Jump to content

చర్చ:గుడిపాటి వెంకట చలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
గుడిపాటి వెంకట చలం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 15 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


గుడిపాటి వెంకట చలం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


విస్తరణకు విజ్ఞప్తి

[మార్చు]

గుడిపాటి చలంగారు తెలుగువారు గర్వించదగ్గ మహా రచయిత. వారి రఛనల జాబితా నాకు తెలిసినంతవరకు పూర్తిగా వ్యాసంలొ ఉన్నది. ఈ రచనలు చదివినవారు, ఒక్కొక్క రచనమీద క్లుప్తంగా ఆ రచన గురించి వ్రాస్తె ఏంతయినా బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన రచనలన్ని ఒక ఏత్తు, ఆయన వ్రాసిన మ్యూజింగ్స్ ఒక ఎత్తు. చలంగారి మ్యూజింగ్స్ కు ప్రత్యెక పుట యెర్పరిచి, అక్కడ పూర్తి నిడివిగల వ్యాసం సవివరంగా వ్రాస్తె ఆ పుస్తకాన్ని చదవలేనివారికి, చదివె ఓపిక లేనివారికి ఉపయెగపడుతుంది.--SIVA 17:50, 11 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మైదానం కు లింక్ ఇస్తున్నారు, ఆ లింక్ ఛూసి అక్కడకు వెళ్తే అక్కడ మైదానం అర్థం ఉంది. లింక్ యెప్పుడు ఇవ్వాలి? ఆ లింక్ ఇవ్వబడ్డ పుటలొ ప్రస్తుతపు పుటలొ ఉన్న విషయానికి సంబంధించి విస్తారమయిన సమాచారం ఉంటె ఇవ్వచ్ఛు. పైగా చలంగారు మైదానం అని పెరు పెట్టటంలొ ఉన్న భావాన్ని చెప్పగల స్తాయి ఆ లింక్ కు ఉండాలి. పైన చెప్పినవెమి లేవు. అందుకని ఆ లింక్ తొలగిస్తున్నాను, దయచెసి మళ్ళీ తగిలించవద్దు.ఇలా లింక్లు ప్రతి పుస్తకానికి, ఆ పుస్తకానికి సంబంధించి అర్థం మాత్రమె ఉన్న పుటకు ఇస్తె ఉపయొగమెమున్నది?? ఆ పుస్తకం గురించి వివరంగా వ్రాయబడ్డ పుటకు లింక్ ఇవ్వగలిగితె బాగుంటుంది--SIVA 16:05, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సమస్య వేరే విధంగా పరిష్కరించబడింది - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తరువాత చలంగారు మ్యూజింగ్స్ అని ప్రత్యేక పుస్తకం వ్రాశారు. అంతెకాని, ఆయన వ్రాసిన కొన్ని పుస్తకాలకి కలిపి మ్యూజింగ్స్ అన్న పేరు లేదు. అందుకని మ్యూజింగ్స్ అన్న సమూహం క్రింద ఇవ్వబడ్డ పుస్తకాలపెర్లని పూర్తి జాబితాలొ మళ్ళీ చెర్చటం జరిగింది. మ్యూజింగ్స్ పుస్తకాన్ని కూడా జాబితాలొ చేర్చబడినది.--SIVA 16:05, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం జీవితం గురించి భిన్నమైన సమాచారం

[మార్చు]

ఈ క్రింద తెలిపిన విధంగా నేను రంగారావు గారికి ఒక మనవి చేసాను, ఆయన వ్రాసిన విషయాలు చదివి. కొంత సమయం గడచినా ఆయన దగ్గరనుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. మీరు ఒక్కసారి ఆయన వ్రాసిన విషయాలు, నేను వ్రాసిన మనవి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు--SIVA 18:41, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం వ్యాసంలో మార్పులు

రంగారావుగారూ! నమస్కారం.

మీరు చలం వ్యాసంలో చేసిన మార్పులు జత పరచిన విషయాలు చూసాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాని, ...."చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది' వ్రాసిన దాంట్లో నాకెందుకో పూర్తి సబబుగా లేదనిపిస్తున్నది. చలం తన విమర్శలలో ఎప్పుడూ కూడా కుటంబ జీవితంలో స్త్రీలను ఎంత తక్కువగా, ఒక వస్తువను చూసినట్లుగా చూస్తారో, ఎంత తమ అవసరాలకు వాడుకుంటారో వ్రాశారేకాని, కుటంబ జీవితం మీద వేరే విమర్శలు వ్రాసినట్లు నాకు తెలియదు. ఆయన కుటుంబ జీవనాన్ని ఏ కథలో/నవలలో విమర్శించారో చెప్తే బాగుంటుంది.


