Jump to content

చర్చ:బంగాళాఖాతం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసంలోని చర్చ

[మార్చు]

ఇంగ్లీషులో గల్ఫ్‌ (gulf) అన్నా బే (bay) అన్నా దరిదాపుగా అర్థం ఒక్కటే. కావాలని వెతికితే ఈ దిగువ చెప్పిన తాడాలు కనిపిస్తాయి:

  • సాధారణంగా గల్ఫ్‌ కంటే బే పెద్దది.
  • గల్ఫ్‌కి చుట్టూ భూమి ఉండి, బయటకి వెళ్లడానికి చిన్న ముఖద్వారం ఉంటుంది, బేకి చుట్టూ భూమి ఉండి, విశాలమైన ముఖద్వారం ఉంటుంది.
  • బేని తెలుగులో అఖాతం అంటారు. గల్ఫ్‌కి తెలుగు పేరు లేదు. గల్ఫ్‌ని కూడా అఖాతం అంటే వచ్చే నష్టం ఏమీ లేదు.
  • బంగాళాఖాతం వైశాల్యం అరేబియన్‌ సముద్రం అంతా ఉంటుంది. బంగాళాఖాతం వైశాల్యం గల్ఫ్‌ అఫ్ మెక్సికో కంటే ఎక్కువ. కనుక దేనిని బే అనాలి, దేనిని గల్ఫ్‌ అనాలి, దేనిని సముద్రం అనాలి అన్నది నిర్ధారించి చెప్పడం కష్టం.— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Arjunaraoc (చర్చరచనలు)
  • "గల్ఫ్‌కి తెలుగు పేరు లేదు." - ఉంది.. "సింధుశాఖ".
  • "గల్ఫ్‌ని కూడా అఖాతం అంటే వచ్చే నష్టం ఏమీ లేదు." - ఈ ధోరణి సరికాదు. విజ్ఞాన సర్వస్వానికి కచ్చితత్వం ముఖ్యం. నియమాలను పాటించాలి.
__చదువరి (చర్చరచనలు) 01:50, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]