చర్చ:తెలుగు సినిమా మైలురాళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు సినిమా మైలురాళ్ళు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తొలి తెలుగుసినిమాలు[మార్చు]

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం వాహినీవారి స్వర్గసీమ (1945). ఈ సినిమాకు చాలా రికార్డులు ఉన్నాయి.

జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలచిన తొలి తెలుగు చిత్రం బంగారుపాప (1954). (ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రం పథేర్ పాంచాలి).

ఇవి రెండూ ఒకసారి సరిచూడగలరు.

-త్రివిక్రమ్ 18:25, 29 మార్చి 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

త్రివిక్రమ్, నువ్విచ్చిన వివరాలు సరైనవే. నా దగ్గర తెలుగు సినిమా రికార్డుల గురించిన సమాచారం చాలా ఉంది....సమయాభావం చేత రాయలేకపోతున్నాను...త్వరలో అవన్నీ ఈ వ్యాసానికి కలుపుతాను

--నవీన్ 04:18, 30 మార్చి 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొన్ని వివరాలు కేవలం కోస్తాకి మాత్రమే ఉన్నాయి, వీటిని తెలంగాణాకి సీమకీ కూడా వ్రాస్తే బాగుంటుంది Chavakiran 22:01, 6 ఏప్రిల్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పాక్షిక రంగుల చిత్రం[మార్చు]

వ్యాసంలో అప్పుచేసి పప్పుకూడు మొదటి పాక్షిక రంగుల చిత్రం అని ఉన్నది. ఈ విషయం ఎంతవరకు నిజం?? నేను ఈ సినిమాను హాలులో చూశాను. నా దగ్గర సి డి ఉన్నది. అనేక సార్లు సినిమా చూడటం జరిగింది. ఆ సినిమాలో ఎక్కడా కూడా రంగులు వచ్చినది లేదు. ఒక సారి మళ్ళీ ఎవరైనా చూసి తప్పయితే సరిచెయ్యగలరు. అప్పట్లో సినిమాలో ఎదో ఒక పాటో, సన్నివేశమో రంగుల్లో తియ్యటం ఒక ప్రెస్టేజి సింబల్ గా ఉండేది. పూల రంగడు, కథానాయకుడు సినిమాలలో ఒక్కొక్క పాట రంగులలో ఉన్నది. విజయా సంస్థఎప్పుడూ కూడ అటువంటి చర్యలకు పాకులాడలేదు. అప్పుచేసి పప్పుకూడు లో మాత్రం రంగులలో కనబడ్డ పాటఉన్నట్టు నాకైతే జ్ఞాపకం లేదు. ఒక సారి చూసి, వ్రాసిన సభ్యులు అధారంగా ఏ పాట/సన్నివేశం రంగులలో ఉన్నదో తెలియచేస్తే బాగుంటుంది.--SIVA 17:45, 17 నవంబర్ 2008 (UTC)

ఈ విషయం మీద వ్యాసంలో ఉన్న అంశం తొలగించబడినది--SIVA 23:18, 26 నవంబర్ 2008 (UTC)

మొదటి కౌబాయ్ చిత్రం[మార్చు]

తెలుగులో అసలు కౌబాయ్ సినిమా అనేది వచ్చిందా!! అమెరికాలో కౌబాయ్ సినిమా నేపధ్యం, నేటివిటీ, జీవన విధానం మన భారత దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో లేవు. అయినప్పటికి కొంతమంది ఉత్సాహవంతులయిన నిర్మాతలు/దర్శకులు అంగ్లంలో ఉన్న హాలీఉడ్ కౌబాయ్ సినిమాలను(Franco Nero నటించిన DJANGO వంటివి) తెలుగీకరించి తీయటం జరిగింది. మోసగాళ్ళకు మోసగాడు కంటే ముందుగానే, ఈ విధమైన మూస (genre) లో విజయలలిత నటించిన రౌడీరాణి మొదలయిన సినిమాలు, ఎస్వీ రంగారావు నటించిన జగత్ కిలాడీలు వంటి సినిమాలు వచ్చినాయి. కాబట్టి, తెలుగులో మొదటి కౌబాయ్ సినిమా ఏది అన్న విషయానికి చెందిన మైలురాయి (record)చెప్పటానికి అయా సినిమాలు విడుదలైన తేదీలను చూసి నిర్ణయించవలసి వస్తుంది. మోసగాళ్ళకు మోసగాడు మాత్రం మొదటి తెలుగు కౌబాయ్ చిత్రం కాదు. ఈ విషయం వ్రాసిన సభ్యులు మరొకసారి చూసి తగిన మార్పు చేయగలరు.--SIVA 01:07, 18 నవంబర్ 2008 (UTC)