తరువాత "....తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో....." తన కుటుంబ సభ్యులు మాత్రమే రమణ మహర్షి శిష్యులుగా మారితే, చలం గతిలేక తనూ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ కథ ప్రకారం, దీక్షితులుగారు (అప్పటి తరం మరో రచయిత, చల స్నేహితులు)మొదటిసారి చలాన్ని రమణమహర్షి దగ్గరకు ఎప్పుడో తీసుకొని వెళ్ళారు. క్రమంగా చలం రమణ మహర్షి పట్ల ఆకర్షితులయినట్లు ఆయన ఆత్మ కథలో తెలుస్తుంది. "వొయ్యి" అని పిలుచుకునే ఆయన వదినగారు, విజయవాడలో పేరొందిన వైద్యురాలు. ఆవిడ మరణం తరువాత, సమాజం తన పట్ల చూపుతున్న శతృ వైఖరిని భరించలేక తన కుటుంబంతో సహా చలం విజయవాడ వదలి అరుణాచలం వెళ్ళిపొయ్యరు.ఈ విషయం ఆయన ఆత్మ కథలో స్పష్టంగా ఉన్నది. దయచేసి మీరు మరొక్కసారి verify చెయ్యమని మనవి.--SIVA 17:09, 24 మార్చి 2008 (UTC)"


ఈ విభేదాన్ని పరిష్కరించడడం కష్టం కాదు. 'శివ' గారు తనకు లభించిన సమాచారం ఎక్కడిదో స్పష్టంగా వ్రాసారు. కనుక - "చలం ఆత్మ కథలో ఇలా ఉన్నది" అన్న వాక్యంతో ఆ పేరాను వ్రాయవచ్చును. అలాగే రంగారావు గారు కూడా "ఫలాని చోట ఇలా ఉన్నది" అన్న వాక్యంతో భిన్నమైన కథనాన్ని మరో పేరాలో వ్రాయవచ్చును. "ఇలా జరిగి ఉండవచ్చును" అన్న ఉద్దేశ్యంతో వ్రాసినదేదైనా ఉంటే దానిని తొలగించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయన ఆత్మ కథలొనయితే తన కుటుంబ సభ్యులు వెళ్ళటం వల్ల గతిలేక చలం అరుణాచలం వెళ్ళినట్టు లేదు. ఈ విషయం నేను రంగారావుగారికి విన్నవించినప్పుడు, ఆయన ఈ కింది విధంగా స్పందించారు

"శివ గారు, చలం కారణంగా ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమయినది అన్నదానిలో మీకు కూడా సందేహం లేదు అనుకుంటాను. 'ఆయన వల్లే ఆ కుటుంబం అలా అయింది ' అన్న విషయమే మరో విధంగా అలా చెప్పబడింది. రెండవదానికోసం ఆయన మనవరాలు రాసిన పుస్తకం చూడవలెను.--Svrangarao 03:27, 30 మార్చి 2008 (UTC)"

నా జవాబు 'రంగారావుగారూ! నమస్తే. మీరు చలం గారు కుటుంబ వ్యవస్తను విమర్శించారని వ్యాసంలో వ్రాశారు. అట్లా విమర్శించిన చలం కుటుంబం అలా అయిందని వ్రాశారు.కానీ మీ జవాబులో నేను కోరినది చలం ఎక్కడ ఏ నవలలో/కథలో కుటుంబ వ్యవస్తను విమర్శించారో తెలియ చేయమని. మరొక్క సారి మీరు వ్యాసంలో వ్రాసిన వాక్యాలు, నా స్పందన చూడమని నా మనవి. తరువాత అరుణాచలం వెళ్ళటం గురించి. ఆయన సొంత ఆత్మ కథ చదివి నేను నా స్పందన వ్రాశాను. ఆయన మనుమరాలు వేరే విధంగా వ్రాసినా, చలం గారు తన గురించి తాను తన ఆత్మ కథలో వ్రాసుకున్నదే ప్రామణికం అని నా అభిప్రాయం. ఏమంటారు'.--SIVA 19:54, 30 మార్చి 2008 (UTC) రంగారావు గారి ప్రతి జవాబు 'శివగారు, చలం తన పుస్తకంలో తనను విమర్శ చేసుకోడు కదా? ఒక వ్యక్తిగురించి చెపుతున్నపుడు మరొకరు చెప్పిన విమర్శలు కూడా చెప్పాలి! - --Svrangarao 23:19, 31 మార్చి 2008 (UTC)'

