చర్చ:ఆనందీబాయి జోషి
Jump to navigation
Jump to search
వ్యాస రచయితలకు సూచన
[మార్చు]పుస్తకం.నెట్లో ఆమె జీవిత గాథను పరిచయం చేస్తూ రాసిన వ్యాసాన్ని చదివాను. అదేమైనా పనికివస్తుందేమో చూడండి. జీవిత చరిత్ర అనే విభాగం పెట్టి రాయవచ్చేమో కదా. http://pustakam.net/?p=13510--పవన్ సంతోష్ (చర్చ) 06:41, 24 ఫిబ్రవరి 2014 (UTC)
- లింకిచ్చినందుకు ధన్యవాదాలు. నేనా పరిచయవ్యాసాన్ని చక్కగా చదువుకున్నాను. కానీ అక్కడ పరిచయం చేసిన గ్రంథం జీవితచరిత్ర కాదు. జీవిత చరిత్ర ఆధారంగా వ్రాసిన ఒక కాల్పనిక గాథ. జీవిత చరిత్రలోని కాల్పనికత పాఠకులు అప్పటి పరిస్థితుల మరింతగా అర్ధం చేసుకోవటానికి దోహదపడుతుంది కానీ, విశ్లేషించిన రచయిత యొక్క దృష్టికోణంతో పాటు, నిజం అవునో కాదో, జరిగిందో జరగలేదో అన్నటువంటి సంఘటనలను చొప్పిస్తుంది. కాబట్టి వికీవ్యాసానికి అలాంటివి ఆధారం కాకూడదు. కాకపోతే ఈమెపై వచ్చిన పుస్తకాలలో ఇది కూడా ఒకటి అని వ్యాసంలో తప్పకుండా ప్రస్తావించవచ్చు. ఆనందీ బాయి వ్రాసిన ఉత్తరాలు, ముఖ్యంగా కార్పెంటర్ తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలే ఈమె జీవితచరిత్రలన్నింటికీ మూలాధారం. ఈమె సమకాలీకురాలైన డాల్ వ్రాసిన జీవితచరిత్రలో కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. వాటిని బట్టి ఈమె పరిస్థితులను, భావాలను అర్ధం చేసుకోవచ్చు. కానీ అక్కడ కూడా యధాతధంగా ఇచ్చిన ఉత్తరాలు తప్ప డాల్ వ్రాసినవాటిలో ఒక ఫెమినిస్టు ధృక్పథం, భారతీయ సంస్కృతి ప్రత్యక్షంగా అనుభవించని వ్యక్తి ధృక్పథం కూడా ఉన్నదని మరిచిపోకూడదు. --వైజాసత్య (చర్చ) 05:34, 26 ఫిబ్రవరి 2014 (UTC)