Jump to content

చర్చ:తెలుగు కులాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు కులాల వారు చేపలు పట్టే కులాల వారు కాదు

[మార్చు]

తెలుగురాష్ట్రాలలో కులాలు వ్యాసంలో ముద్రించినట్లు ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు కులాల వారు చేపలు పట్టే కులాల వారు కాదు.

ముదిరాజు(ముదిరాజులు పల్లవ రాజులకు సామంతులు, వెలమ రాజులకు, పల్లవ రాజులకు సైనికులుగా పనిచేశారు)

ముత్రాసు

తెనుగొల్లు

పైన తెలిపిన ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు అని పిలువబడే కులాల వారు సాంప్రదాయ తోటమాలి కులవృత్తి అనగా దుంపలు, పండ్లు విక్రయించడం మరియు తోటపని (గార్డెనింగ్). నేడు ఆధునిక యుగములో ఎవరు ఏ వృత్తి కావాలంటే వారు ఆ వృత్తి చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. 1964 సంవత్సరములో ఈ కులానికి చెందిన వారు కొందరు చేపలు పట్టుచున్నారని, వారు సాంప్రదాయ మత్స్యకార కులాలకు (ఆదిమ మత్స్య తెగకు) చెందినవారు కాకపోవడం వలన వారు ప్రభుత్వ రాయితీలు పొందలేక పోతున్నారని రెవెన్యూశాఖ వారు ఇచ్చిన నివేదికలు అందించారు. ఆ నివేదికల ఆధారంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూశాఖలో "బోర్డు ఆఫ్జీ స్టాండింగ్ ఆర్డర్స్ 211" ను సవరించి జీ.ఓ. యమ్.యస్. నెం. 98 సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు తెచ్చి వారికి చేపల పరిశ్రమలో ప్రభుత్వ రాయితీలు అందించడం జరిగింది. నేడు వీరువారు అని కాకుండా అందరు లాభసాటిగా యున్న చేపల పరిశ్రమలో చేరి చేపలు పట్టుచున్నారు.

తెలుగురాష్ట్రాలలో కులాలలో చరిత్రకారులు, ప్రభుత్వం గుర్తించిన చేపలు పట్టే సాంప్రదాయ కులాలు (1) బెస్త (2) గూండ్ల (3) గంగవర్ (4) గంగపుత్ర (5) పల్లి (6) ఓడబలిజ (7) పట్టపు (8) నెయ్యల (9) జాలరి (10) అగ్నికుల క్షత్రియ (11) వహ్నికుల క్షత్రియ (12) వన్నెరెడ్డి (13) వన్నెకాపు (14) పల్లికాపు (15) పల్లిరెడ్డి (16) బోయి. కొంతకాలంక్రితం సెంట్రల్ ఓ.బి.సి. జాబితాలో 'వన్నియార్' కులనామాన్ని చేర్చారు. ఈ మార్పు తెలుగురాష్ట్ర పునర్విభజనకు ముందే జరిగింది. కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెంట్రల్ ఓ.బి.సి. జాబితాలో 'వన్నియార్' కులనామాన్ని ఇంకనూ చేర్చవలసియున్నది. కాగా అగ్నికుల క్షత్రియ, వహ్నికుల క్షత్రియ, వన్నెరెడ్డి, వన్నెకాపు, పల్లికాపు, పల్లిరెడ్డి, పల్లి, వన్నియార్ అనేవి ఒకే కులంకు పర్యాయపదములై ఉన్నవి. వీరు పల్లవ వంశీయులు. స్వర్ణకారులుగాను, వ్యవసాయకూలీలుగాను, వ్యవసాయదారులుగాను, బోట్ నిర్మాణములోను, మత్స్యవృత్తిలోనూ, వివిధ ఉద్యోగాలలోను ఉన్నారు.

నేడు ఆధునిక యుగంలో చేపల పరిశ్రమలో చేపలు పట్టే వారందరూ చేపలు పట్టే కులాల వారు కాదు. అట్లయితే, బట్టలు కుడుతున్న ప్రతి ఒక్కరు దర్జీ కులానికి చెందిన మేరుక్షత్రియులు అవుతారు. కిరాణా కొట్టు నడిపించు ప్రతి ఒక్కరు వైశ్యులు అవుతారు. బ్యూటిపార్లర్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరు నాయిబ్రాహ్మణులు మంగలివారు అవుతారు. డ్రై క్లీనింగ్ చేస్తున్నవారు అందరు చాకలి రజకులు అవుతారు. మద్యం అమ్మేవారు అంతా చేట్టుబలిజ, గౌడ్స్ అవుతారు. బట్టలవ్యాపారం చేసే ప్రతి ఒక్కరు పద్మశాలులు అవుతారు.

ఈ వ్యాసంలో మార్పులు చేయాలి

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఇటీవల కాలంలో ఈ వ్యాసంలో అజ్ఞాత వాడుకరుల ఎక్కువగా దిద్దుబాట్లు జరుపుతున్నారు.ఈ వ్యాసంలో కొన్ని అంశాలు మూలాలు లేవు. ఉదాహరణకి :భిక్షగాళ్ళు జోగి (ధార్మిక బిచ్చగాళ్ళు) జోశినాడివాళ్ళు (జోశ్యులు, ఊరి పూజారులు) భవసర క్షత్రియులు (బట్టల వ్యాపారులు) ఆర్య క్షత్రియులు అనీ రాశారు వీటికి సరైన మూలాలు లేవు. ఇవి సున్నితమైన అంశాలు దీనిపై ఒక నిర్ణయం తీసుకోండి.ఆంగ్లంలో తెలుగు కులాల గురించి ఒక వ్యాసం ఉంది.[1] ఇలా రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Ch Maheswara Raju (చర్చ) 12:39, 4 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం: ఈ పేజీలో చేసిన మొత్తం దిద్దుబాట్లలో దాదాపు 40%, చేర్చిన బైట్లలో దాదాపు 47% అజ్ఞాతలు చేసినవే. వేటికీ మూలాల్లేవు. పేజీలో సమాచారాన్ని తగు మూలాలతో తిరగరాయాల్సిన అవసరం ఉంది. అజ్ఞాతల నుండి ఒక 3 నెలల పాటు పేజీని సంరక్షిస్తున్నాను. ఆ తరువాత పరిస్థితిని బట్టి తగు నిర్ణయం తీసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:35, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

ఇందులో మా రజకుల (చాకలి) గురించి ఎక్కడ లేదు

[మార్చు]

ఇందులో మా రజకుల (చాకలి) గురించి ఎక్కడ లేదు 2409:4070:4D83:FBF1:281B:C000:9B9F:5AD0 12:46, 24 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]