నా ప్రస్తుతపు స్పందన చలం తన నవలల్లో గాని కథల్లో గాని కుటంబ వ్యవస్త మీద వ్యతెరేక వాఖ్యలు చేసి ఉన్నట్లయితే అలా విమర్శంచిన వాడి కుటుంబమే ఇలా విచ్చినమయిపోయింది అని వాఖ్యానించుకోవచ్చు. కాని ఆయన ఎక్కడ, ఎప్పుడు, కుటుంబ వ్యవస్త మీద అటువంటి వాఖ్యలు (తన రచనలలొ గాని ఇతరత్రా గాని)ఎందుకు చేసాడు అన్న విషయం వివరాలతో తెలిస్తే బాగుంటుంది, వ్యాసంలోని వ్యాఖ్య కు ఆధారంగా ఉంటుంది. ఇవి పరిశీలించకుండా వాఖ్య పొందుపరచవచ్చునా అని నా అనుమానం. అల్లగే ఈ క్రింది వాఖ్య కూడా చెయ్యబడింది

"ఈవిధంగా మానసికంగా దుర్బలుడైన చలం......."

చలం అలోచనా ధోరణులు కాల క్రమేణా మారిన మాట నిజమే(శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి వ్యాఖ్యలు) కాని, చలం మానసికంగా దుర్బలుడైనాడు అనవలిసినంత అవసరం లేదని నా ఉద్దేశ్యం

దయచేసి తెలిసిన ఇతర సభ్యులు స్పందిచగలరు.--SIVA 06:35, 6 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]



శివా గారు లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు లభించలేదనే అనపిస్తున్నది. రచయిత చెప్పదలచుకొన్నదానికంటే అధికంగా అర్ధాలకు దారి తీసే వాక్యాలు ఉన్నాయనిపిస్తంది. ఉదాహరణకు -

  • భార్య చలం ప్రవర్తనతో విసిగి వేసారి .... గుండెపగిలి చనిపోయింది. - ఇక్కడ "గుండె పగిలి" అన్న పదం ఎమోషన్ కోసం వాడిందే. ఆమె అనారోగ్యంతోనో, మానసికంగా కృంగిపోయో మరణించి ఉండాలి.
  • పెద్దకొడుకు చిన్నవసులోనే రోగగ్రస్థుడై మరణించాడు. - ఇది factual కావచ్చును. కాని ఇది వ్రాసిన సందర్భం, మరియు పేరాలో ఇతర వాక్యాలతో కలిపి చదివితే అందుకు కూడా చలం బాధ్యుడు అన్న విపరీతార్ధం ధ్వనిస్తుంది.
  • చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆ కుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది. - చలం కుటుంబ జీవితాన్ని ఎక్కడ విమర్శించాడో చెప్పలేదు. "స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు" - అన్న పదాలు కూడా ఎమోషన్‌ను మూటగడుతున్నాయి. "చలం కుటుంబం ఇలా ఛిన్నాభిన్నమయింది" - అంటే చాలు. చలం విమర్శించింది "తన కుటుంబాన్ని కాదు"(అవును తన కుటుంబాన్ని కాదు! వ్యాసంలో కూడా తన కుటుంబాన్ని అని లేదుకాని, "కుటుంబ వ్యవస్త" గురించి అని రంగారావుగారి అభిప్రాయం--SIVA 16:25, 14 ఏప్రిల్ 2008 (UTC))[ప్రత్యుత్తరం]
  • ఈవిధంగా మానసికంగా దుర్బలుడైన చలం - ఈ పదాలు వేరెవరైనా వాడి ఉంటే వాటిని ఉట్టంకించవచ్చును. వికీ రచయిత స్వయంగా వ్రాయదగిన పదాలు కాదు.
  • తనను, తన కుటుంబాన్ని బలి ఇచ్చాడు. - ఇది కూడా అంతే.
  • ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్ర దేశం వదలి - చలం కలం పట్టిననాటినుండీ విమర్శలకు కొదువ లేదు. అంతేనా? లేక "వెలి" అనే తతంగం ఏమయినా జరిగిందా

ఈ వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు నేను పాటించిన నియమం. - contested or questioned or controversial వ్రాతలకు నమ్మ దగిన ఆధారాలు చూపాలి.

