చర్చ:గోన గన్నారెడ్డి (నవల)
ఎవరు తండ్రి? ఎవరు కొడుకు?
[మార్చు]అడవి బాపిరాజు నవల గోనగన్నారెడ్డి లో ప్రారంభానికి ముందు నవలాకాల చరిత్రలో ఆమెకు (రుద్రమదేవికి) దక్షిణహస్తంగా మహామాండలికప్రభువు, మహాసేనాధిపతి గోనగన్నారెడ్డి వర్ధమానపురం (నేటి వడ్డమాని) రాజధానిగా పశ్చిమాంధ్ర భూమి ఏలుతూఉండేవాడు. అతని కుమారుడు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదకావ్యం రచించి ప్రఖ్యాతి పొందాడు. అని ఉంది. నవలలో మాత్రం గోన గన్నారెడ్డి తండ్రి గోన బుద్ధారెడ్డి అని ఉంది. నవల కల్పన అయ్యుండచ్చు కాబట్టి ముందు పేర్కొన్న వరుసనే వ్యాసంలో పేర్కొనడం జరిగింది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఎవరిదగ్గరైనా ఇతర మూలాలుంటే తెలపండి. పవన్ మీకు ఏమైనా తెలుసా? రవిచంద్ర (చర్చ) 12:58, 22 మే 2019 (UTC)
- వెతికి చూసి చెప్తానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 16:32, 22 మే 2019 (UTC)
వీరుడు/నవల
[మార్చు]గోన గన్నారెడ్డి ఒక కాకతీయ వీరుడు. అతని గురించిన వ్యాసం వేరుగా తయారుచేసి, పిదప గోన గన్నారెడ్డి (నవల) కు అవసరం అయితే వేరు వ్యాసాన్ని తయారుచేస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 12:41, 22 జూన్ 2019 (UTC)