చర్చ:జటప్రోలు సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొల్లాపూర్ సంస్థానం మరియు జటప్రోలు సంస్థానాలు రెండూ ఒకే ప్రాంతానివే. ఈ వ్యాసం నుంచి లింకున్న జటప్రోలు సంస్థానం చూస్తే ఈ రెండు వేర్వేరు అనే అనుమానం వస్తుంది. ఈ రెండింటి వీలీనం జరగాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:53, 29 సెప్టెంబర్ 2012 (UTC)

అవును ఈ సంస్థానం గురించి చదువుతున్నప్పుడు నాకూ అలాగే తోచింది. విలీనం చేస్తాను --వైజాసత్య (చర్చ) 04:24, 3 అక్టోబర్ 2012 (UTC)
మొదట వీరు కొల్లాపూర్ (చరిత్రలో దీనికి కులుములపల్లి, కొంగలపల్లి అని కూడా పేర్లున్నాయి) రాజధానిగా పాలించినప్పుడు జటప్రోలు సంస్థానంగా పిలువబడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు పెంట్లవెల్లి (ఇది కొల్లాపూర్ సమీపంలోనిదే) రాజధానిగా పాలిస్తున్నప్పుడు కొల్లాపూర్ సంస్థానంగా పిలువబడింది. వీరందరూ సురభి వంశీయులే. అందుకే ఈ సంస్థానానికి సురభి సంస్థానం అని కూడా అంటుంటారు. దాదాపు 13 శతాబ్దాల పాటు ఎందరు రాజులు మారిననూ, ఎన్ని రాజ్యాలు మారిననూ ఈ సంస్థానం వారందరికీ సామంతరాజ్యంగా ఇది కొనసాగింది. ఈ ప్రాంతంలో వీరి చారిత్రక కట్టడాలు, కోటలు, చెరువులు, చేపట్టిన ఘనకార్యాలు అనేకం ఉన్నప్పటికీ వీరి "చరిత్ర" చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కలేదు (ఎక్కించలేదు). సి. చంద్ర కాంత రావు- చర్చ 13:07, 3 అక్టోబర్ 2012 (UTC)
  • సి. చంద్ర కాంత రావు గారూ ఒక శుభవార్త. మీరు ఆవేదన పడిన జటప్రోలు సంస్థానం చరిత్ర గురించి ఓ తీగ దొరికింది. నేను పనిచేస్తున్న డీఎల్ఐ జాబితాల పేజీల్లో గత శతాబ్ది నాటి పూర్వాచార పరాయణుల పత్రిక ఒకటి దొరికింది. దానిలోని గ్రంథసమీక్షల్లో జటప్రోలు సంస్థానం చరిత్ర గురించిన గ్రంథసమీక్షా ఉంది. క్లుప్తంగా జటప్రోలు వారి చరిత్ర ఆ మూడు పేజీల సమీక్షలో ఉంది. మొత్తానికి ఎక్కడో మగ్గుతూ ఈ జటప్రోలు సంస్థాన చరిత్ర ఉందీ అనేందుకు ఇది ఆధారం. ప్రస్తుతానికి నేను జటప్రోలు సంస్థాన చరిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకుని పేజీని అభివృద్ధి చేస్తాను. మనకు కాలం అనుకూలించిననాడు, ఏ విశ్వనాథ్ గారి గ్రంథాలయాల కాటలాగులలోనో ఆ పుస్తకం ఎక్కడవుందో దొరకవచ్చు, మనం వ్యాసాన్ని వైభవోపేతంగా తయారుచేసుకోగలమని నమ్ముతూ ఉందిలే మంచికాలం ముందుముందునా అనుకుందాం. --పవన్ సంతోష్ (చర్చ) 08:46, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, జటప్రోలు సంస్థానం చరిత్ర గురించిన నా ఆవేదన ఆ సంస్థాన చరిత్ర గ్రంథాలు లేవని కాదు. వీరి ఘనమైన చరిత్ర మాత్రం చరిత్ర పుస్తకాలలో లేదనిచెప్పడమే నా ఉద్దేశ్యం. దక్షిణ భారతదేశంలోనే అతి సుధీర్ఘకాలం శతాబ్దాల తరబడి పాలించిననూ భారతదేశ చరిత్రలోనూ, దక్షిణ భారతదేశ చరిత్రలోనూ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ వీరి చరిత్ర లభ్యంకావడం లేదు అంటే చరిత్ర పుస్తకాలలో ఎక్కించలేదని చెప్పడమే నాఉద్దేశ్యం. మీరు వెతికిన పుస్తకంలో ఉన్న సమాచారం తెవికీలో చేర్చి సాధ్యమైనంతవరకు వ్యాసాన్ని పరిపూర్ణం చేయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:48, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, సమాచారం చేర్చడానికి ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. దాదాపు 8-9 సంవత్సరాల క్రిందట పాలమూరు జిల్లాకు సంబంధించిన ఏ సమాచారం కూడా అంతర్జాలంలో లభ్యంకాని స్థితిలో నేను తెవికీలో రంగప్రవేశం చేసి తెలుగు జిల్లాలలోనే మహబూబ్‌నగర్ జిల్లా సమాచారాన్ని అగ్రస్థానంలో ఉంచాను. ఇక్కడి సమాచారం కాపీచేసుకున్న పలు బ్లాగులు, వెబ్‌సైట్లలో కూడా ఈ జిల్లాకు చెందిన సమాచారం కనిపిస్తుంది. నేను ప్రారంభంలో రచించిన పలు వ్యాసాలు పత్రికలు కూడా కాపీ అయ్యాయి. నేను అప్లోడ్ చేసిన పలు బొమ్మలు మేగజైన్‌లలో కవర్ పేజీలుగా కూడా వచ్చింది. కాని వారు మాకెలాంటి గుర్తింపు ఇవ్వలేరు. ఈ విషయంలో నేను తెవికీ దృష్ట్యా చేసిన పలు సూచనలు ఇక్కడ కూడా ఎవరూ పట్టింకోలేరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:04, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారూ నా వరకూ నేను మీరు చేసే కొన్ని సూచనలు చాలా విలువైనవిగా భావిస్తూంటాను. ఏదేమైనా పెద్దలు చెప్తూంటారు కదా విత్తిన విత్తు ఎప్పటికైనా వృక్షమౌతుంని. ప్రస్తుతానికి ఉంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:46, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేరులో సంస్థానం గురించి

[మార్చు]

సంస్థానం అన్న పదాలు ఈ జమీందారీలకు అనూచానంగా రావడం మనకందరకూ తెలిసిందే. ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ, ఆంధ్ర దేశ సంస్థానములు సంగీత వాఙ్మయం వంటి పరిశోధనల పేర్లలోనూ వీటిని సంస్థానాలనే ప్రస్తావించారు. ఐతే టెక్నికల్ గా వీటివేటికీ సంస్థానం స్థాయి లేదు, జమీందారీలనే బ్రిటీష్ ప్రభుత్వ రికార్డుల వ్యవహారం. కేవలం బనానపల్లి సంస్థానానికి మాత్రమే సంస్థానం స్థాయివుండేది. ఈ నేపథ్యంలో పేర్లలోని సంస్థానం కొనసాగిస్తే సరియా? మార్చాల్సివుంటుందా? ఈ విషయంలో వ్యాసాన్ని ప్రారంభించి, అభివృద్ధి చేసిన వైజాసత్య గార్ని, చంద్రకాంతరావు గార్నీ చర్చకు ఆహ్వానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:18, 11 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]