(నా స్వంత అభిప్రాయం - ఎందరో అసమర్ధుల, దొంగ వెధవల, మూర్ఖుల, విధివంచితుల కుటుంబాలు కూడా సలక్షణంగా నిలదొక్కుకోవడం జరుగుతూ వుంటుంది. vice vesra కూడాను. కనుక కుటుంబం ఛిన్నాభిన్నమవడానికి, చలం రచనలకూ, వ్యక్తిత్వానికీ లంకె కట్టడం అసంబద్ధం)

ఈ పై వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాసాన్ని పునఃపరిశీలించవలసినదిగా రంగారావుకు సూచిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:49, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ అభిప్రాయం

[మార్చు]

ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్ర దేశం వదలి - చలం కలం పట్టిననాటినుండీ విమర్శలకు కొదువ లేదు. అంతేనా? లేక "వెలి" అనే తతంగం ఏమయినా జరిగిందా?

ఈ వ్యాక్యం మాత్రం నేను వ్రాసినదే. నేను చలం ఆత్మ కథ "చలం" చదివి వ్రాశాను. అందులో వ్రాసిన ప్రకారం అనేక ఊళ్ళలో ఆయనకు ఆయన కుటుంబానికి ఉండటానికి ఇల్లు దొరికేది కాదట. బెజవాడలో మాత్రం సొంత ఇల్లు. సొంత ఇంటిని కూడా అమ్మేసి, అరుణాచలం కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపొయాడు చలం. దానికి బలమయిన కారంణం చలం తన ఉత్తరాలలో వీరేశలింగం(కందుకూరి కాదు)కు వ్రాసిన వాటిలో స్పష్టంగా ఉన్నది.కాని, రంగారావు గారు, చలం తన కుటుంబ సభ్యులు రమణ భక్తులవటంవల్లన గతిలేక తను కూడా అరుణాచలం వెళ్ళిపొయ్యాడు అని వ్రాశారు. ఇది సత్య దూరం. రమణ మహర్షి గురించి చలంకు పరిచయం చేసినది ఆయన సహాధ్యాయి, రచయిత,దీక్షితులుగారు. 1936 నుండి వీరిద్దరు రమణ మహర్షి ఆశ్రమంకు వెళ్ళి వస్తుండేవారట. ఈ విషయం, చలం ఆత్మ కథలోనూ ఆయన ఉత్తరాలలోనూ ఉన్నది.చలంవల్ల రమణ మహర్షి గురించి ఆయన కుటుంబ సభ్యులకు తెలిసి తద్వారా వారు కూడా రమణ భక్తులయ్యారు కాని, వారివల్ల, చలం ప్రభావితం కాలేదు.ప్రముఖ కథా/నవలా రచయిత కొడవటిగంటి కుటంబరావు ఈ విషయంలో ఈ విధంగా అన్నారు "......ఒంటరితనం, స్నేహితులు, బంధువులతోనైనా గాఢమైన సంబంధాలు లేవు. ఒంటరితనం ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా సోకిందేమోననుకుంటాను. అదే అయనను రమణాశ్రమం చేర్చింది....." కాని ఒంటరి అవ్వటానికి ఆయన స్వభావం కారణమా లేక సమాజ ప్రభావాన ఒంటరి అయ్యడా?? చలాన్ని ఎందుకు వెలి వేశారు ఈ తతంగం ఎలా జరిగింది అన్న విషయం మీద ఇంకా వివరాలు సేకరించవలసి ఉన్నది. అందుకనే, నేను సభ్యుల సహాయం కోరడం జరిగినది.--SIVA 17:16, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల సహాయం కావాలి

[మార్చు]

