చర్చ:పంపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనువాదం మరియు విలీనం[మార్చు]

{{సహాయం కావాలి}} పంపు వ్యాసం మొత్తంగా ఆంగ్లంలో ఉన్నది. ఒక్క పదం కూడా తెలుగులేదు. ఆవ్యాసాన్ని అనువదించి; రెడ్డిగారు చేరుస్తున్న వివిధ రకాల పంపుల్ని (చేతి పంపు, ట్రెడల్ పంపు, తాడు పంపు మొ.,) ఆ వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది. మంచి వ్యాసం తయారౌతుంది.Rajasekhar1961 (చర్చ) 03:26, 22 నవంబర్ 2013 (UTC)

విలీనం వలన వ్యాసాలు మెరుగుపడవు, అందువలన పంపు వ్యాసం అనువదించి, పంపు వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో వివిధ రకాల పంపుల్ని చేరిస్తే సరిపోతుంది. YVSREDDY (చర్చ) 03:40, 22 నవంబర్ 2013 (UTC)
నా చర్చా పేజీ నుంచి రాజశేఖర్ గారి ప్రశ్న నా సమాధానం,
మరొకసారి ఆంగ్ల వ్యాసంతో లింకులు లేకుండా చేస్తే ఆ వ్యాసాల విస్తరణకు లభించే మంచి వనరును నష్టపోతాము. YVSREDDY (చర్చ) 14:05, 23 నవంబర్ 2013 (UTC)
చిన్న మనవి దీనితో పాటు సినిమా వ్యాసంలో అన్ని సినిమా వ్యాసాలు విలీనం చేస్తే ఎలా ఉంటుందో కూడా చర్చించండి. YVSREDDY (చర్చ) 07:14, 25 నవంబర్ 2013 (UTC)
Rajasekhar1961 , YVSREDDY చర్చలకు వ్యాస చర్చాపేజీలే అనువైనవైతే అక్కడే చేయండి. అలాగే చర్చ ప్రారంభించేటప్పుడు శీర్షిక చేర్చితే మంచిది. వాడుకరి చర్చా పేజీలను చర్చగురించి సూచించటానికి తప్ప వాడవద్దు. ఇక ప్రస్తుత చర్చావిషయానికి వస్తే ఇక విలీనం వలన వ్యాసాలు మెరుగపడవు అన్న వ్యాఖ్యకు ఆధారం తెలపలేదు. పొట్టి వ్యాసాలు విలీనం వలన పెద్దదవుతాయి. మామూలు సమాచారం నకళ్లు ఎక్కువచోట్ల వుండకపోవడంతో చదువరులకు అనువుగా వుంటుంది. నిర్వహణ (అచ్చుతప్పులు తిద్దడం, సాధారణ మూలాలు చేర్చడం లాంటివి) కూడా సులువవుతుంది. మరీ పెద్దదైన వ్యాసాలను విలీనం చేయటం వాంఛనీయం కాదు. --అర్జున (చర్చ) 04:52, 28 నవంబర్ 2013 (UTC)
రెడ్డిగారు, ముందు పంపులు వ్యాసాలన్నీ ఒక పంపు వ్యాసంగా తీర్చి దిద్దండి. అది ఒక గ్రంథం లేదా ఒక వికీ వ్యాసానికి మించి అవుతుంది అనుకుంటే అప్పుడు, మీరయినా, వేరెవరయినా ముక్కలు ముక్కలుగా చేయవచ్చును. దీనివల్ల వచ్చే నష్టం ఏమి ఉంటుంది. కాకపోతే నెలవారీ మీ అభివృద్ధి గణాంకాలలో, బ్లాగుల్లో అంకెల లెక్కలు మాత్రము మారతాయి. ఒక పంపు వ్యాసము ఉంటే చదివే వాళ్ళకు వ్రాసిన రచయిత మీద మంచి అభిప్రాయము పెరిగి, మీకు అభిమానులు పెరగడానికి అవకాశము ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:22, 28 నవంబర్ 2013 (UTC)S
విలీనం వలన వ్యాసాలు మెరుగపడవు అన్న వ్యాఖ్యకు ఆధారం తెలపలేదు, ఎందుకంటే తెలపకుండానే తెలుసుకుంటారనుకున్నా అందుకే తెలపలేదు, ఒక వ్యాసం విలీనం చేసినపుడు నేరుగా ఆ వ్యాసానికి సంబంధించిన ఆంగ్ల వ్యాసం చూడటం వీలుపడదు, ఆంగ్ల వ్యాసంను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విస్తరిస్తారు, అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అనువాదం చేసుకోవచ్చు, ఆ విధంగా వ్యాసాలు మెరుగవుతాయి. పంపు వర్గంలో (ఆంగ్లంలో) ఇప్పటికి 125 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ పంపు వ్యాసంలో విలీనం చేయడానికి వీలుపడుతా. YVSREDDY (చర్చ) 05:41, 28 నవంబర్ 2013 (UTC)