ఈ విషయం మీద వ్యాసంలో ఉన్న అంశం తొలగించబడినది.--SIVA 23:19, 26 నవంబర్ 2008 (UTC)

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

ఈ వ్యాసం పాఠకులను తప్పక ఆకట్టుకుంటుందని భావిస్తూ ఈ వారం వ్యాసానికి ప్రతిపాదిస్తున్నాను. --Svrangarao 15:04, 19 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాని ఇది వ్యాస రూపంలా లేదే! అందంగా మొదటి పేజీలో ప్రదర్శించడం ఒక ఛాలెంజ్. ప్రయత్నిద్దాము. ప్రస్తుతానికి పరిగణనలో ఉంచండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:15, 19 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
కాసుబాబుగారు. నమస్తే! మీరు ఈ వ్యాస చర్చా పుటలో వ్రాసిన వ్యాఖ్య చదివాను. నాకు చేతనైనంతవరకు వ్యాస రూపాన్ని తేవటానికి ప్రయత్నించాను. ఒకసారి చూసి చెప్పండి. తరువాత, ఈ వ్యాసానికి తెలుగు సినిమా మైలురాళ్ళు అని పేరు మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 19:30, 17 నవంబర్ 2008 (UTC)
శివా! ఈ వ్యాసం మొదలు పెట్టినపుడు ఇందులో ఏమిరాయాలో నాకు అసలు ఆలోచన లేదు. సినిమా ప్రాజెక్టులో ఇలాంటి వ్యాసం ఉంటే బాగుటుందని మొదలు పెట్టాను. కాని ఒక్కొక్కరూ చేసిన మార్పుల కారణంగా ఇది ఆకర్షణీయమైన వ్యాసంలా తయారయింది. ముఖ్యంగా మీరు చివరిలో చేర్చిన సమాచారం చాలా "చిత్రంగా" ఉంది. అభినందనలు. క్రింది విషయాలు గమనించండి.
  • తగిన బొమ్మలు కూడా చేర్చి, తరువాత దీనిని "ఈవారం వ్యాసం"గా పెడదాము.
  • మొదటి పాక్షిక రంగుల చిత్రం, మొదటి కౌబాయ్ చిత్రం గురించి మీరు వ్రాసిన వ్యాఖ్యలు సరయనవే అనిపిస్తున్నాయి. రెండు రోజులు ఆగి ఆ సమాచార భాగాన్ని తొలగించెయ్యండి.
  • తెలుగు సినిమా మైలురాళ్ళు పేరు నాకు బాగానే ఉంది. మరెవరైనా సమర్ధిస్తే పేరు మారుద్దాము. వ్యాసాల పేర్లను గురించిన చర్చ ఒక పట్టాన కొలిక్కి రాదని ఇంతకు ముందటి చర్చల ద్వారా అనిపిస్తున్నది.
  • తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్‌ జాబితా కూడా లాజికల్‌గా ఈ వ్యాసంలోనే ఉండాలనుకొంటున్నాను. కనుక ఆ సమాచారాన్ని ఇక్కడికి ఒక విభాగంగా కాపీ చేస్తే ఎలా ఉంటుంది?

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:24, 18 నవంబర్ 2008 (UTC)

