Jump to content

చర్చ:పలివెల (కొత్తపేట మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


విజ్ఞప్తి

[మార్చు]
తూర్పుగోదావరి జిల్లా, పలివెల గ్రామములోని శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమమును చాలా శ్రధ్ధతో పురాతన రూపాన్ని కాపాడి దేవాలయం అసలు రూపాన్ని, ఆలయచరిత్రతో పాటుగా ప్రాంతీయ చరిత్రను తెలుకునేందుకు వీలుగా క్రుషి చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఆలయం గురించి పరిశోధన చేసినపుడు, ఈ విధమైన శ్రధ్ధ తీసుకొని జీర్ణోద్ధరణ చేయడం వలన, దేవలయనికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయమంత పురాతనమైనవే ఈ చుట్టుప్రక్కల ఎన్నో అపురూపమైన ఆలయాలు ఉన్నాయి.వానిలో చాలా ఆలయాలు పూర్తిగా తమరూపునే మార్చుకొని వానిని గుర్తించలేనంతగా మారిపోయాయి. దాతలు కోరికమీదో లేక స్థానికులో ఆలయము పటిష్టంగా ఉండాలనో లేక ఆకర్షణీయంగా ఉండాలనో మంచి ఉద్దేశ్యంతోనే ఈ ఆలయాలను ఈవిధముగా పునరుద్ధరించారు. కానీ ఈవిధముగా చేసేటప్పుడు ఆలయాల పూర్వరూపాన్ని ప్రతీ అంగుళమూ ఫోటోల రూపంలో నిక్షిప్తంచేస్తే ఈప్రాంత చరిత్రను మరింత సమగ్రంగా తెలుసుకోవడానికి వీలుకలుగుతుంది. అందువలన ఇటువంటి ఆలయాల జీర్ణోధరణ కార్యక్రమాలు పలివెల ఆలయాన్ని ఆదర్శంగా తీసుకొని జరిపాలని నా ప్ర్రార్ధన.madhuriprakash 06:39, 6 డిసెంబర్ 2007 (UTC)మాధురీరవ్2007

మాధురీరావుగారు వ్యాసంలో వ్రాసిన పై వాక్యాలను చర్చాపేజీలో ఉంచుతున్నాను (ఇది వ్యక్తిగత అభిప్రాయం క్రిందికి వస్తుంది గనుక)--కాసుబాబు 12:13, 5 డిసెంబర్ 2007 (UTC)