గుడిపాటి వెంకట చలం వ్యాసం పరిపూర్ణమయినదిగా చెయ్యటానికి, ఇంకా చాలా వివరాలు పొందుపరచాలి. అందులో కొన్ని: చలాన్ని ఎందుకు వెలి వేశారు చలాన్ని అప్పటి సమాజం ఎందుకు వెలి వేసింది అన్న విషయం స్పుటంగా, వ్యాసంలో రాలేదు.ఆయన్ని ఎందుకు వెలి వేశారు? ఎలా వెలి వేయడ్డాడు? లేదా వెలి వేయబడ్డట్టు తాను భావించుకున్నాడా? లేక సమాజంలోని కొందరు వ్యక్తులు, ఆయన ప్రవర్తన, రచనలు వల్ల ఆయన మీద కోపంతో ఆయన దగ్గరకు ఎవరూ చేరకుండా కట్టడి చేసారా? అలా కనుక అయితే, ఆయన ఎటువంటి ప్రవర్తనవల్ల వెలి వేయబడ్డాడు? (ఆయన ఆత్మ కథలో కూడా ఈ విషయం మీద పూర్తి వివరాలు లేవు).ఇప్పటికీ అనేక పునర్ముద్రణలు వేయబడి, ఎంతో ప్రజాదరణ పొందుతున్న ఆయన రచనలకు అప్పటి సమాజం ఏటువంటి అభ్యంతరాలు పెట్టింది? ఎందుకు అభ్యంతర పెట్టింది? అప్పటి ఆయన స్పందన ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు తెలిసిన సభ్యులు వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుంది, వ్యాసం పరిపూర్ణమవుతుంది.--SIVA 06:35, 6 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం ఇతర రచయితలమీద చలం అభిప్రాయాలు, చలంమీద ఇతర రచయితల అభిప్రాయాలు

చలం మీద ఇతర రచయితలు, ముఖ్యంగా ఆయన సమకాలీనులయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, మొదలగువారు ఛేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, వ్యాసంలో పొందుపరచమని మనవి.

అలాగే, చలం ఇతర రచయితలమీద చేసిన వ్యాఖ్యలు, వెలుబుచ్చిన అభిప్రాయాలు వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుంది.--SIVA 06:47, 6 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వొయ్యి అంటే ఎవరు? చలం ఆత్మ కథలోగాని, మ్యూజింగ్స్ లో గాని "వొయ్యి" గురించి అనేక సార్లు ప్రస్తావించబడుతుంది. ఈవొయ్యి అసలు పేరు ఏమిటి, ఆవిడగురించి వొయ్యి అని ఎందుకు వ్రాసారు (వదిన వొయ్యి అయిందా)వొయ్యికి చలంకి సంబంధం ఏమిటి.అదేవిధంగా చలం ఆత్మ కథలో అనేక పొట్టి పేర్లు పకపక, నర్తకి, "చి" "చిట్టి" "షౌ"(సౌరిస్?)మొదలగువారు. వీటన్నిటిగురించి పూర్తి వివరాలు తెలిసిన సభ్యులు వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుంది.

అనవుసరమైన ఫొటోలు

[మార్చు]

ఈ వ్యాసంలో బాక్స్‌లోని ఫొటోను పోనీ ఫేయిర్ యూజ్ క్రింద పరిగణిద్దామనుకోండి. మిగిలిన ఫొటోల మాటేమిటి? చలం వృద్ధాప్యం ఫొటోలు వ్యాసానికి ఏమీ అదనపు సమాచారాన్ని గాని, విలువను కాని ఇవ్వడం లేదు. అవి ఉచిత లైసెన్సులతో లేవు కూడాను. బొమ్మల వివరాలలో పేర్కొన్న బ్లాగులో కూడా లైసెన్సు గురించి వ్రాయలేదు. కేవలం "ఆరుదైనవి" అన్న కారణం తోటే ఆ ఫొటోలు ఉంచడం తగదు. తీసివేయడమే సబబు. 60 యేళ్ళు దాటిన ఫొటోను, ఒక ఫెయిర్ యూజ్ ఫొటోను ఉంచి మిగిలినవి తొలగించడం మంచిది.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:33, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ సమాధానం

[మార్చు]

