చర్చ:పేడాడ పరమేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలోని చాలా అంశాలకు సరైన మూలాలు లేవు. మూలాలు లేని అంశాలు తొలగించబడతాయి. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని అభివృద్ధి చేయండి.➤ కె.వెంకటరమణచర్చ 17:17, 19 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం వ్యక్తిగత ప్రచారం లాగ ఉంది. రైలు ఉద్యమం గురించి అవసరానికి మించి విస్తారంగా రాసారు. అదంతా తీసెయ్యాలి. ఇచ్చిన మూలాల్లో చాలా వరాకు పని చెయ్యడం లేదు. పనిచేసేవి మూలాలుగా పనికిరావు - కొన్ని స్వంత లింకులు (ఉదా: వెహెచ్‌ఎం వీడియోలు) కొన్ని తప్పుదోవ పట్టించే లింకులు (ఉదా: రైల్వే మంత్రుల జాబితా. అది ఈ వ్యాసానికి ఏవిధంగా ఉపయోగం?)
ఏదో ఒక రకంగా పేజీని నింపడం, ఏవో కొన్ని సంబంధం లేని లింకులను మూలంగా చూపే ధోరణి కనిపిస్తోందే తప్ప విజ్ఞాన సర్వస్వ విషయం ఈ పేజీలో కనిపించలేదు. విషయ ప్రాముఖ్యతను నిరూపించకపోతే పేజీని తొలగించాలి. __ చదువరి (చర్చరచనలు) 06:52, 9 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • గతంలో ప్రచురితమైన ప్రముఖ పత్రికా కథనాల్ని మూలాలుగా చేర్చడమైనది. పరిశీలించగలరు. 1990 - 95 మధ్య ఇంతకుమించిన ప్రామాణికాలు ఏవీ లేవు. Pvs (చర్చ) 06:50, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    ప్రస్తుతం వ్యాసంలో ఇచ్చిన మూలాలు వికీ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. __ చదువరి (చర్చరచనలు) 07:04, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • రైలు ఉద్యమం అప్పట్లో పార్లమెంటును స్తంభింపచేసింది. హౌరా - చెన్నై మార్గంలో 12 గంటలు రైళ్ల రాకపోకలు ఆందోళనకారులు నిలుపు చేయటం ఈ పోరాటం తీవ్రతకు అడ్డం పడుతుంది. ఎత్తేసిన రైలు మార్గాన్ని సాధించుకుని బ్రాడ్ గేజ్ గా మార్పించుకున్న ప్రజాపోరాటం గూర్చిన ఈ వ్యాసం ప్రచారం కోసం రాయాల్సిన అవసరం ఏముంది. ఇందులో ప్రతి వాక్యం వాస్తవం అందుకు తగిన మూలాలుగా ఆధారాల్ని, పత్రికల్లో వచ్చిన వ్యాసాల్ని పొందుపరిచాను. పరిశీలించాలని మనవి. అప్పట్లో రైల్వే మంత్రి పేరును గుర్తించటానికి జాబితాను జతచేసానే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. vhm tv లింకు కూడా అటువంటిదే. వాటిని తొలిగించడం మంచిదని మీరు భావించినందున వాటిని తొలిగిస్తున్నాను.
విజ్ఞాన సర్వస్వం పరిపుష్టికి ఈ వ్యాసం దోహద పడుతుందని, చారిత్రకంగా ప్రాముఖ్యతగల నౌపడా - గునుపూర్ రైలు మార్గం అభివృద్ధికి జరిగిన సామాన్యుల ఉద్యమం అన్ని పార్టీల్ని, ప్రజా సంఘాల్ని కలుపుకుని సాగిన పోరాట గమనం భవిష్యత్ తరాలకు ఉపయోగ పడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వ్యాసము పెద్దదిగా ఉందని మీరు భావించినందున మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తాను. వ్యాసాన్ని సాగదీయాలని నాకు ఏ మాత్రం ఆసక్తి లేదని మీరు గమనించగలరు.
ధన్యవాదాలు. Pvs (చర్చ) 07:08, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pvs sarojini గారూ, వ్యాసాన్ని సాగదీయాలనే ఆసక్తి మీకు ఉందని నేను భావించడం లేదండి. అయితే వ్యాసం ప్రస్తుతమున్న రూపు అలా ఉంది. మీరు దాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ముందుగా ఈ వ్యాస విషయానికి తగు ప్రాముఖ్యత ఉందని నిర్థారించవలసిన అవసరం ఉందండి. అది లేకపోతే వ్యాసం తొలగింపుకు గురయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం కోసం వికీపీడియా:విషయ ప్రాముఖ్యత అనే పేజీ చూడండి. ముందుగా విషయ ప్రాముఖ్యతను నిరూపించేందుకు తగు మూలాలను ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. అలాగే విష్యంలో అవసరమైన చోట్లల్లా మూలాలను ఇవ్వండి. వికిపీడియా:మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు అనే రెండు వ్యాసాలను చదవండి. పరిశీలించండి.
ఈ వ్యాసాన్ని తొలగించాలనే విషయమై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పేడాడ పరమేశ్వరరావు వద్ద చర్చ జరుగుతోంది, చూడండి. తొలగించడం అక్కడ ఎవ్వరి ఉద్దేశమూ కాదు. వ్యాసానికి తగు మూలాలను చేర్చి సంస్కరించడమే అందరూ కోరుకునేది. నిజానికి తొలగింపు ప్రతిపాదన పెట్టేముందే వాళ్ళు తగు మూలాల కోసం వెతికే ఉంటారు. అవి లభించకే తొలగింపుకు ప్రతిపాదించి ఉంటారు. నావరకు నేను మూలాల కోసం వెతికాను కాని కనిపించలేదు. మీరైనా తగు మూలాలను చేర్చి వ్యాసాన్ని నిలబెట్టండి. వ్యాసాన్ని మెరుగుపరచడంలో ఏమైనా సహాయం అవసరమైతే అడగండి. తగు సహాయం చెయ్యడానికి నేను సిద్ధం. __ చదువరి (చర్చరచనలు) 07:29, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]