Jump to content

చర్చ:బుడ్డా వెంగళరెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

విషయ నిర్ధారణ కావాలి

[మార్చు]

బుడ్డా వెంగళ రెడ్డి డొక్కల కరువులో చాలా గొప్ప కృషి చేసిన మహనీయుడని వ్రాశారు. ఆయన గురించి ఆనోటా ఈనోటా నేనూ విన్నాను. కానైతే ఇక్కడ 1866లో డొక్కల కరువు వచ్చిందనీ వ్రాసుంది. డొక్కల కరువు వ్యాసమంతటా ఆ కరువు 1832-33లో వచ్చిందని వ్రాసుంది. నందన నామ సంవత్సరమైన 1833లో వచ్చిన కరువుకు నందన కరువు అన్న వాడుక కూడా ఉంది. దాని ప్రకారం కోమలేశ్వరం పిళ్ళై, ఏనుగుల వీరాస్వామయ్య వంటివారు నందన కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అలానే బ్రౌన్ దొర వ్యాసం చూస్తే 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అని వుంది.
పోనీ బుడ్డా వెంగళరెడ్డి 1833లోనే నందన కరువులో సేవలు చేశాడని అందామనుకున్నా వెంగళరెడ్డి 1840లో జన్మించాడాయెను. నాకు అవగాహన ఉన్నంతవరకూ బుడ్డా వెంగళరెడ్డి కృషికీ గంజి కరువుకీ సంబంధం ఉంది. అయితే ఇదంతా సుస్పష్టంగా నిర్ధారణ కావాల్సి ఉంది. దయచేసి ఈ విషయంపై వైజా సత్య గారు, రాజశేఖర్ గారూ, విశ్వనాథ్ గారూ కాస్త దృష్టిపెట్టి చర్చిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 08:56, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, మీరన్నది కరెక్టే. వెంగళరెడ్డి జన్మించిన సంవత్సరంపై కొద్దిగా తర్జన భర్జనలున్నా నందన కరువు కాలానికి మహా అయితే చిన్నపిల్లవాడుగా ఉండి ఉండవచ్చు. వెంగళరెడ్డి కాలంలో వచ్చిన కరువును డొక్కల కరువు అని జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు పొరబడినట్టున్నారు. వెంగళరెడ్డి మీద విస్తృత పరిశోధన చేసిన తంగిరాల సుబ్బారావు గారు తాము వ్రాసిన రేనాటి సూర్య చంద్రులు పుస్తకంలో 1866లో సంభవించిన కరువును ధాత కరువుగా వ్యవహరించారని చెప్పారు. కానీ 1866 ధాత నామసంవత్సరం కాదనుకుంటా. ధాత నామసంవత్సరం అప్పట్లో 1876లో వచ్చింది. ఆయనే ఇంకో మూలంలో క్రోధన, క్షయ సంవత్సరాల్లో కరువు వచ్చిందన్నారు. ఇది ఆంగ్ల సంవత్సరంతో సరిపోతుంది. కాబట్టి కరువు పేరును పక్కన పెడితే, అనేక మూలాలను అనుసరించి వెంగళరెడ్డి 1866లో అనంతపురం, కర్నూలు పరిసరాల్లో సంభవించిన కరువులో ఎనలేని సహాయం చేశారన్నది నిర్వివాదాంశం --వైజాసత్య (చర్చ) 09:39, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ ధన్యవాదాలు. నేను ఈ విషయంపై తగిన మార్పులు చేస్తాను. ముఖ్యంగా నందన కరువు లేదా డొక్కల కరువు వ్యాసంలో బుడ్డా వెంగళరెడ్డి పేరును తొలగించి ఇక్కడ కూడా తదనుగుణమైన మార్పులు చేపడతాను. వెనువెంటనే మంచి సమాచారంతో ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:43, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]