చర్చ:బాలభారతి
Jump to navigation
Jump to search
బాలభారతి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.Rajasekhar1961 12:22, 22 అక్టోబర్ 2008 (UTC)
స్థాపించింది ఎప్పుడు?
[మార్చు]వాడుకరి:స్వరలాసిక గారూ నేను వ్యాసంలో చేర్చిన ఫోటో చూడండి. 1955 ఏప్రిల్ నాటి సినిమా రంగం పత్రికలోది, ఈ వ్యాసంలో మాత్రం 70ల్లో మొదలైందని ఉంది. ఆ ప్రకటనలో బాలభారతి మొదలుకానుందని ఉంది. అది వేరే బాలభారతా? --పవన్ సంతోష్ (చర్చ) 09:43, 23 అక్టోబరు 2018 (UTC)
- పవన్ సంతోష్ గారూ బాలభారతి పేరుతో కనీసం ఆరు లేదా అంతకన్నా ఎక్కువ పత్రికలు వెలువడ్డాయి.
(ఆధారం: నా అముద్రిత రచన - తెలుగు పత్రికల సమగ్ర(?) చరిత్ర)
- 1910లో అనంతపురం నుండి అనంతగిరి పేరనార్య సంపాదకత్వంలో పక్షపత్రిక
- 1918లో విజయనగరం నుండి దువ్వూరి జగన్నాథశర్మ సంపాదకత్వంలో సంగీత ప్రధాన పత్రిక
- 1924లో మద్రాసు నుండి జి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో ఒక మాసపత్రిక
- 1939లో కైకలూరు నుండి నంబూరు సుబ్బరాజు సంపాదకత్వంలో మాసపత్రిక
- 1954కు పూర్వం పుంగనూరు నుండి బి.దేశికాచారి సంపాదకత్వంలో ఒక మాసపత్రిక
- 1978లో మద్రాసు నుండి వి.వి.నరసింహారావు, శశిభూషణ్‌ల సంపాదకత్వంలో ఒక పత్రిక. (ప్రస్తుత వ్యాసంలో పేర్కొన్నది.)
కాబట్టి మీరు చేర్చిన బొమ్మలోని బాలభారతి వేరే పత్రిక. ఆ పత్రిక వెలువడిందో లేదో నిర్ధారించవలసి వుంది.--స్వరలాసిక (చర్చ) 01:05, 24 అక్టోబరు 2018 (UTC)