చర్చ:గజేంద్ర మోక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మూడవ పద్యం: "నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె, పురుషోత్తముచే నారాటమెట్లుమానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్..." అని ఉండాలి. నీరాటము అంటే నీటిలో చరించునది - మొసలి వనాటము అంటే వనములో చరించునది - ఏనుగు ఈ రెంటికీ పోరాటము ఎట్లు కలిగింది, ఆ ఘోరమైన అడవిలో భద్ర(ధృఢమైన) కుంజరమునకున్(ఏనుగునకు) పురుషోత్తముడైన విష్ణుమూర్తిచే ఆరాటము ఎలా మానింది... అలాగ దీని భావం ...

can we include this in main article this is no way comparison to pothana gajendramoksham, but it will explain to pamarulu like me[మార్చు]

స్వాంభువ, స్వారోచుష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువు గా ఉన్న సమయంలొ శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచాడు అని శుక మహర్షి పరిక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అదివిని పరిక్షిత్తు ఆ గజేంద్రుని కధను వివరంగా అడుగాగ ఆ మహర్షి గజేంద్రమౌక్షగాధను వివరిస్తాడు.

త్రికూట పర్వత వీశేషాలు[మార్చు]

క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనేపర్వతం ఉంది. ఆ పార్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో , ఇంకో శిఖరం ఇనుము తో, మరొకటి వెండితో అలరాడుతూండేవి. ఆ కొండలమీద రత్న ధాతువు రకరకలైన గగన చారులు కిన్నరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన కృరమృగాలతోఫాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గంపులు గా తిరుగు ఉంటే ఆ ప్రదేశంలొ అంధకారం అలముకొనేది.ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహా బాధతో తిరుగు సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడఏనుగులు గజరాజు అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.

గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం[మార్చు]

అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతివిశాలమైనది, ఆసరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ జల చరాలతో పాటు కొన్ని మెసళ్ళు కూడా ఉన్నట్లూ ఏనుగు లకు తెలియదు. ఆడ ఏనుగు దాహబధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లొకి ప్రవేశించి దాహబాధతీర్చుకొని, తోండంనిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలానీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలొని కర్కకాటక మీనాలు , రోదసిలోని మీన కర్కాకాటాకాలను చేరినట్లు కనిపించింది.

కరిమకర సంగ్రామం[మార్చు]

ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయం లొ ఆ చెరువు లో ఉన్న ఒక మకరం ఆ గజరాజు కాలు పట్టింది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మెసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆకరిమకరం ఒకదానిని ఒకటి కుమ్మి చీల్చుకొంఉండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది.
కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.

శ్రీమహావిష్ణువు ప్రార్ధించడం[మార్చు]

మెసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడినా ఆ గజరాజు, ఆ మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించగ దేవుడు ఎవరు అని ఆలోచించి సర్వేశ్వరుడైన నారాయడుకి ఈ విధంగా మ్రెక్కింది.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;

కరి మొర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం[మార్చు]

అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు ఎలా ఉన్నాడయ్యా అంటే
వైకుంఠంలోని అంతఃపురంలోని మందరవనాంతరంలో ఉన్న సరోవర మనీపంలూ చంద్రకాంత వేదికపై నున్న శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవితో సరసాలాడుతున్న సమయంలో గజరాజు పాహి పాహి అన్న మాట చెవిని పడగానే సర్వశక్తులు విడిచి గజరాజు రక్షణ కోసం వెంటనే బయలు దేరుతాడు.
శ్రీమహావిష్ణువు భూలోకానికి ఏవిధంగా బయలుదేరాడంటే

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడూ
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

శ్రీ లక్షీ దేవి సంశయం[మార్చు]

అలా వెళ్ళుతున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తనలొ తాను మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది.ఏ దుష్టదుస్సాశనుడు కబంధ హస్తాలో నైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా, మళ్ళి పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చడా! అసురులు అమరావతిపైకి దండెత్తివస్తున్నరా! ప్రహ్లాదుడి వంటి భక్తులను హింసించే హిరణ్యక్షుడు మళ్ళి బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. దేవ గణాలు గగన వీధీలలో వ్ళ్ళుతున్న శ్రీమనారాయణుడిని చూసి ఓం నమౌ నారాయణాయా అని నమస్కరించి ప్రార్ధించారు.అడిగెదనని కడువడి జను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు నడుమ నడుగిడు నెడలన్

శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం[మార్చు]

ఆవిధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరిచేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మెసలితలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాదు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ పాంచజన్యశబ్దం శ్తృజననానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది.నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు.నిరంతరం ఎవరైంతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనులమెర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.

ఆ గజరాజమోక్షం కధ ఎవరైతే పఠింస్తారో, ఆలకిస్తారో వారికి సర్వపాపాలు పోయి పుణ్యాలు సిద్దిస్తాయి అని శుకయౌగీంద్రుడు గజేంద్ర మోక్షము కధను పరిక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు.

గజరాజు మకరం జన్మ వృత్తాంతం[మార్చు]

దేవరుడు అనే ముని శాపం వల్ల హూ హూ అనే గంధర్వుడు "మెసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్యమహర్షి ని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు.

వ్యాసంలో ఏముండాలి[మార్చు]

ఈ వ్యాసాన్ని వికీసోర్సుకు తరలించాలనుకుంటా. దాని స్థానంలో కొన్ని గజేంద్ర మోక్షం గురించి రాయాలి. ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, క్లుప్తంగా కథ (ఈ చర్చాపేజీలో ఉన్నదాన్నే కుదించి), దాని ప్రశస్తి.. ఇలాంటివి రాయాలి. __చదువరి (చర్చ, రచనలు) 02:24, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ఈ వ్యాసానికి ఒక్క మూలం కూడా లేదు. కొన్ని చేర్చగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:37, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, ప్రస్తుతం వేరే పనులపై బిజీగా ఉన్నాను. మీరు ప్రయత్నించగలరు.__చదువరి (చర్చరచనలు) 08:07, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]