చర్చ:ఈమాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం "వ్రాయడం" నాకు చాలా సులభమైంది. ఎందుకంటే "ఈమాట" యూనికోడ్‌లో ఉన్నందున అంతా చక్కగా కాపీ చేసేశాను. అయితే వికీ నియమాలకూ, ఈ మాట పత్రిక నియమాలకూ, కాపీ హక్కులకూ భంగం కలుగలేదని ఆశిస్తాను. అభ్యంతరం ఉంటే తెలియజేయగలరు. మనలోమాట. . సురేష్ కొలిచాల గారితో ఇంతకు ముందు కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. వారు ఈ కాపీని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:17, 31 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం మీరు రాసిన తరువాతనే ఈ వెబ్‌సైటు గురించి నాకు తెలిసింది. ఇది వెబ్ తెలుగు చరిత్రలో ఒక మైలు రాయి లాంటిది. దీనిని గురించి రాసినందుకు అభినందనలు. ఇలాంటివి మరేమైనా ఉంటే కూడా పరిచయం చేయండి. అన్నట్లు వేలూరు వెంకటేశ్వరరావు గారి తెవికీ సభ్యనామం ఏమిటి? -- రవిచంద్ర(చర్చ) 07:55, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను పొరబడినట్లున్నాను. వేమూరి వేంకటేశ్వరరావు (వాడుకరి:Vemurione), వేలూరి వెంకటేశ్వరరావు ఒకరే అనుకొన్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:10, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక విషయం. ఈమాటలో ఉన్న కొన్ని వ్యాసాలు తెలుగు వికీకి బాగా సరిపోతాయి. అవి మంచి క్వాలిటీతో ఉంటాయి. మరియు అవి యూనికోడ్‌లో ఉన్నందున నేరుగా కాపీ చేసేయవచ్చును. "ఈమాట"లో విషయాన్ని కాపీ చేసుకోవడానికి తమమట్టుకు ("ఈ మాట" పత్రికకు ) అభ్యంతరం లేదని, అయితే రచయితల అనుమతి మాత్రం తీసుకోవాలని ఇంతకుముందు సురేష్ కొలిచాల గారు చెప్పారు. అయితే రచయితలకు ప్రత్యేకంగా వ్రాయాలి. ఈ మాటలో వ్యాసాలలాంటి రచనలు చేసే రచయితలు ఒక డజను మందికి మించి ఉండరు. అలాటివారందరికీ అనుమతి కోసం అభ్యర్ధన వ్రాద్దామనుకొన్నాను. కాని వికీ వాళ్ళు ఇలా వూరికే వెంట పడుతున్నారని వారు చిరాకు పడతారేమోనని వెనుకాడి ఊరుకున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:17, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చాలామంది అనుమతి అడిగితే సంతోషంగా ఇస్తారు. ఈమాట అంటే గుర్తుకొచ్చింది. బెజ్జాల కృష్ణమోహన్ గారిని డెట్రాయిట్లో కలిసినప్పుడు ఛందస్సుపై వికీకి కొన్ని వ్యాసాలు వ్రాస్తానన్నారు. తిరిగి నేను ఫాలోఅప్ చెయ్యాలి --వైజాసత్య 21:26, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అంతర్జాలంలో ఒక చోట ఉన్న వ్యాసాలను మళ్ళీ అదే సమాచారంతో తెవికీలో చేర్చాల్సిన అవసరం లేదనుకుంటా. రెపరెన్సులో పేర్కొంటూ కొన్ని వాక్యాలను తీసుకొని ఇతర వనరుల సహకారంతో మనమే వ్యాసాన్ని తయారుచేసి, బయటి లింకుల్లో దానికి ఒక లింకిస్తే సరిపోతుంది, అవసరమైన వారికి ఆ లింకు తోడ్పడుతుంది. రచయితలు సంతోషంగా అంగీకారం తెలిపితే అది వేరే విషయం కాని మనం వెంటపడి అడగడం కూడా బాగుండదు. ఇది వరకు ఒకసారి కాసుబాబు గారు అడిగారంటున్నారు కదా, అది సరిపోతుంది. ఇవ్వడానికి సుముఖంగా లేని వారు ఖచ్చితంగా కాదని కూడా చెప్పరు, మనం దాన్నిదృష్టిలో ఉంచుకోవాలి. -- C.Chandra Kanth Rao-చర్చ 16:59, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఈమాట&oldid=3100537" నుండి వెలికితీశారు