చర్చ:చతుర్వేదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చతుర్వేదాలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 34 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసము[మార్చు]

వేదకాలము గురించి నేను వ్రాయు కొన్ని విషయములు కొందరి దృక్పథములో వివాదాస్పదము కావచ్చు. చర్చించ ప్రార్థన.Kumarrao 16:25, 18 ఆగష్టు 2009 (UTC)


కుమార్రావు గారు! వేదకాలం గురించి ఒక మాట. ఇంచుమించు అందరూ చరిత్రకారులు ప్రాక్పశ్చిమం అంతటా ఒప్పుకొన్నదేమిటంటే భారతయుద్ధం జరిగి ఇప్పటికి 5600 వేల సంవత్సరములు అయ్యింది. భారతయుద్ధ ప్రారంభం లో సర్వవేద/ఉపనిషత్సారమైన భగవద్గీత శ్రీకృష్ణుని చే అర్జనునికి ఉపదేశించడం జరిగింది. ఒకవేళ భగవద్గీత అంతా ప్రారంభసమయంలో చెప్పలేదనుకొన్నా, భారతయుద్ధం అంతా అయ్యింతర్వాత భారత రచనలో వివరించడం జరిగిఉండొచ్చు. భారతయుద్ధ సమయనికి చాలా సంవత్సరముల ముందే వేదవిభజన జరిగి ఉండాలి. అంతే కదా! అప్పటికే ఉన్న మునులు/ఋషులు ఒక్కక్కరు విడివిడిగా ఎక్కడెక్కడో గానం చేస్తూ ఉన్న వేదాలన్నిటిని వ్యాసులవారు సంగ్రహించి వాటిని ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించి/విభజించి వేదవ్యాసులయ్యారు. అయితే ఆవేదాలు అప్పటికి కొన్ని పదుల, వందల, వేల సంవత్సరముందర నుంచే ఒకరి తర్వాత ఒకరు గానం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పారు వేదములను విభజించిన తర్వాత వాటికి ఋక్/యజు:/సామ/అధర్వణ వేదాలని పేర్లు పెట్టారని. అంటే నాలుగు వేదాలు ఇంచుమించు ఒక్కసారే గానం చెయ్యబడి ఉండాలి. ఈవేదాలు క్రీ.పూ. 1700 కాదు, అంతకు ముందే ఎప్పటి నుండో వందలు, వేల సంవత్సరాల ముందువి అయివుండే అవకాశం ఎక్కువ. ఏమంటారు? bhavani 11:16, 20 ఆగష్టు 2009 (UTC)భవానీ శంకరమ్.

శంకరం గారు, మీతో విభేదిస్తున్నందుకు క్షంతవ్యుడను. ఈ విషయముపై అన్ని కోణముల నుండి విశేష పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇవన్నీ "The Vedic People: Their History and Geography", Rajesh Kochar, 2000, (Orient Longman, ISBN 8125013849) లో వివరముగా చర్చించబడ్డాయి. ఆంగ్ల వికీపీడీయా లోని en:Rigveda వ్యాసములో కూడ మంచి సమాచారమున్నది. చూడగలరు. Kumarrao 18:31, 22 ఆగష్టు 2009 (UTC)

నేను కూడా కుమార్రావుగారితో ఏకీభవిస్తున్నాను. వివిధ పరిశోధనా గ్రంథాలద్వారా తెలియవచ్చే సమాచారం ఏమిటంటే వేదగానం క్రీ.పూ. 1700 - క్రీ.పూ. 2100 మధ్య జరిగి ఉండవచ్చునని ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం - శ్రీహరి. (Gangulas)

క్రీస్తు పూర్వం ఎటువంటి చరిత్ర పుస్తకాలు వ్రాయబడలేదు, కేవలం సాహిత్య పుస్తకాలే తప్ప. వేదకాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను దైవాలు తప్ప ఇతర దైవాలు ఆరాధింపబడలేదు. వేదకాలం తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వంటి దైవాలు మరుగునపడి, రాముడు, కృష్ణుడు వెలుగులోకి వచ్చారు. దానికి కారణం రామాయణం, మహాభారతం అను ఇతిహాస కావ్యాలు వ్రాయబడటమే. మహాభారతం, రామాయణం వేదకాలం తర్వాత వ్రాయబడిన సాహిత్య పుస్తకాలు. మనిషి సన్మార్గంలో నడవడానికి వ్రాయబడ్డాయి. అవి చరిత్ర పుస్తకాలు కాదు. అసలు ఆర్యుల రాక మునుపు మనదేశంలో సంస్కృత భాష లేదు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:22, 24 ఏప్రిల్ 2015 (UTC))[ప్రత్యుత్తరం]

వేద కాలము[మార్చు]

  • వేద కాలము, మాక్స్ ముల్లర్ వారు కీ||పూ|| 1200 సం|| మించి ఉండదని, డా.ఎస్.రాధాకృష్ణ గారు కీ||పూ|| 1500 - 600 సం|| లలో ఆర్యులు ఇతర ప్రదేశముల నుండి భారత దేశం వచ్చి, స్థిర నివాసము చేసినారని, అదే విధముగా శ్రీ లోకమాన్య తిలక్ గారు షుమారు 7-8 వేల సం|| అని ఉటంకించినారు. వేద కాలము నిర్ణయించుట, అతి ప్రాచీన గ్రంథములందునూ వేద కాలము ఏ ఒక్కరునూ సరి అయిన వివరణ ఇవ్వజాలక పోతిరి. వేద సంహిత విజ్ఞాన రాశి వర్తమాన కాలము నందు అతి కొద్ది అణుబొద్దు పాఠ్యం భాగము లభ్యమగు చున్నందున కాల నిర్ణయము లెక్కించుట వారి వారి ప్రజ్ఞను బట్టి నిర్ణయించు చున్నారు. ఈ క్రింది శ్లోకము చూడండి.
  • శ్లో|| యుగం ప్రతి ధియాం పుంసాం న్యూధికతయా మునే |
  • క్రియాంగపాఠ వైచిత్ర్య యుక్తా న్వేదాన్ స్మరామ్యహం ||
  • అని భసుండుడు మహర్షి అయిన వశిష్టుడు నకుచెప్పినట్లు తెలియచున్నది.
  • ప్రస్తుతము లభించుచున్న సూక్ష్మ వేద భాగము, కొన్ని వేల సం|| క్రితము మహర్షులు దర్శించిన వేదములు వేరు వేరు అని మరో వాదన కూడా ఉన్నది.
  • ప్రస్తుతము లబించుచున్నభగవద్గీత (15-115) లో బోధించిన ప్రకారము భగవంతుడు ఒక్కడే సర్వ ప్రాణులయందు వశించు చున్నాను అని ప్రవచించెను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:13, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

పలు శాస్త్రీయ ఆధారములను బట్టి క్రీ.పూ. 1700 సబబు గా తోచుతున్నది. మనకు దొరికిన వేద సంపదనే మనము పరిగణించేది. ఆర్యులు మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 3000-4000 వర్షముల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ప్రవేశించారు. అటు పిమ్మట వేద ఉచ్చారణ ఆరంభమైనది. రాజేష్ కొచ్చర్ గారి పుస్తకము చదువ ప్రార్ధన. Kumarrao 16:24, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]