కాసుబాబుగారూ,

ఏదయినా వ్యాసం చదువుతున్నప్పుడు, ముఖ్యంగా ఒక తెలియని వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఫొటోలు వ్యాసంలో ఉంటే చదువరుల ఆసక్తిని పెంచుతాయి. అంటే ఆ వ్యక్తి చిన్నతనంలో,యవ్వనంలో మరియి వృద్ధాప్యంలో ఎలా ఉండేవాడు చూడగలిగితే(కనీసం ఫొటొలో నయినా)ఒకప్పుడు మనలాగానే జీవించిన వ్యక్తి అనిపుస్తుంది, సహజత్వానికి దగ్గరగా ఉంటుంది తద్వారా వ్యాసంయెక్క పరిణితి పెరుగుతుందని నాఅభిప్రాయం.అలా ఓక్క ఆసక్తి మాత్రమే కాకుండా, వ్యాసంలో మాటలలో వ్యక్తమవ్వని, వ్యక్తపరచలేని ఆ వ్యక్తియెక్క వ్యక్తిత్వం చదువరులకు ఫొటోల ద్వారా తప్పకుండా తెలియ చేయటం జరుగుతుంది. ఫొటొలు "అరుదయినవి" కాబట్టే వ్యాసంలో జతపరచలేదు. సందర్భానుసారం చలం, అతని భార్య ఫొటోలను జత పరిచాను. తన శైలి మీద చలం వ్యక్త పరిచిన అభిప్రాయం వ్యాస భాగంలో, చలం వ్రాసుకుంటున్న ఫొటొ ఉంచటం జరిగింది. అలాగే, చలం ఇతర రచయితల మీద వ్యక్తపరిచిన అభిప్రాయాలవద్ద కూడా,చలం ఫొటో అతని వైఖరి చెప్పకనే చెపుతున్నది. జిళ్ళెల్లమూడి అమ్మతో చలం చిత్రం పొందుపరచిన కారణం, చలం వ్యక్తిత్వంలోని వైరుధ్యం తెలియ చెప్పటంకోసమే-అంటే ఒకప్పుడు దేవుడి మీద, మతవిషయాలమీద వైముఖ్యం చూపిన చలం, ఈ ఫొటోలో ధార్మిక విషయాలలో ఒక ప్రముఖమైన వ్యక్తిని ఎంత ఆర్తిగా కలుసుకుంటున్నాడు అన్న విషయం స్పుటంగా కనపడుతుంది. ఈ విషయం తెలియచేయటానికి వ్యాసంలొఎన్ని వ్యాక్యాలు వ్రాస్తే సరిపోతుంది? చలంగురించి తెలిసినవారుకూడా, కొంత ప్రయత్నం చేస్తేగాని ఈ ఫొటోలు చూడటం తటస్తించదు. వికీలోకి వచ్చి ఈ వ్యాసం చదివేవారికి సమగ్రంగా తెలియచెప్పటమే నాఉద్దేశ్యం.

ఇక లైసెన్సు గురించి,దాదాపు అన్ని ఫొటోలు, 1 ,2 మినహాయించి అనేక దశాబ్దాల ముందు తీసినవే, కాపీ రైటు కాలదోషం పట్టినవె. అన్ని ఫొటోలకు అప్-లోడ్ చేసేసమయంలో, లైసెన్సు వివరాలు తెలిసినంతవరకు పొందుపరచాను, దయచేసి గమనించి, నేనెమన్నా తప్పుగా లైసెన్సు వివరాలు వ్రాశానేమో చూడగలరు. ఈ బొమ్మలన్నీకూడా, శ్రీ పురాణం సుబ్రమణ్య శర్మ "తెలుగు-వెలుగు" అన్నపుస్తకంలోనివి. ఆపుస్తకం ఈ పక్కన ఉంచిన లింక్ నందు ఉచితంగా డౌన్-లోడ్ కు దొరుకుతున్నది. [1]

పారాకు పారాకు మధ్య సంబంధం

[మార్చు]

ఈ వ్యాసం ఎవరైనా కొత్తవాళ్ళు చదివితే వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. నాకయితే చాలా విషయాలు అర్థం కాలేదు. సమాజం నుండి వెలి అని రాసారు గానీ ఎందుకు వెలివేయబడ్డాడో తెలపలేదు. ఆయన వైఖరి ఇతరులకు నచ్చేది కాదన్నారు కానీ ఎలాంటి వైఖరి? ఇలా ఎన్నో విషయాలు అసంపూర్తిగా ఉన్నట్లు నాకనిపించింది. రచయితలు కొంత శ్రద్ధగా కొత్తవారికి అర్థం అయ్యే విధంగా వ్యాసాన్ని తీర్చి దిద్దాలని మనవి. δευ దేవా 20:35, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

జవాబు

[మార్చు]

