చర్చ:పరమాణువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అణువు మరియు పరమాణువు అనే రెండు వ్యాసములకు ప్రారంభ వ్యాసకర్త ఒకరు కనుక వారే వ్యాసములను వారి మేధోపరంగా విస్తరిస్తేనే మంచిదని నా భావన. వారు ఏమైనా చర్చించినా స్పందించ వచ్చును. వ్యాసముల గురించి ఇప్పుడే చర్చించలేమేమోనని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 14:25, 17 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు తరలింపు గురించి

[మార్చు]

వాడుకరి:K.Venkataramana గారూ, ఈ వ్యాసం ఆంగ్ల వికీలో m:en:Subatomic particles అనే వ్యాసంతో అనుసంధానమై ఉంది. మనం చర్చ: పరమాణు సిద్ధాంతం లో చేసిన చర్చ ఫలితంగా అణువు అనే వ్యాసాన్ని పరమాణువు అనే వ్యాసంగా మార్చాలి. కానీ రావుగారు ఈ వ్యాసం పరమాణువు పేరుతో రాసి ఉన్నారు. ఈ వ్యాసాన్ని ఆంగ్ల పేరును అనుసరించి ఉపపరమాణు కణాలనో లేక పరమాణు కణాలనో మార్చాలి. ప్రామాణిక పాఠ్య గ్రంథాలలో Subatomic particles కు తెలుగులో ఏ పేరు వాడారో సూచిస్తే దాని ప్రకారం దారి మారుస్తాను. - రవిచంద్ర (చర్చ) 11:57, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ వికీడేటాలో సవరించాను. atom ను "పరమాణువు" కు, molecule ను "అణువు" కు వికీడేటాలో సంధానం చేసాను.--కె.వెంకటరమణచర్చ 13:54, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వెంకటరమణ గారూ. కానీ వ్యాసంలో ఉన్న విషయం ఏం చేద్దాం? రావు గారు ఇందులో Subatomic particles గురించి రాసినట్లున్నారు. ఈ విషయాన్ని వేరే వ్యాసంలోకి తరలించి పరమాణువు గురించి మొత్తం తిరగరాయాలనుకుంటున్నాను. ఆ వేరే వ్యాసం పేరు (Subatomic particles) ఏమి ఉండాలా అని మీ సలహా కోరాను. - రవిచంద్ర (చర్చ) 17:05, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, Subatomic particles అనగా "ఉపపరమాణు కణాలు" అని విజ్ఞాన శాస్త్ర పుస్తకాలలో ఉంది. కనుక కొత్తగా "ఉపపరమాణు కణాలు" సృష్టించి విస్తరణ చేయండి. పరమాణువు, అణువు వ్యాసాలలో ఉన్న విషయాలను కూడా సరిదిద్దవలసి ఉంది. --కె.వెంకటరమణచర్చ
ప్రస్తుతం విద్యార్థులు తెలుగు మాథ్యమంలో చదువుతున్న పుస్తకాల ప్రకారం పదాలు వాడితే ఈ వ్యాసం ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇందులో molecule ను బణువు అని, atom ను అణువు అని వ్యవహరించడం జరిగింది. ఇది ఎంతవరకు ఖచ్చితమైనదో నాకు తెలియదు కానీ, భౌతిక శాస్త్ర తెలుగు మాధ్యమంలో రాసిన పుస్తకాల ప్రకారం atom ను "పరమాణువు" కు, molecule ను "అణువు" అని రాస్తే ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు, విజ్ఞానశాస్త్ర ఉపాద్యాయులకు, విజ్ఞాన శాస్త్రాభిలాష గలవారికి అర్థం అవుతుంది. కనుక ఈ వ్యాసాన్ని ఆ రూపంలో మారుస్తాను. తరువాత కాలంలో ఎప్పుడైనా ఈ పదాలకు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు తగిన పదాలు సూచిస్తే అప్పుడు ఉన్నవారు తిరగ రాస్తారు.--కె.వెంకటరమణచర్చ 06:39, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]