చర్చ:తెలుగు సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Very nice article!! Kudos to the author. some pointers to make it a feature article !

  • Divide it into sections
  • Add links wherever appropriate and useful.
  • Add some visuals too.

--వైఙాసత్య 12:49, 6 సెప్టెంబర్ 2005 (UTC)

ఈ వ్యాసం గురించి కొన్ని ఆలోచనలు[మార్చు]

  • ఈ వ్యాసం ఒక పత్రికలో వ్యాసానికి రాసినట్టు రాశారు. ఆ తరువాత కష్టపడి వికీకరించడం జరిగింది కానీ ఇందులో చాలా విషయాలు ఒకగాటిన కట్టే ప్రయత్నం జరిగింది.
  • జనజీవనం అంటే ఎవరి జనజీవనమో సరిగా స్పష్టంగా లేదు. కాబట్టి కొంత స్పష్టతకోసం తెలుగు జానపద కళలు అని పేరు మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--వైజాసత్య 19:53, 16 సెప్టెంబర్ 2007 (UTC)
నేను చాలా తెలుగు జానపద కళలను చేర్చాను. అయితే వీటిని విడగొట్టి జానపధ కళలు వర్గంలో వేరు వేరు వ్యాసాలుగా రాస్తే బావుంటుందనిపిస్తుంది. ఇప్పుడు చేర్చిన వాటిని గురించి సమాచారం తెలిసివారు చేర్చగలరు. కృతజ్ఞతలు...విశ్వనాధ్. 05:15, 31 అక్టోబర్ 2007 (UTC)
వీటికి వ్యాసాలు వ్రాయటానికి మీకీ పుస్తకం బాగా ఉపయోగపడుతుందనుకుంటా --వైజాసత్య 06:41, 31 అక్టోబర్ 2007 (UTC)
మూలాల్లో చూపించినట్టుగా ఈ వ్యాసం యావత్తూ లాంగ్వేజ్ టెక్నాలజీస్ అనే సైటు నుండి ఎత్తిపోతలే! అందుకే వ్యాస ధోరణి అలా ఉంది. ఆ సైటు హై.విశ్వవిద్యాలయం వారిదనుకుంటా; ఇప్పుడు లేదు. గతంలో గూగుల్ కాషెలో నేనా వ్యాసాన్ని చూసాను. __చదువరి (చర్చరచనలు) 09:54, 31 అక్టోబర్ 2007 (UTC)

తెలుగు కళలు[మార్చు]

కళలు సంస్కృతిని అర్థం చేసుకోవటానికి నిదర్శనాలైననూ, కళలే సంస్కృతి కాదు. కావున ఇక్కడ ఉన్న కళలన్నీ తెలుగు కళలు అనే వ్యాసంలో విశ్వనాధ్గారు చెప్పినట్టు విభాగాలు (ఉదా: ముద్రణ కళలో కలంకారీ, నాట్యం లో కూచిపూడి, జానపద కళల్లో బుర్రకథ, స్వయంరక్షణా కళల్లో కర్రసాము)గా ఉన్నచో బాగుంటుందని నా (వ్యక్తిగత) అభిప్రాయం. అయితే తెలుగు సంస్కృతి వ్యాసంలో తెలుగు కళల గురించిన ప్రాథమిక సమాచారం ఉంచి, ప్రధాన వ్యాసం లంకెని కూడా ఉంచాలి. అప్పుడు కళలతో బాటు నిర్మాణశైలి, ఆహారపుటలవాట్లు, దుస్తులు, మతం మరియు తత్త్వాల వంటి ఇతర అంశాలపై కూడా అవగాహన పెరుగుతుంది. సంస్కృతిలో భాగంగా నేను చెప్పిన ఈ అంశాలే కాకుండా వేరే ఏ అంశాలు చేర్చవచ్చునో ఇతర సభులు ప్రతిపాదించగల్గితే వాటిని కూడా చేర్చి విస్తరించగలను(ము). - శశి (చర్చ) 05:00, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శశిధర్ గారూ వ్యాసం చాలా బాగుంది. ఇది మంచి ప్రయత్నం. తెలుగు వారి సంస్కృతి, కళలు ఒక్క చోట చేర్చాలన్నిది అద్భుతమైన ప్రయత్నమే. అయితే వ్యాసంలో పలు విషయాలు చోటుచేసుకున్నాయి కనుక ఒక్క దానికి వివరణ కొంత క్లుప్తంగా ఇవ్వాలి. మిగిలిన సమాచారం వివరణలు ప్రధాన వ్యాసాలలో వ్రాస్తే బాగుంటుంది. ఉదాహరణగా పగటివేషాలు. పగటివేషం గురించి కొంత వివరణ ఇక్కడ ఇచ్చి అధికమైన వివరణ పగటివేషాలు ప్రధానవ్యాసంలో వ్రాయడం కాని చేర్చడం కానీ చేయవచ్చు. --t.sujatha (చర్చ) 06:10, 10 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాతమ్మ గారూ, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇతర వాడుకరులు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలుపవచ్చు (అని అనుకొంటున్నాను). ఇతరుల అభిప్రాయాలు కూడా కనుగొని తదనుగుణంగా మార్పులు చేస్తాను. - శశి (చర్చ) 13:19, 11 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]