తప్పకుండానండీ! వ్యాసం వ్రాసేది తెలియనివారు చదవటంకోసమేకదా. కాని, వికీలో నలుగురూ కలసి వ్రాయటం వల్లన, ఎవరికి ఎంత తెలిస్తే అంత గుర్తుకొచ్చినప్పుడు వ్రాయటం జరుగుతుంది. కాబట్టి వ్యాసం పూర్తిగా పరిణితి చెందటానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు. పైన చర్చలో చూడండి, తెలియని విషయాలు తెలుసుకోవటంకోసమే ఇతర సభ్యుల సహయం కోరటం జరిగింది. చలంగారిని వెలి వేయటం గురించి స్పష్టమయిన ఆధారాలతో వివరాలు సంపాయించటానికి కృషి జరుగుతోంది.దయచేసి గమనించగలరు.--SIVA 16:50, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవికూడా చూడండి

[మార్చు]
  • ఎక్కడ స్ర్తీల వ్యక్తిత్వాలను సమాజం నిర్లక్ష్యం చేస్తుందో, ఎక్కడ బాల్యం కన్నీళ్ళ మధ్య స్వేచ్ఛను కోల్పోతుందో, ఎక్కడ ప్రేమ స్వార్థానికి బలైపోతుందో అక్కడ చలం సాహిత్యం మళ్ళీ మళ్ళీ సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతూనే ఉంటుంది.- నండూరి రాజగోపాల్‌ చినుకు మాసపత్రిక సంపాదకుడు http://www.suryaa.com/showcinema.asp?category=1&subCategory=5&ContentId=312

అయోమయ నివృత్తి

[మార్చు]

ఇంతకు ముందు కొంత విషయం చలం అన్న వ్యాసంలో వ్రాయబడింది. ఆ వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసి, 'చలం' వ్యాసాన్ని అయోమయ నివృత్తి పేజీగా మారుస్తున్నాను. విలీనం కాకముందు చలం వ్యాసంపై కృషి చేసినవారి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..

# 19:44, 18 మార్చి 2008 కాసుబాబు (చర్చ | రచనలు | నిరోధించు) (705 బైట్లు) ({{అయోమయ నివృత్తి}}) (రద్దుచేయి | దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 16:48, 13 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,628 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 16:43, 13 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,035 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 18:57, 12 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,095 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 18:38, 12 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,117 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 18:35, 12 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,116 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 18:34, 12 మార్చి 2008 Vu3ktb (చర్చ | రచనలు | నిరోధించు) (4,115 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 22:05, 22 ఫిబ్రవరి 2008 166.37.103.5 (చర్చ | నిరోధించు) (4,121 బైట్లు) (→నాటకాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 16:35, 26 సెప్టెంబర్ 2007 Vyzbot (చర్చ | రచనలు | నిరోధించు) చి (4,117 బైట్లు) (Robot-assisted disambiguation: కన్యాశుల్కం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 03:30, 2 డిసెంబర్ 2006 74.72.19.73 (చర్చ | నిరోధించు) (→కథలు/కథల సంగ్రహములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 05:30, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 05:27, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (→నవలలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 02:43, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 02:37, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) చి (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 02:33, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 02:31, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (చక్షుష మాధ్యమంలో చలం రచనలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 02:29, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 01:39, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 00:09, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 00:08, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (→వ్యాఖ్యానాలు/వ్యాసాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
# (ప్రస్తు) (గత) 00:08, 7 నవంబర్ 2006 Sagar ricky (చర్చ | రచనలు | నిరోధించు) (మొదలు)

మేకా మన్మధరావు గారు చేర్చిన సమాచారం తొలగించబడింది

[మార్చు]

@Meka manmadha rao గారూ ఈ రోజు ఆంధ్రజ్వోతి దినపత్రికలో ''చలం:నేటికీ ఓ శేష ప్రశ్న'' అనే ప్రచురితమైన వ్యాసంలో ఉన్న సమాచారం ఉన్నది ఉన్నట్లుగా చాలా ఓపికతో ఈ వ్యాసంలో చేర్చారు. కాని ఇది వికీపీడియా మార్గదర్శకాలుకు విరుద్ధం.వికీపీడియాలో చేర్చే సమాచారం కాపీరైట్ చట్టానికి లోబడి ఉండాలి.అందువలన ఆ సమాచారం పూర్తిగా తొలగించబడింది. గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:12, 18 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]