Jump to content

చర్చ:కట్టమంచి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం లోని కట్టమంచి గ్రామం గురించి

[మార్చు]

వాడుకరి:యర్రా రామారావు గారూ, ఈ వ్యాసానికి సంబంధించిన వివరాలు లభ్యమగుట లేదు. ఈ వ్యాసం పిన్ కోడ్ మరియు వివరాలతో గుండ్ల కట్టమంచి అనే పేజీ ఉంది. ఈ రెండూ ఒకటే అయితే ఈ వ్యాసాన్ని గుండ్ల కట్టమంచికి దారి మార్పు చేయాలి. చోళ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన లింకు లో "కట్టమంచి" ప్రస్తావన ఉంది. మరే అధారాలు లభ్యమగుటలేదు. పూర్వం కట్టమంచి గా ఉన్న పేరు తర్వాత కాలంలో గుండ్ల కట్టమంచి గా మార్పు చెందినదేమో పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 14:23, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ ఈ గ్రామం, గుండ్ల కట్టమంచి గ్రామం భౌగోళికంగా రెండు వేర్వేరు గ్రామాలు.గుండ్ల కట్టమంచి గ్రామం బంగారుపాళ్యం మండలం లోని గ్రామం కాగా, కట్టమంచి గ్రామం చిత్తూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామం.దీనికి ఆంగ్ల వికీపీడియాలో kattamanchi అనే వ్యాసం ఉంది.దాని వికీ డేటా ఆంగ్లవ్యాసం వికీ డేటా లింకుతో మెర్జ్ చేసాను.ఆంగ్ల వ్యాసం ప్రకారం మూలాలతో విస్తరించాను.ఇది రెవెన్యూ గ్రామంకాదు.అందువలన దీనికి మండలంలోని గ్రామాలు వర్గం అవసరం లేదు. యర్రా రామారావు (చర్చ) 15:50, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి ధన్యవాదాలు.➤ కె.వెంకటరమణచర్చ 15:53, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]