Jump to content

చర్చ:ఇతర వెనుకబడిన తరగతుల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
  • రాష్ర్ట ప్రభుత్వం బీసీ కులంగా గుర్తించినప్పటికీ కేంద్రం ఓబిసీ కులాల జాబితాలో గుర్తించని పక్షంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు ఆయా కులాలకు వర్తించవు. కనుక ఓబిసీగా గుర్తింపు పొందని కులాలకు చెందిన వారు కేంద్రంలో గుర్తింపు పొందేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాయి.ఓబీసీ జాబితాలో దేశవ్యాప్తంగా 75 కులాలు, ఉపకులాలను చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం రజక, వీరముష్టి, పెద్దమ్మలవాండ్లు, కాళింగ వంటి నాలుగు ఉపకులాలను మాత్రమే చేర్చడం జరిగింది.

ప్రస్తుతం ఓబీసీ జాబితాలో ప్రకటించిన రజక కులానికి చెందిన వారు రాష్ర్టంలో చాకలి , వనార్‌ అని కూడా పిలువబడుతున్నారు. కాళింగులలో కింతల కాళింగ , బూరగాన కాళింగ, పందిరి కాళింగఅనే మూడు తెగలకు చెందినవారు ఉన్నారు. కాగా కాళింగ అని మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్న కారణంగా పైన పేర్కొన మూడు తెగలకు చెందినవారు కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్‌ సౌకర్యం పొందలేకపోయారు. వీరముష్టి కులస్తులు కేవలం తమ కులం పేరు కారణంగా చిన్నచూపుకు గురవుతున్నా మనే కారణంగా రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీర భద్రీయులు ’గా మార్పు చేయించుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కూడా వీర భద్రీయులుగానే బీసీ జాబితాలో పేరు చేర్చింది. పెద్దమ్మలవాండ్లు , దేవరవాండ్లు, యెల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, కూడా ఓబీసీ జాబితాలో చేర్చబడ్డారు. బీసీ జాబితాలోని ఎ,బి,సి,డి,ఇ గ్రూపులలో మొత్తంగా 140 కులాలకు 29 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం రాష్ర్ట ప్రభుత్వం కల్పించింది. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి. ఓబీసీ జాబితాలోని కులాలుః ఆంధ్రప్రదేశ్-107, అస్సాం- 28, బీహార్‌-131, చండీఘర్‌- 59, దాద్ర-నాగర్‌హవేలీ- 10, డామన్‌ డయ్యూ- 20, ఢీల్లీ- 54, గోవా- 16, గుజరాత్‌-100, హర్యానా- 74, హిమాచల్‌ ప్రదేశ్‌- 50, జమ్ము, కాశ్మీర్‌- 21, కర్ణాటక-185, కేరళ- 82, మధ్యప్రదేశ్‌- 65, మహారాష్ర్ట-216, మణిపూర్‌- 4. ఒరిస్సా-194, పాండిచేరి- 47, పంజాబ్‌-65, రాజస్థాన్‌- 65, సిక్కిం- 10, తమిళనాడు-181, త్రిపుర- 47, ఉత్తరప్రదేశ్‌- 75, ఉత్తరాంచల్‌- 1, పశ్చిమ బెంగాల్‌- 56, అండమాన్‌-నికోబార్‌- 1, జార్‌ఖండ్‌- 119, ఛత్తీస్‌గడ్‌- 64.--Nrahamthulla 07:29, 6 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • రాష్ట్రంలో మరో 24 కులాలను కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగు కులాలు(రాజన్నలు, బొందిలి, ఆరె, ఆరెమరాఠాలు) కూడా బీసీ జాబితాలో చేర్చేందుకు వీటితోపాటు మరో 20 కులాలను బీసీలుగా చేర్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు చేశాక తమను బీసీ జాబితాలో చేర్చాలని 116 కులాల నుంచి విజ్ఞప్తులు అందాయి. వీటిపై అధ్యయనం చేసిన బీసీ కమిషన్ 36 కులాలకు సంబంధించి నివేదిక రూపొందించింది. కమిషన్ నివేదిక సమర్పించిన 36 కులాల్లోని 12 కులాలను మంత్రివర్గ సభ్యుల్లో కొందరు ఒత్తిడి పెంచడంతో వాటిని బీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ వేగంగా పూర్తయింది. మిగిలిన 20 కులాలను కూడా బీసీ జాబితాలో చేర్చేందుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు 9.7.2008.

