Jump to content

చర్చ:నాస్తికత్వం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నాస్తికులకు ఓ ప్రశ్న అడగండి

[మార్చు]

నాస్తికులు చనిపోతే వారి అంతిమ సంస్కారాలు (cremation) ఏ విధంగా జరుపుకుంటారు?

  • హిందూ మతాచారాల ప్రకారం శవాన్ని దహనం చేస్తారు. (ఖననం చేసే ఆచారమూ వున్నది)
  • యూద, క్రైస్తవ, ఇస్లాం మతాచారాల ప్రకారం శవాన్ని ఖననం చేస్తారు.
  • జొరాస్ట్రియన్ మతాచారాల ప్రకారం శవాన్ని జంతువులు మరియు పక్షులకు ఆహారంగా సమర్పిస్తారు.

పైనుదహరించిన వారంతా ఆస్తికులాయె, వీరేమో నాస్తికులాయె! వీరి కర్మకాండలు, వీరి భిన్న జీవితానికి తగ్గట్టుగా మతసంస్కృతులకు వ్యతిరేకంగా వుండాలిగదా? అలా వున్నదా? వుంటే ఆ ఆచారాలు ఏమిటో మీరూ తెలుసుకోండి, దయచేసి నాకూ తెలుపండి. జవహర్ లాల్ నెహ్రూ తనకు తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు, కాని అతని శవానికి మాత్రం హైందవ సంస్కారాలతో కర్మకాండలు చేశారు. (Nehru suffered a stroke and later a heart attack. He died in the early hours of 27 May 1964. Nehru was cremated in accordance with Hindu rites at the Shantivana on the banks of the Yamuna River, witnessed by hundreds of thousands of mourners who had flocked into the streets of Delhi and the cremation grounds.[1]) అలాగే కమ్యూనిస్టు వృద్ధనేత హరికిషన్ సింగ్ సూర్జీత్, నాస్తికుడిగా ప్రకటించుకున్నవాడు, కమ్యూనిస్టు నేత, కానీ సిక్కుల మత సాంప్రదాయాలైన గడ్డము తలపాగా వదులుకోలేదు. అతను మరణించిన తరువాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ఆదర్శంగా తీసుకున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంస్మణార్థం నిర్మించిన ప్లాట్‌ఫామ్ పై, శవాన్ని దహనం చేశారు. (Surjeet’s body was consigned to flames on an elevated platform built in the memory of late Deen Dayal Upadhyay, a Rashtriya Swayamsevak Sangh (RSS) ideologue and the erstwhile Jana sangh president. Harikishan Singh Surjit’s funeral pier was lit by Surjeet’s sons Paramjeet Singh and Gurucharan Singh, a Punjab CPI-M committee member, at 5.20 p.m. [2]) వీరి గమ్యం ఇంతే, జీవితంలో మతం (వీరి ప్రకారం దాస్యశృంఖనాలు) నుండి విముక్తి మరియు స్వేచ్ఛ పొందడానికి జీవితమంతా పోరాడుతారు, ఆఖరుకు మరణానికి ముందు వీరి సిద్ధాంతాలు వీరి కొరకు "వీక్" అయిపోతాయి. వీరి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలో 'వసీఅత్తు' చేయలేరు, ధార్మిక మార్గాలే శరణ్యం అని మౌనం వహిస్తారు. మరణం తరువాత అవే ధార్మిక విధానాలకు (ప్రకృతి సిద్ధాంతాలకు) బందీలైపోతారు. అదే ఆస్తికుడు, మతం అనే దాస్యశృంఖనాలలోనే ధార్మికమైన ఆచారాలతో జీవిస్తూ, ఆత్మానందమైన జీవితాన్ని గడిపి, మరణించిన తరువాత మోక్షం పొందుతాడు.నిసార్ అహ్మద్ 10:40, 14 డిసెంబర్ 2008 (UTC)