ఆంగ్ల వికీకి తెలుగు వికీ అనువాదంగా చూస్తే మీరు చెప్పేదానిలో అర్ధముంది. ఆంగ్ల వాడుకరులు తెలుగు వాడుకరులు చాలావరకు వేరు కాబట్టి ఆంగ్ల వికీలో అనుకూలించినంతవరకే అంటే విధానాలు, మూసలు లాంటివి గ్రహించి వ్యాస పరంగా తెలుగు వికీని దాని అవసరాలను బట్టి తీర్చిదిద్దడం మంచిదని నా అభిప్రాయం. ఆంగ్లంలో మరింత సమాచారం తెలుసుకొనేవారు తెలుగు వ్యాసమునకు జతచేసిన ఆంగ్ల వ్యాసానికి వెళ్లి వారికి కావలసిన సమాచారాన్ని వివిధ పద్దతులద్వారా పొందగలుగుతారు. --అర్జున (చర్చ) 06:22, 28 నవంబర్ 2013 (UTC)
ఇంకొకమాట, మీరు ఈవ్యాసాలన్నీ తెలుగు లోకి అనువదించే వుద్దేశంతో విలీనాన్ని వ్యతిరేకిస్తుంటే నాకైతే ఇబ్బందిలేదు. --అర్జున (చర్చ) 06:27, 28 నవంబర్ 2013 (UTC)
రెడ్డిగారు, వికీపీడియా వ్యాసము అనే దానికి సరిఅయిన అర్థం అంటే ఏమిటో చదివే వాళ్ళకి ముందు బాగా తెలియాలి. ఓ పేర వ్రాసి మనము వ్యాసము అనలేము. ఒకసారి ఈ లింకు [1] లోని ఒక్కొక్క వ్యాస పరిమాణము చూడండి. వీటిలోని ఉన్న వ్యాసాలను ఒక్కొక్కటి తీసుకుని తిరిగి అనేక ముక్కలుగా చేసుకోవచ్చును అవసరాన్ని బట్టి. మీరు వ్యాసమునకు కర్త. మీకు అనేక వ్యాసాలు వ్రాసిన అనుభవం ఉంది. చిన్న చిన్న పేరాలున్న వ్యాసాలు వ్రాయడం, తొలగించుకోవడము, పునస్థాపించుకోవటము, వాటి మీద అనవసరపు చర్చలు, ఇదంతా ఓ వ్యాసకర్తకు అవసరము లేదని నా అభిప్రాయము. ఈ చర్చలు మీకు కొంత కాలానికి తప్పకుండా అర్థము అవుతుంది. మీరు పేరాలు రచయితగా కాకుండా ఒక పెద్ద వ్యాస రచయితగా మేము మిమ్మల్ని ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాము. ఆ పేరు మాకు కావాలి. మీరు అందుకు పూనుకోవాలి. ఆ తదుపరి మీ ఇష్టం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:59, 28 నవంబర్ 2013 (UTC)
ఇప్పుడు పంపు వ్యాసం బాగుంది. ఇతర రకాల పంపుల్ని గురించి కూడా ఆంగ్ల వికీ వ్యాసాల ఆధారంగా వీలుంటే విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 07:01, 28 నవంబర్ 2013 (UTC)
వ్యాస పరిమాణం ఎక్కువగా ఉన్నంత మాత్రాన అది ఆదర్శ వ్యాసం కాదు, నిజానికి ఆదర్శ వ్యాస పరిమాణానికి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాసాలు బ్రౌజింగ్ కొరకు ఎక్కువ సమయాన్ని తీసుకోవడమేకాక నెట్ ఖర్చును కూడా బాగా పెంచుతాయి, కొన్నిసార్లు అవి ఒపెన్ అయ్యే లోపలే పాఠకుడికి బోరుకొట్టి క్లోజ్ చేసేస్తాడు. ఇక నా విషయంలో నేను పేరాలకు పేరాలు రాసేసి పేరాలకు పేరాల రచయితగా పేరు తెచ్చుకోవాలనిలేదు, అక్షరాలను మాల వలె కూర్చి అవసరమైన సమాచారమివ్వగలడన్న అక్షరమాల రచయితగా గుర్తింపు చాలు. మీ YVSREDDY (చర్చ) 02:12, 15 జనవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పంపు&oldid=998599" నుండి వెలికితీశారు