ముదిరాజ్‌లకు బీసీ-ఏ హోదా కల్పించిన జీవోను కొట్టివేసిన హైకోర్టు

[మార్చు]

ముదిరాజ్‌ కులస్తులను 'బీసీ-డీ' గ్రూపు నుంచి 'బీసీ-ఏ' గ్రూపులోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను హైకోర్టు కొట్టివేసింది.డీ గ్రూపులోని రిజర్వేషన్ల శాతాన్ని మార్చకుండా బీసీ-ఏలోకి మార్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.(ఆంధ్రజ్యోతి4.11.2009)

బీసీ ఎమ్మెల్యేలు

[మార్చు]

మన అసెంబ్లీలో కులాలవారీగా ఎమ్మెల్యేల వివరాలు:

అంకె నియోజకవర్గం పార్టీ అభ్యర్థి కులం జిల్లా
01 సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ టిఆర్‌ఎస్‌ కె సమ్మయ్య మున్నూరు కాపు ఆదిలాబాద్‌
02 ఆదిలాబాద్‌ తెలుగుదేశం జోగు రామన్న మున్నూరు కాపు ఆదిలాబాద్‌
03 కామారెడ్డి తెలుగుదేశం గంప గోవర్థన్‌ పెరిక నిజామాబాద్‌
04 నిజామాబాద్‌ బిజెపి వై లక్ష్మీనారాయణ మున్నూరు కాపు నిజామాబాద్‌
05 బాల్కొండ పిఆర్‌పి ఈరవత్రి అనిల్‌ పద్మశాలి నిజామాబాద్‌
06 జగిత్యాల తెలుగుదేశం ఎల్‌ రమణ పద్మశాలి కరీంనగర్
07 రామగుండం స్వతంత్ర ఎస్‌. సత్యనారాయణ మున్నూరు కాపు కరీంనగర్‌
08 కరీంనగర్‌ తెలుగుదేశం జి కమలాకర్‌ మున్నూరు కాపు కరీంనగర్‌
09 హుజూరాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఈటెల రాజేందర్‌ ముదిరాజ్‌ కరీంనగర్‌
10 పటాన్‌చెరు కాంగ్రెస్‌ నందీశ్వర్‌ గౌడ్‌ గౌడ మెదక్‌
11 మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఆకుల రాజేందర్‌ ముదిరాజ్‌ రంగారెడ్డి
12 కుత్బుల్లాపూర్‌ స్వతంత్ర శ్రీశైలం గౌడ్‌ గౌడ రంగారెడ్డి
13 రాజేంద్ర నగర్‌ తెలుగుదేశం ప్రకాశ్‌ గౌడ్‌ గౌడ రంగారెడ్డి
14 శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ భిక్షపతి యాదవ్‌ యాదవ రంగారెడ్డి
15 ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ దానం నాగేందర్‌ మున్నూరు కాపు హైదరాబాద్‌
16 గోషమహల్‌ కాంగ్రెస్‌ ముఖేష్‌ గౌడ్‌ గౌడ హైదరాబాద్‌
17 నారాయణపేట్‌ తెలుగుదేశం ఎల్లారెడ్డి మున్నూరు కాపు మహబూబ్‌నగర్‌
18 జడ్చర్ల తెలుగుదేశం ఎర్రా చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ మహబూబ్‌నగర్‌
19 కల్వకుర్తి తెలుగుదేశం జైపాల్‌ యాదవ్‌ యాదవ మహబూబ్‌నగర్‌
20 ఆలేరు కాంగ్రెస్‌ భిక్షపతి గౌడ్‌ గౌడ నల్గొండ
21 జనగాం కాంగ్రెస్‌ పొన్నాల లక్ష్మయ్య మున్నూరు కాపు వరంగల్‌
22 పరకాల కాంగ్రెస్‌ కొండా సురేఖ పద్మశాలి వరంగల్‌
23 వరంగల్‌ పశ్చిమ టిఆర్‌ఎస్‌ డి వినయ్‌ భాస్కర్‌ మున్నూరు కాపు వరంగల్‌
24 వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ బి సారయ్య రజక వరంగల్‌
25 ఇచ్చాపురం తెలుగుదేశం సాయిరాజ్‌ కాళింగ శ్రీకాకుళం
