చర్చ:దాసి (1952 సినిమా)
ఖర్చులన్నీ ఇస్తామూ కాశీ పోరాదా నువ్వు కాశీ పోరాదా
తల్లిమాట చేదాయె పెళ్ళామే బెల్లమాయె కొడుకును విడిచుండలేను కోడలుండనివ్వదు సమాధానపడకపోతే సాగదు నా ఆట ఇక సాగదు నా ఆట
మూట ఇదిగో ముల్లె ఇదిగో కాశీ దయచెయ్యత్తయ్యా కాశీ దయచెయ్యత్తయ్యా
మనమణ్ణి చూడాలని మనసాయే కోడలా కన్నార చూసిపోతా కనవే ఓ కొడుకుని
అత్తయ్యా ఇదిగో నీ మనమని చూడండి ఇప్పుడైన దయచేసి మీరు కాశీ వెళ్ళండి
పిల్లాడి ఆటపాట కళ్ళారా నే చూసి పోతా మళ్ళీ నేను రానుగదా మాట వినవే కోడలా మాట వినవే ఓ కోడలా
మనమడింత వాడాయె మనసుతీరలేదాయె కాశీకి పొమ్మంటే కదలవేమి అత్తయ్యా
ఇన్నాళ్ళు ఉన్నానింక కొన్నాళ్ళే కాదటే పిల్లాడి పెళ్ళి చూసి వెళ్ళిపోతా కోడలా
పిల్లవాడి పెళ్ళాయె వెళ్ళిపోరాదా మళ్ళీ మాటాడేవా మర్యాద దక్కదు
అత్తవయావు నువ్వు అరుపులెందుకాగవే కలసి పోదాం నువ్వూ నేనూ కాశీకో కైలాసమో
అత్త కూడా ఒకనాడు అత్తింటి కోడాలే కోడలొకనాటికి అత్తగాక మానదు అత్త కోడళ్ళ మధ్య ఆరుపోరులు ఎందుకు ఒకరినొకరు గౌరవించి ఒదిగుంటే పదివేలు పదివేలు పదివేలు కలిసి ఇరవై వేలు
-- ఆత్రేయ,జిక్కి,తిలకం,పేకేటి శివరాం,సి.ఆర్.సుబ్బురామన్,సుసర్ల దక్షిణామూర్తి,1952 దాసి--Nrahamthulla (చర్చ) 01:41, 1 సెప్టెంబరు 2020 (UTC)
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు
- పాత సినిమాల ఎడిటథాన్ వ్యాసాలు