చర్చ:బూదాటి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిమిత కాలం పాటు వ్యాసం సంరక్షణ[మార్చు]

అజ్ఞాతంగా (ఐపీ ఎడ్రసులతో) ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా తొలగించి, ఖాళీ చేస్తున్నారు. పైగా నిర్వాహకులు, వాడుకరులు ఆ మార్పులను తిప్పటికొట్టినా గంట గడవకుండానే తిరిగి ఖాళీ చేస్తున్నారు. జీవించివున్న వ్యక్తుల జీవితచరిత్రలపై ఇటువంటి దాడులు జరగడం మరింత జాగ్రత్త వహించాల్సిన విషయం కాబట్టి నేటి నుంచి ఒక నెలరోజుల పాటు ఈ వ్యాసాన్ని నమోదుచేసుకున్న వాడుకరులు తప్ప ఐపీ అడ్రసులతో మార్పుచేర్పులు చేయలేని విధంగా సంరక్షిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:43, 7 మే 2018 (UTC)

అపరిమిత కాలం సంరక్షణ[మార్చు]

వ్యాసాన్ని ఓ నెల రోజుల పాటు సంరక్షిస్తే, సరీగ్గా నెల తిరగ్గానే వచ్చేసి మళ్ళీ వ్యాసాన్ని ఖాళీచేసేస్తున్న అజ్ఞాత మహాశయుడిని చూసి నేర్చుకోదగ్గది ఏమైనా ఉందంటే అది సమయపాలన. జీవించి ఉన్న వ్యక్తి గురించిన వ్యాసాన్ని ఖాళీచేస్తూండడం, ఇంత సమయం పాటించి పక్కాగా దాడిచేయడం గమనించి ఈ వ్యాసాన్ని అపరిమిత కాలం సంరక్షిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:02, 8 జూలై 2018 (UTC)