Jump to content

వీరముష్టి

వికీపీడియా నుండి

వీరముష్టి : బీ.సి.ఏ.గ్రూపు కులం.నెత్తికోతల, వీరభద్రులుగా కూడా పిలుస్తారు.వీరముష్టి కులస్తులు కేవలం తమ కులం పేరు కారణంగా చిన్నచూపుకు గురవుతున్నామనే కారణంగా రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీరభద్రీయ ’గా మార్పు చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిని వీరభద్రీయులుగా గుర్తించి వీరి యొక్క కులానికి వీరభధ్రీయ గా బీసీ జాబితాలో పేరును చేర్చింది.

జీవన సరళి

[మార్చు]

ముఖానికి నిండుగా విభూది రేఖలు, మెడలో రుద్రాక్ష మాలలు, దాదాపు 300 వందల గ్రాముల బరువున్న వెండి లింగం, నడుముకు గంటలు, శంఖం ధరించి ఒక చేత కత్తి పట్టి, జేగంటతో జాతరలో దర్శనమిస్తారు వీరభద్రీయులు. నారసాలు గుచ్చుకుని నాట్యం చేయ డం, పాటలు పాడుతూ, చేతిలోని కత్తిని లయబద్దంగా తిప్పుతూ వీరంగం వేస్తారు. దండకాలు, వీరంగాలు, శరభాలు తదితర పద్య గేయ సాహిత్యం వీరి సొంతం.

సామాజిక జీవితం

[మార్చు]
Virabhadra Daksha.jpg
వీరభద్రుడు, దక్షుడు

విభూది తయారు చేస్తారు కనుక వీరిని విభూదులవారు అని కూడా పిలుస్తారు. రాష్ర్ట వ్యాప్తంగా 20 లక్షల జనాభా ఉంటారు. పిడిగుద్దులతో ప్రత్యర్థులను మట్టికరి పించే సమర్ధత కలిగినందున వీరిని వీరముష్ఠి (ముష్టి అనగా పిడికిలి) వారుగా పేరొందారు. ఇప్పటికీ పిడికిలితో కొట్టి కొబ్బరి కాయలను పగులగొట్టగల సత్తాను వీరు ప్రదర్శిస్తుంటారు. కాలగమనంలో అపభ్రంశానికి గురైన పదాల్లో వీర ముష్ఠి కూడా ఒకటి. సమాజం వీరిని `వీర ముష్టి' వాళ్లుగా కించపరచడంతో ఈ కులంలో పుట్టిన విద్యావంతులు సైతం తమ కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో వీరిని శివుడి ముఖ్యసేవకుడు వీరభద్రుడి వారసులుగా వీరిని పరిగణించేవారు. తెలుగునేలను పాలించిన వివిధ సామ్రాజ్యాల్లో వీరు సైనికులుగా ప్రధాన భూమిక పోషించారు. అప్పట్లో బలిజవారు, కోమటివారు మొదలైన వైశ్యుల ఆస్తుల రక్షణ బాధ్యతలు వీరిపైనే ఉండేవి. అందువల్లే ఇప్పటి తరం వైశ్యుల దగ్గర అడుక్కుం టారు. వైశ్యులు దగ్గర తప్ప మరెక్కడా వీరు చేయి చాపరు. అయితే తాము అడుక్కోవడం లేదంటారు వీరభద్రీయులు. రాజరికంలో రక్షణ వ్యవస్థగా ఉన్న తమకు అందింది జీతమో, పారితోషకమో తప్ప దయాభిక్ష కాదంటారు. రెండు దశాబ్దాల క్రితమే ఈ కుల పెద్దలు తమ కులం పేరును `వీరభద్రీయులు'గా మార్పు చేయించుకున్నారు. కాగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీరముష్టి పేరిట వీరి కుల ధృవీకరణ పత్రాలను అధికారులు మంజూరు చేస్తున్నారు. వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ప్రభలు కట్టి అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.


విద్య

[మార్చు]

ప్రజల్లో వస్తున్న మార్పుల కారుణంగా వీరి కులవృత్తికి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో ఊరూరూ తిరగడం, దేశ దిమ్మరులుగా మారారు. కొన్ని ప్రాంతాల్లో అల్యూమినియం పాత్రల వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వీరిలో 15 శాతంమంది విద్యావంతులయ్యారు. డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తినిపుణులు కూడా వీరిలో రూపొందుతున్నారు. అంతేకాదు, దాదాపు పాతికమంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రిందటే హైదరాబాద్‌ చిక్కడపల్లిలో సొంత కమ్యూనిటీ హాల్‌ నిర్మిచుకున్నారు.సొంతగా హాస్టల్‌ నిర్వహించే ప్రయత్నంలో ఉన్నారు.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా

కులాలు