Jump to content

చర్చ:ఇన్‌ఫ్రాసౌండ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం తెలుగు పేరు "పరశ్రవ్యాలు" అని మారిస్తే బాగుండునేమో వేమూరి గారు పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:04, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసినంత వరకు ఈ పేరు పెద్దగా వాడుకలో లేదు. వ్యాసం పేరు అలానే ఉంచి, లోపల మాత్రం ఈ పేరును పరిచయం చేయవచ్చని అనుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 10:19, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నా నిఘంటువులో

infra, adj. అధో; నీచ; తక్కువ; కింద; అనిన్నీ, infrared, adj. అథోలోహిత; అత్యారుణ; పరారుణ;

   far -, దూర పరారుణ;

అనిన్నీ ఉన్నాయి. కనుక Infrasound ని అథోశబ్దం అని కాని పరశబ్దం అని కాని అనొచ్చునేమో. శ్రవణ అంటే listen అనే శార్థం స్పురించినంతగా శబ్దం అనే అర్థం స్పురించడం లేదు. పర + అరుణ = పరారుణ, సవర్ణదీర్ఘసంధి అయింది కాని పర + శబ్దం లో సంధి జరగలేదు కనుక "పరశబ్దం" అనొచ్చు అని అనుకుంటున్నాను. కాని ఇక్కడ మౌలికంగా నాకు ఒక సందేహం వస్తున్నాది. "పర" అంటే infra అనే అర్థం ఎలా వచ్చిందీ అని. ultra అతి, అత్యుగ్ర, విపరీత, ఊర్ధ్వ అనే అర్థాలు ఉన్నాయి కనుక infra కి మిత, నిమ్న, అథో అన్న విశేషణాలు వాడొచ్చు. ఇలా ఆలోచిస్తే ultrasound కి మితశబ్దం, అథోశబ్దం, నిమ్నశబ్దం అన్నవి సరిపోవచ్చు. అథోశబ్దం అన్న పదబంధాన్ని నాలుగైదు పర్యాయాలు వాడి చూడండి. సందర్భోచితంగా నప్పితే అదే అలవాటు అయిపోతుంది. ధన్యవాదాలు. Vemurione (చర్చ) 03:29, 15 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]