంగా వ్రాస్తే ముందు ఆ విశాలాంధ్రలో వచ్చినవి అన్న వాక్యం తీసివెయ్యటం సబబు. చివరలో రిఫరెన్సులలో ఇవ్వవచ్చు ... పలానా తేదీనాడు విశాలాంధ్ర పత్రికలో వచ్చినది అని. ఇటువంటివి ఇలా ప్రత్యేక వ్యాసంగా కాకుండా ఎలాగూ ఆ వూరికి తెవికీలో పుట ఉంది కనుక అక్కడ వ్రాస్తేనే బాగుంటుంది. కానీ ఇలా ప్రచారంలో ఉన్నాయి అన్న విషయం నిర్ధారణ చేసుకోవడం ఎలా? రచయత కల్పన కాదు అని తెలుసుకోవడం ఎలా? Chavakiran (చర్చ) 10:39, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- అబద్దాల కథలు అనేది ఊహాత్మక సమాచారం. ఇలాంటివి వికీలో రాయడానికి వీలుండదు. సభ్యుడే స్వయంగా నిజంకాని సమాచారాన్ని ఎలా చేరుస్తారు? స్వంత మరియు ఊహాత్మక సమాచారం చేర్చడానికి ప్రాతిపాదిక ఏమిటి? వికీలో ఊహాత్మక, స్వంత సమాచారం చేర్చడానికి వీలుండదు. ఏది చేర్చిననూ ఎక్కడో ఉన్న సమాచారాన్ని చేర్చుతూ రెఫరెన్సులు పెట్టాల్సిందే. దీనికి రెఫరెన్సులు పెట్టాలన్ననూ పత్రికలో వచ్చిన సభ్యుడి స్వంత, ఊహాత్మక దానినే పెట్టాల్సి ఉంటుంది! ఎలా ఆలోచించినను ఇది సమంజసం కాదు. 106.66.55.100 11:44, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- రచయిత స్వయంగా వ్రాస్తే ముందు ఆ విశాలాంధ్రలో వచ్చినవి అన్న వాక్యం తీసివెయ్యటం సబబు. చివరలో రిఫరెన్సులలో ఇవ్వవచ్చు ... పలానా తేదీనాడు విశాలాంధ్ర పత్రికలో వచ్చినది అని. ఇటువంటివి ఇలా ప్రత్యేక వ్యాసంగా కాకుండా ఎలాగూ ఆ వూరికి తెవికీలో పుట ఉంది కనుక అక్కడ వ్రాస్తేనే బాగుంటుంది. కానీ ఇలా ప్రచారంలో ఉన్నాయి అన్న విషయం నిర్ధారణ చేసుకోవడం ఎలా? రచయత కల్పన కాదు అని తెలుసుకోవడం ఎలా? Chavakiran (చర్చ) 10:39, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- విశాలాంధ్ర పత్రికలో కూడా రచించింది మల్లాది కామేశ్వరరావు. అతనే వికీలో కథనాన్ని టూకీగా ఇక్కడ చేరుస్తున్నారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన కాదని భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:53, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- రచయిత స్వయంగా చేర్చిన విషాలు కాఫీ^రైట్ ఉల్లంఘన ఎలా ఔతుంది.--t.sujatha (చర్చ) 07:43, 13 ఫిబ్రవరి 2013 (UTC)
కాపీరైట్ ఉల్లంఘన కానే కాదు...!
[మార్చు]'విశాలాంధ్ర ఆదివారం పత్రిక మరియు ఫీచర్స్ ఇన్ ఛార్జ్' గా ఉన్న నేను విశాలాంధ్ర పత్రికలో గత నాలుగు సంవత్సరాలుగా అబద్దాల కథలు రాస్తున్నాను. నేను రాసిన కథనాలను నేనే వికీలో చేర్చుతున్నాను. దీనిని వికీలోకి చేర్చడం వల్ల అసలు నిజాలు తెలియవచ్చన్నదే నా ఆశ! ఇక - సుజాతగారన్నట్లుగా - చిన్న చిన్న ఊర్ల, పల్లెల పేర్లు శాసనాలలో కాని పురాతన దస్తావేజులలో కాని చేరడానికి అవకాశం ఉండదు. నిజమే...! కానీ పరిశీలిస్తే... పరిశోధిస్తే... కొన్ని ఊళ్ళకైనా నిజం కథలు లభించవచ్చు. ఊరంటూ ఉన్నాక ... దానికంటూ ఒక కథ ఉంటుంది. ఆ కథ పూర్వాపరాలు ఎక్కడో ఒక చోట అక్షరబద్దం అయ్యే ఉంటాయి. అవి వెలుగు చూడాలన్నదే ఈ 'అబద్దాల కథలు' రచన ఉద్దేశ్యం. ...Malladi kameswara rao (చర్చ) 09:46, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- మీ సంగతి ఏమిటో కాని పత్రికలలో వస్తున్న ఆర్టికల్స్ వ్రాసే వారి సభ్యనామం సృష్టించి తామే ఫలానా పేపరులో ఆర్టికల్స్ వ్రాస్తున్నామంటూ ఇక్కడా ఆ వ్యాసాలు కూడా మక్కికిమక్కి చేర్చే అవకాశం కాదంటారా? అలా చేస్తుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలేంటి? దీన్ని నిర్థారించడానికి అవకాశాలేమిటి? సాధారణంగా పత్రికలలో, మేగజైన్లలో వచ్చే ఆర్టికల్స్ ను రచయితలు వికీకి కాని, మరెవరికైనా ఇవ్వడానికి పత్రికా సంపాదకులు ఒప్పుకుంటారా? 106.66.55.100 11:52, 13 ఫిబ్రవరి 2013 (UTC)
ఈ వ్యాసం ఈ రూపంలో ఇక్కడ ఉండతగునా..!?
[మార్చు]ఈ వ్యాసం వికీపీడియాలో ఉండదగినదేనా అనే విషయమై చర్చించిన అందరికీ నా ధన్యవాదాలు. పై చర్చలో అజ్ఞాత వాడుకరి చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీవిస్తున్నాను. ఈ విషయమై మరికొంత ఇక్కడ:
- అబద్ధాల కథలు అనే వ్యాస పరంపర "గురించి" రాస్తే.., అప్పుడు ఈ వ్యాసాన్ని ఉంచే విషయాన్ని పరిశీలించవచ్చు.
- వ్యాసంలో ఆ కథలను కూడా (సంక్షిప్తంగా ఐనప్పటికీ) చేర్చడం కుదరదు.
ఈ వ్యాసంలో ఎక్కువ దిద్దుబాట్లు చేసిన వాడుకరులు వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Malladi kameswara rao గార్లు కాబట్టి, వారిద్దరూ దీన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 02:43, 23 ఫిబ్రవరి 2019 (UTC)