26 పలాస కాంగ్రెస్‌ జె జగన్నాయకులు మత్స్యకార శ్రీకాకుళం
27 టెక్కలి కాంగ్రెస్‌ భారతి(రేవతి పతి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకమునుపే 2-6-2008న మృతి చెందారు. ఆయన సతీమణి భారతి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.) కాళింగ శ్రీకాకుళం
28 శ్రీకాకుళం కాంగ్రెస్‌ ధర్మాన ప్రసాదరావు పొలినాటి వెలమ శ్రీకాకుళం
29 ఆముదాలవలస కాంగ్రెస్‌ బి సత్యవతి కాళింగ శ్రీకాకుళం
30 ఎచ్చెర్ల కాంగ్రెస్‌ నీలకంఠం తూర్పు కాపు శ్రీకాకుళం
31 నరసన్నపేట కాంగ్రెస్‌ ధర్మాన కృష్ణదాస్‌ పొలినాటి వెలమ శ్రీకాకుళం
32 చీపురుపల్లి కాంగ్రెస్‌ బొత్స నారాయణ తూర్పు కాపు విజయనగరం
33 గజపతినగరం కాంగ్రెస్‌ బొత్స అప్పలనరసయ్య తూర్పు కాపు విజయనగరం
34 నెల్లిమర్ల కాంగ్రెస్‌ బి అప్పలనాయుడు తూర్పు కాపు విజయనగరం
35 శృంగవరపుకోట తెలుగుదేశం కె లలిత కుమారి కొప్పులవెలమ విజయనగరం
36 విశాఖ ఉత్తరం కాంగ్రెస్‌ టి విజయ్‌ కుమార్‌ కొప్పుల వెలమ విశాఖ
37 విశాఖ పశ్చిమ కాంగ్రెస్‌ ఎం విజయ ప్రసాద్‌ గవర విశాఖ
38 నర్సీపట్నం కాంగ్రెస్‌ బి ముత్యాలపాప కొప్పులవెలమ విశాఖ
39 రామచంద్రాపురం కాంగ్రెస్‌ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శెట్టి బలిజ తూర్పుగోదావరి
40 ముమ్మిడివరం కాంగ్రెస్‌ పొన్నాడ సతీష్‌కుమార్‌ మత్స్యకార తూర్పుగోదావరి
41 రాజమండ్రి సిటీ కాంగ్రెస్‌ ఆర్‌ సూర్య ప్రకాశ రావు తూర్పు కాపు తూర్పుగోదావరి
42 రాజమండ్రి రూరల్‌ తెలుగుదేశం చందన రమేష్‌ దేవాంగ తూర్పుగోదావరి
43 ఆచంట కాంగ్రెస్‌ పీతాని సత్యనారాయణ శెట్టి బలిజ పశ్చిమగోదావరి
44 తణుకు కాంగ్రెస్‌ కె నాగేశ్వర రావు యాదవ పశ్చిమగోదావరి
45 కైకలూరు కాంగ్రెస్‌ జె వెంకట రమణ వడ్ల కృష్ణ
46 పెడన కాంగ్రెస్‌ జోగి రమేష్‌ గౌడ కృష్ణ
47 పెనమలూరు కాంగ్రెస్‌ కె పార్థసారథి యాదవ కృష్ణ
48 మంగళగిరి కాంగ్రెస్‌ కాండ్రు కమల పద్మశాలి గుంటూరు
49 రేపల్లె కాంగ్రెస్‌ మోపిదేవి వెంకటరమణారావు మత్స్యకార గుంటూరు
50 గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ మస్తాన్‌ వలీ దూదేకుల గుంటూరు
51 కావలి తెలుగుదేశం బీద మస్తాన్‌ రావు యాదవ నెల్లూరు
52 డోన్‌ తెలుగుదేశం కె ఇ కృష్ణమూర్తి గౌడ కర్నూలు
53 పత్తికొండ తెలుగుదేశం కె ఇ ప్రభాకర్‌ గౌడ కర్నూలు
54 కళ్యాణదుర్గం కాంగ్రెస్‌ రఘువీరా రెడ్డి యాదవ అనంతపురం
55 పెనుకొండ తెలుగుదేశం పార్థసారధి యాదవ అనంతపురం
56 కదిరి తెలుగుదేశం కె వెంకట ప్రసాద్‌ పద్మశాలి అనంతపురం

ప్రకాశం, కడప, చిత్తూరు, ఖమ్మం జిల్లాల్లో బీసీల ప్రాతినిథ్యం లేదు. (http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=19342)