చర్చ:కాదంబరి (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

తరలింపు గురించి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

కాదంబరి అన్న పేరిట మహా కావ్యము ఉంది. బాణోచ్చిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే జగమంతా అన్న స్థాయిలో వర్ణనలు, కథనం చేసిన మహాకవి, రచయిత బాణుడు రాసిన కావ్యమది. ప్రపంచంలోకెల్లా తొలి వచన కావ్యాల్లో ఒకటిగానూ, కొందరు తొలి వచన కావ్యం అదేననీ, పేర్కొన్నారు. మరి అంతటి స్థాయిక్ కావ్యం ఉండగా ఈ నవల పేరుతో కాదంబరి అన్న పేజీ ఉండడం సరికాదు. కొందరు కాదంబరి సంస్కృత కావ్యం అనవచ్చు గాక, భారతీయ భాషల్లో దేని నుంచీ సంస్కృతాన్ని విడదీసి చూడలేము. మన తొలి కావ్యమైన భారతమే సంస్కృతానువాదం కదా. కనుక ఈ నవల పేజీని కాదంబరి (నవల) గానూ, కాదంబరి పేజీని సంస్కృత వచన కావ్యానికి సంబంధించిన పేజీ ఉంచి మరో అయోమయ నివృత్తి తయారుచేయాలి. ఐతే ఇటీవల కాలంలో పేజీల తరలింపులో చరిత్రల తరలింపు వివాదాస్పదం అవుతూండడం జేసి నేనిలా అడుగుతున్నాను. లేకుంటే నేనే తరలించి పేజీలు విడివిడిగా సృష్టించేద్దును. అనుభవజ్ఞులైన వికీపీడియన్లు నాకు ఏదోక పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:17, 26 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మరిచాను. కాదంబరి కావ్యానికి దాదాపు నాలుగైదు అనువాదాలు దొరికాయి. ఎవరైనా పూనుకుని పరిష్కారం చూపితే. ఆ నాల్గైదు అనువాదాల గురించి ఇక్కడే వ్రాసి అనంతరం సమాచారం ఇంకా దొరికితే వేర్వేరు పుస్తక వ్యాసాలుగా మలచగలను. --పవన్ సంతోష్ (చర్చ) 12:19, 26 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, మీరు చెప్పిన విషయాలు సరియైనవి. ఈ విషయంలో పేజీ చరిత్ర తరలింపుల అంశం ప్రశక్తి లేదు. కాదంబరి వ్యాసం ఆంగ్ల వికీపీడియాలో కూడా Kadambari అనే శీర్షికతో ఉన్నది. అందులో మీరు చెప్పినట్లు బాణుడు వ్రాసిన కావ్యాంశమే ఉన్నది. అందువల్ల కాదంబరి వ్యాసాన్ని దారిమార్పు లేకుండా కాదంబరి (నవల) కు తరలించాను.దాని కారణంగా వ్యాస చరిత్ర మొత్తం కూడా తరలిపోతుంది. కాదంబరి పేరుతో కాదంబరి (అయోమయ నివృత్తి) అనే పేజీ కూడా తయారుచేసితిని.మీరు కాదంబరి పేజీని సృష్టించి తయారుచేయవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 05:34, 28 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ కృతఙ్ఞతలు. ఇప్పడు నేను కాదంబరి పేజీ సృష్టిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:46, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కాదంబరి వ్యాసం సృష్టించినందులకు ధన్యవాదాలు. సహాయం మూసను తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 10:51, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]