కాసుబాబుగారూ! పేరు మార్పు అనె నేను ప్రదిపాదించటానికి కారణం ఒక్కటే. అది, తెలుగు వికీలో వ్యాసాలకు ఆంగ్ల పదాలతో పేర్లు ఉండటం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలుకాని చోట్ల మన ఎలాగో ఆంగ్ల భాషలోని పదాలను యధాతధంగా తెలుగులోకి తెచ్చి ఇవె తెలుగు మాటలే అన్న విధంగా చేసుకుంటున్నాము. కాని, "రికార్డ్" అన్న ఆంగ్ల పదానికి అనేక అర్ధాలు ఉన్నాయి(నామవాచకంగఅను,క్రీయుగాను). ఈ వ్యాసంలో మనం వాడుతున్న అర్ధం అటువంటి అనేక అర్ధాలలో ఒకటి. అదే అంగ్ల పదాన్ని తెలుగులోకి దిగుమతి చేసే ముందు,మనం అనుకున్న అర్ధాని సరిపొయే తెలుగు పదమేమైనా ఉన్నదా అని కొంత కృషి జరిపి, అటువంటి తెలుగు పదాన్ని వాడటానికి ప్రయత్నించటం సముచితమని, తెలుగు వికీ ద్వార అటువంటి కొన్ని తెలుగు పదాల ఉత్పత్తి/వాడుక గనుక జరిగితే, తెలుగు వికీ నిర్వహణ ఆశయాలలో ఒకటి సాధించటం జరుగుతుంది. "మైలురాళ్ళు" అన్న పదం "రికార్డు" అన్న ఆంగ్లపదానికి బదులుగా ఇప్పటికే కొన్ని పత్రికలు వాడుతున్నాయి.కాబట్టి, ఇతర సభ్యుల అభిప్రాయం కూడ తీసుకుని, సముచితమైన తెలుగు పేరును ఈ వ్యాసానికి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితాను ఈ వ్యాసంలో భాగం చెయ్యకుండా, ఈ వ్యాసంనుండి ఇప్పుడున్నట్టే లింక్ ఉంచితే బాగుంటుంది, వ్యాస నిడివి అసహజంగా పెరగకుండా (పెద్దగా విషయం లేకుండా ఒట్టి జాబితాతో) ఉంచటానికి అవకాశం ఉన్నది.--SIVA 01:16, 19 నవంబర్ 2008 (UTC)

చిత్రశాలల ఫొటోలు[మార్చు]

ఎవరిదగ్గరైనా, మారుతీ సినిమాహాలు, ఊర్వశి థియేటర్ ల ఫొటొలు (పడగొట్టి మళ్ళి కట్టిన కాంప్లెక్స్ ల వి కాదు) ఉంటే ఆ ఫొటోలు వ్యాసంలో చేరిస్తే బాగుంటుంది.--SIVA 01:36, 20 నవంబర్ 2008 (UTC)

చిత్రశాలల మైలురాళ్ళు[మార్చు]

వ్యాసంలో ఈ విభాగం కింద ఇలా వ్రాయబడి ఉన్నది నేడు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక గ్రాస్‌ కెపాసిటీ థియేటర్‌- హైదరాబాద్‌ - ప్రసాద్‌ ఐ మాక్స్‌ (ఒక్క ఆటకు రూ.90,000) నేడు కోస్తాలో అత్యధిక గ్రాస్‌ కెపాసిటీ థియేటర్‌ - వైజాగ్‌- జగదాంబ 70 యమ్‌.యమ్‌. ( ఒక్క ఆటకు రూ.30,060)

గ్రాస్ కెపాసిటీ అంటే ఏమిటి?? టాక్స్ లు పోకముందు వచ్చిన కలెక్షన్ మొత్తమా?? నా ఉద్దేశ్యం ఇటువంటి మైలురాళ్ళు చిత్రశాల సీట్ల కెపాసిటీ ప్రకారం నిర్ణయించినవి వ్రాయటం మంచిది. ఎందుకంటే, ప్రస్తుత వ్యాపార ధోరణులబట్టి, సినిమాకొక టెక్కెట్టు రేటు పెడుతున్నారు. కాబట్టి కలెక్షన్ ప్రకారం (అన్ని టిక్కెట్లు అమ్ముడుపొతే)రికార్డులు సినిమా ప్రకారం మారిపోతాయి, ఒక్ స్టాండర్డ్ ఉండదు.--SIVA 00:17, 22 నవంబర్ 2008 (UTC)

నటీమణుల/గాయకీ/గాయకుల మైలురాళ్ళు[మార్చు]

వ్యాసంలో ఒక్క విజయనిర్మల గురించితప్ప ఇతర నటీమణులు సాధించిన మైలురాళ్ళగురించి లేదు. అలాగే మైలురాళ్ళన్ని దాదాపు నటుల గురించి మాత్రమే ఉన్నాయి, గాయకీ గాయకుల గురించి ఒక్క మైలురాయి కూడ చేర్చబడలేదు. ఆ వివరాలు కూడ వ్యాసంలో చేర్చగలిగితే వ్యాస పరిణితి పెరుగుతుందని నా అభిప్రాయం.--SIVA 01:28, 23 నవంబర్ 2008 (UTC)