చర్చ:ప్రాంతీయ ఫోన్‌కోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసానికి దారిమార్పు[మార్చు]

అర్జున గారూ, ముందు ఇదే పేరుతో సృష్టిద్దామని అనుకున్నాను.ఒకసారి గూగల్ సెర్జి ఇంజనులో రెండు పేరుబరులకు సేర్చ్ చేయగా "ప్రాంతీయ ఫోన్ కోడ్" పేరుబరికి కేవలం 22,300 ఫలితాలు రాగా, "ఏరియా ఫోన్ కోడ్" పేరుబరికి 2,43,00,00,000కు పైగా ఫలితాలు వచ్చాయి.పేజీ తొలగించకుండా దారిమార్పుగా ఉంచితే బాగుండేదని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 17:38, 31 జూలై 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు , పద బంధాలు వెతికేటప్పుడు కొటేషన్ గుర్తులు చేర్చి వెదకాలి. "ప్రాంతీయ ఫోన్ కోడ్" వెతుకు లింకు కి ఈ రోజున ఒకటి (వికీపీడియా) వ్యాసం మాత్రమే వస్తే, "ఏరియా ఫోన్ కోడ్" వెతుకు లింకు కి 57000 పైగా ఫలితాలు (తెలుగు వికీతో పాటు) అని తెలియ చేసింది. ఇవన్నీ ఆంగ్ల పేజీలు. గూగుల్ అన్వేషణ మరింత ఉపయోగం చేయడానికి తెలుగు పదాలను ఆంగ్ల పదాలుగా మార్చికూడా వెతుకుతుంది. అందుకని గూగుల్ ఫలితాల్ని మన నిర్ణయం నిర్దేశించకూడదు. మన తెలుగు గ్రామ పేజీలలో ఈ వాడుక పెరిగినపుడు గూగుల్ ఫలితాలు ఎక్కువగానే వస్తాయి. తెలుగు ప్రజల వాడుకలో ఏరియా ప్రాంతానికి బదులు సాధారణమైందనుకుంటే దారి మార్పు చేయవచ్చు. -- అర్జున (చర్చ) 03:48, 1 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
-- అర్జున రావు గారూ ! ఈ పేరు చక్కగా ఉంది ఇలా మార్చడం బాగుంది. తెవికీలో వ్యాసాలకు వీలైనంతవరకు పేర్లు తెలుగులోనే ఉంటే బాగుంటుంది.T.sujatha (చర్చ) 04:02, 1 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీ సూచనలతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:10, 1 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]