  • నిసార్ గారూ శవాన్నిఎదో ఒకరకంగా తీసెయ్యాల్సిందే.తగలబెడితే హిందూ పద్ధతి అంటారు.పూడ్చిపెడితే క్రైస్తవ ముస్లిం పద్ధతి అంటారు.గుట్టమీద పక్షులకు పారేస్తే ఫార్శీ పద్ధతి అంటారు.ఇప్పుడు కరెంటు దహనం వచ్చిందికదా?నాస్తికులు ఈ అన్ని పద్ధతులూ మంత్రాలు మత కర్మకాండలు లేకుండా అమలు చేస్తారు.గోరా చితికి ఆయన కొడుకులు కాకుండా ఒక దళితుడు నిప్పు పెట్టాడు.శ్రీశ్రీ తన శవాన్ని కె.జి.హాస్పిటల్ కు ఇవ్వాలని కోరాడు.గురుకుల మిత్రా తన శవాన్ని అడ్డంగా కాకుండా నిలువుగా పాతిపెట్టమని కోరాడు కానీ వారి వారసులు అలా చేయలేదు.బి.రామకృష్ణ,హేమలతా లవణం ల అంత్యక్రియలు నాస్తిక పద్ధతిలోనే చేశారు.జ్వాలాముఖి తన శరీరాన్ని హాస్పిటల్ కు ఇవ్వాలని కోరాడు.మరి ఆయన వారసులు రేపు ఎలా చేస్తారో .మరణానికి ముందు వరకు సిద్ధాంతాలు వీక్ కాకుండా మరణ శయ్యపై సైతం ప్రవక్తమాట కాదన్న అబూతాలిబ్ లక్షణాలున్న మొండి నాస్తికులూ ఉన్నారు.ఎందుకొచ్చినగొడవలెమ్మని తమ శవాలను వారసుల ఇష్టానికే వదిలేసిన మెతక నాస్తికులూ ఉన్నారు.నాస్తికుల అంత్యక్రియలు వారసుల అభీష్టాన్ని బట్టే జరుగుతున్నది.వ్యక్తుల పై చర్చ కంటే విషయంపై చర్చ మేలు.--Nrahamthulla 15:03, 14 డిసెంబర్ 2008 (UTC)
మరణానంతరం పార్ధివ దేహాన్ని ఎవిధంగా తీసేస్తారు అన్న విషయం, ఆ వ్యక్తి నాస్తికుడా కాదా అన్న విషయానికి సంబధం ఏమిటి?? మరణానంతరం అ మరణించిన వ్యక్తికి తన శరీరానీ ఏమి చేయాలి అన్న విషయం మీద కంట్రోలు ఉంటుందా?? అతని వారసులు వారికి తోచిన విధంగా వారి నమ్మకాల ప్రకారం చేస్తారు. అనేక మంది తమ కళ్ళను తమ మరణానంతరం దానం చేస్తున్నట్టుగా ప్రకటిస్తుంటారు. వారు నిజంగా మరణించినప్పుడు, ఎంతమంది కళ్ళను ఐ బాంకు వారు తీసుకుని వెళ్ళగలుగుతున్నారు? నర్‌హతుల్లాగారు అన్నట్టు ఎదో ఒక పద్దతిలో నిర్జీవ శరీరాన్ని తరలించాలి. లేదంటే కంపు కొడుతుంది, ప్రకృతికి తెలియదు కదా పాపం మానవులు రకరకాలుగా అనుకుంటున్నారని! నాస్తికులు ఇటువంటి విషయాలమీద ఇలా చెయ్యలి అలా చెయ్యాలి అని నిబంధనలు వ్రాసుకోవటం మొదలు పెడితే, నాస్తికవాదం మరొక మతం అవుతుంది.--SIVA 01:32, 27 డిసెంబర్ 2008 (UTC)

చార్వాకుని గురించి

[మార్చు]

రామాయణంలోనో లేక భారతంలోనో (ఎందులోనో సరిగ్గా గుర్తులేదు) వచ్చే చార్వాకుడు మొట్టమొదటి నాస్తికుడని అంటారు. అప్పట్లో, చార్వాక అని ఒక పత్రిక (వార లేద మాస గుర్తులేదు)నాస్తికత్వం/హేతువాదం విషయాల మీద మాత్రమే మీద నడపబడింది. కాబట్టి, చార్వాకుని గురించి కూడ వ్యాసంలో వ్రాస్తే బాగుంటుంది.

తెలుగు నాట, 1974 నుండి నాలుగైదు సంవత్సరాలు, నాస్తికవాదం మీద ధాం!ధూం!!గా వేడి వేడి చర్చలు జరిగాయి. సింహళీయ హేతువాది ఏ.టి కోవూర్ ఊరూరా తిరిగి హేతువాదం/నాస్తికవాదం ప్రచారం చేశాడు. అదే టైమ్‌లో రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం వ్రాయటం, మరొక ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలత విషవృక్ష ఖండన వ్రాయటం జరిగి ఈ చర్చలకు మరింత ఊపునిచ్చాయి.--SIVA 15:45, 27 డిసెంబర్ 2008 (UTC)

నాస్తిక సూత్రాలు?

[మార్చు]

వ్యాసంలోని నాస్తిక సూత్రాలు చదివుతుంటే,చాలా సూత్రాలు, (కొన్ని చోట్ల సూత్రంలాగ ఉన్నదాని పక్కనే ఇచ్చిన కొంత వ్యాఖ్యలు)వ్రాసినవారి సొంత అభిప్రాయాలలాగ ఉన్నయి. ఇతర సభ్యులు కూడ ఒకసారి చూసి చర్చించగలరు. ఆ తరువాత ప్రముఖ తెలుగు హేతువాదులు/నాస్తికులు అని వ్రాశారు. హేతువాదులందరూ నాస్తికులా???? అలా అయ్యి తీరాలని ఉందా?--S I V A 16:31, 11 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఆస్తిక హేతువాదులు: మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు. నాస్తిక హేతువాదులు:మతరహితులై దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు.--Nrahamthulla (చర్చ) 04:09, 31 అక్టోబర్ 2012 (UTC)

విస్తరణ సహాయం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

నాస్తికత్వం కూడా నాస్తికులు వ్యాసానికే రీ-డైరెక్టు చేయబడి ఉన్నది. నాస్తిక వాదం వేరొక వ్యాసంగా ఉన్ననూ, అది ఒక ప్యారా కే పరిమితమైనది. ఆంగ్ల Atheism ను అనువదించదలచుకొన్నాను. ఈ లంకెను ఏ వ్యాసంతో కలపాలి? ఏ వ్యాసం దేనితో విలీనం చేయాలో, ఏ వ్యాసం విస్తరించాలో, ఏ వ్యాసానికి ఆంగ్లవ్యాసం లంకె కలపాలో తెలిపితే సాధ్యమైనంత త్వరలో విస్తరణ చేపడతాను. - శశి (చర్చ) 16:22, 21 ఆగష్టు 2015 (UTC)

శశి గారూ, నాస్తికుడు వ్యాసాన్ని నాస్తికత్వం నకు తరలించాను. మీరు నాస్తికత్వం అనే ఈ వ్యాసాన్ని విస్తరించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:07, 22 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదాలు కె.వెంకటరమణ గారు. అలాగే చేపడతాను. - శశి (చర్చ) 05:09, 22 ఆగష్టు 2015 (UTC)