చర్చ:ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేజీ శీర్షిక మార్పు[మార్చు]

అక్షర క్రమం జాబితాలో ప్రాచీన కవులు గూడా ఉన్నారు గాబట్టి శీర్షిక ' తెలుగు సాహిత్య కారులు ' అని వుంటే బాగుంటుంది.

వ్యాసంలో రెండుచోట్ల పేర్లు అవసరం లేదు[మార్చు]

కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు (ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ). అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును. (కాని ఒకే వ్యక్తి పేరును ఇక్కడ ఒకటికంటె ఎక్కువ శీర్షికలలో చేరిస్తే గందరగోళంగా ఉండవచ్చును. అయితే ఆ వ్యక్తి గురించిన వ్యాసంలో అన్ని వర్గాలనూ పేర్కొనవచ్చును.) గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:05, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ జాబితా వ్యాసంలో కింది మార్పులు చెయ్యాలి:
  1. "ఆధునిక యుగం సాహితీకారుల జాబితా" నుండి "ఆధునిక యుగ సాహితీకారుల జాబితా" అనే పేరుకు తరలించాలి
  2. ప్రాచీన తెలుగు కవులు అనే విభాగం ఈ పేజీలో అసంగతం, దాన్ని తీసెయ్యాలి
  3. జాబితా ఆకృతిని మార్చాలి. విభాగాలను తీసేసి, పేర్లన్నిటినీ అక్షర క్రమంలో పేర్లను చేర్చాలి. పేరు పక్కనే ఆ వ్యక్తి కృషి చేసిన సాహితీ ప్రక్రియలు రాయాలి. ఉదా: గురజాడ అప్పారావు, కవి, నాటక రచయిత. ఆయన జీవించిన కాలం కూడా బ్రాకెట్లో రాయవచ్చు. ఈ పద్ధతిలో పైన @యర్రా రామారావు గారు పేర్కొన్న సమస్య పరిష్కారమౌతుంది.
  4. వికీలో పేజీ లేని వారి పేర్లను ఈ జాబితా లోంచి తీసెయ్యాలి. వికీ పేజీ ఉంటేనే ఇక్కడ పేరు చేర్చాలి. లేదంటే ఇది దుర్వినియోగమౌతుంది. ఎవరికి వాళ్ళు తమ పేరిట పేజీలనే సృష్టించేసుకుంటున్నారిక్కడ. అలాంటిది ఇక్కడ పేరును చేర్చేసుకోడం పెద్ద విశేషమేమీ కాదు వారికి. పైగా ఇక్కడ మూలాలనేమీ చేర్చడం లేదు. (మూలాలు చేర్చనక్కర్లేదు, సంబంధిత వికీపేజీలో మూలాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి)
  5. వికీలో పేజీలు ఉన్నప్పటికీ ఈ జాబితాలో చేరని సాహితీకారులున్నారు, వారిని కూడా చేర్చాలి. ఉదా: కాళ్ళకూరి నారాయణరావు
__ చదువరి (చర్చరచనలు) 23:11, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.పై అభిప్రాయాల ప్రకారం ఈ పేజీలో తగిన సవరణలు చేయటానికి నేను సమ్మతిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:53, 4 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షర క్రమం‌[మార్చు]

అక్షర క్రమంలో మళ్ళీ మార్చినారు. నేను ఈ వ్యాసాన్ని చాలా కూర్పులు‌, చేర్పులు , సవరణలు చేసినాను.‌ప్రాచీన కవులు జాబితా ఎక్కడ ఉన్నది? అక్షరక్రమంలో చేర్చినారా? ఒకే పేరు రెండు మార్లు వచ్చినవి.ఉదాహరణకు బులుసు‌వెంకట రమణయ్య.అలాంటి ఒక పేరును తీసి వేయవలెను. అక్షర క్రమము కన్నా ముందున్న పట్టిక లేదా జాబితా బాగుండెడిది.‌చాలా మంది కవులను ఇంకా చేర్చ వలెను.‌కొన్ని పత్రికల మూలములు చూడ వలెను.‌ ఎంతో మంది ఆధునిక యువ తరం కవులు తెలుగు సాహిత్యానికి విశేష మైన కృషి చేస్తున్నారు. ఈ జాబితాలో వారికి స్థానం కల్పించిన తరువాత విపుల మైన వ్యాసాన్ని తయారు చెయ్య వచ్చును అని నా అభిప్రాయం.


భాను వారణాసి (చర్చ) 17:10, 7 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

భాను వారణాసి గారూ, పేర్ల కూర్పు మాత్రమే మారింది. గతంలో చేసిన మార్పుచేర్పులేమీ మారలేదు, అలాగే ఉన్నాయి. ఒకే పేరు రెండూ మార్లు వస్తే దానికి కారణం గతంలోనూ అది రెండు సార్లు వచ్చి ఉండడమే. ఇకపై చెయ్యాల్సిన మార్పులను కూడా యథాతథంగా చేసుకుంటూ పోవచ్చు. మీరు చేర్చాల్సిన పేర్లను చేర్చండి. ఒక్క విషయాన్ని గమనించండి.. వికీలో పేజీ లేనివాటిని ఇక్కడ చేర్చకండి. ఇక్కడ చేర్చాలని భావిస్తే ఆ వ్యక్తికి పేజీ సృష్టించి ఆపై లింకు ఇక్కడ చేర్చండి. అలాగే పేజీలు తొలగించిన వ్యక్తుల పేర్లను తీసెయ్యండి. ఆపై దీన్ని మూల జాబితాగా చేసుకుని, దాని ప్రకారం, వివిధ వర్గాల సాహితీకారులకు విడివిడిగా పేజీలు చేద్దాం.__చదువరి (చర్చరచనలు) 01:04, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఈ నాడు తదితర పత్రికలను చూసి కొంతమంది కవులను , రచయితలను , సినిమా కవులు , రచయితలను చేర్చినాను.ధన్యవాదములు. భాను వారణాసి (చర్చ) 01:56, 8 జూన్ 2022 (UTC) 01:52, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలో బాల సాహితీ కారులు[మార్చు]

బాల సాహితీ కారులు లలో ప్రసిద్ధ నవలారచయితలను చేర్చారు. వారు బాల సాహిత్య కారులు కారు. ఎర్ర రంగుతో ఉన్న కవుల పేర్లతో పేజీలను సృష్టించాలి. భాను వారణాసి (చర్చ) 15:49, 6 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో ఎవరు ఏ వర్గంలో ఉన్నారో ఇప్పుడూ వారు ఆ వర్గం లోనే ఉన్నారు. నేనేమీ మార్చలేదు. __చదువరి (చర్చరచనలు) 00:59, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఎర్రలింకులు గల కవుల పేర్లను వ్యాసాలు సృష్టించే అంతవరకు ఒక జాబితాగా చర్చాపేజీలో ఉంచాలి.అవకాశం ఉన్నవారు వాటిని సృష్టించటానికి వీలుంటుంది.వాటిని చర్చాపేజీలో జాబితాగా చేర్చి ఇక్కడ వెంటనే తొలగించాలి. ఇక ముందు ఈ వ్యాస పేజీలో ఎర్రలింకులుతో గానీ, లింకు లేకుండాగానూ పేర్లు చేర్చరాదు.జాబితా అక్షర క్రమంలోనే ఉండాలి.అలా లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ సార్లు పేర్లు రాసినప్పుడు తెలుసుకోవటం చాలా కష్టం. వ్యాసాలు ఉన్న పేజీలు దీనిలో చేర్చకుండా ఉన్నవాటిని చేర్చాలి. యర్రా రామారావు (చర్చ) 02:27, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]