Jump to content

చర్చ:మైలవరం మండలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మండలంలో గ్రామాల జనగణన విషయాలు

[మార్చు]

@యర్రా రామారావు గారు, మీరీ మధ్య మండలాల వ్యాసాలలో గ్రామాల జనగణన విషయాల పట్టిక చేర్చటం గమనించాను. ఈ వివరాలు, సంబంధిత గ్రామ వ్యాస పేజీలో, వికీడేటాలో వుంటాయి, కాబట్టి ఇక్కడ మరల చేర్చటం వలన వ్యాస పరిమాణం పెరగటమే గాని పెద్దగా అదనపు విలువ చేకూరదు. ఇటువంటి సమాచార కావలసిన వారికి వికీడేటా క్వెరీద్వారా తాజా సమాచారం పొందటం వీలవుతుంది. కావున ఈ జనగణన వివరాలు చేర్చవద్దని నా కోరిక. పరిశీలించండి. అర్జున (చర్చ) 06:31, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారూ పైన తెలిపిన అభిప్రాయాలమీద మీకు కొన్ని విషయాలు పాయింట్లువారిగా వివరించదల్చుకున్నాను.

1.మీరీ మధ్య మండలాల వ్యాసాలలో గ్రామాల జనగణన విషయాల పట్టిక చేర్చటం గమనించాను.

  • మండల వ్యాసాలు సృష్టించక ముందు మండల ప్రధాన కేంద్రం వ్యాసంలోనే మండల సమాచారం ఉండేది.ఆసంగతి మీకు తెలుసనుకుంటాను.తరువాత మండల వ్యాసాలు సృష్టించిన తరువాత మండల కేంద్రమైన సంబందిత గ్రామ వ్యాసం నుండి మండల సమాచారం తరలింపు చేసారు. తరలింపు చేసే క్రమంలో కొన్ని మండల వ్యాసాలలో గ్రామాల జనగణన విషయాల పట్టికలు తరలింపు చేయలేదు.అలాగే కొన్ని మండలాలో, మండల కేంద్రమైన సంబందిత గ్రామ వ్యాసం నుండి మండల సమాచారం కాపీ చేసి పేష్టు చేసారు.అసలు గ్రామాల జనగణన విషయాల పట్టికలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పాత కృష్ణా జిల్లాలో మాత్రమే ఉన్నవి.నేను చేస్తున్న పని మండలాలలో లేని పట్టికలు మండల కేంద్రమైన సంబందిత గ్రామ వ్యాసం నుండి తరలింపు చేస్తున్నానుతప్ప కొత్తగా పట్టికలు చేర్చటలేదు.ఎక్కడదాకో అక్కరలేదు.మీరు అభియోగం లేవనెత్తిన ఈ చర్చరాసిన మండల వ్యాసం చరిత్రను కాస్త ఓపికతో పరిశీలించిండి.

2.ఈ వివరాలు, సంబంధిత గ్రామ వ్యాస పేజీలో, వికీడేటాలో వుంటాయి,

  • గ్రామ వ్యాసాలలో భారత జనగణన సేమీడేటా ఎక్కించినందున సంబంధిత గ్రామ వ్యాసం పేజీలలో, సమాచారపెట్టెలలో ఉంటాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.

3.కాబట్టి ఇక్కడ మరల చేర్చటం వలన వ్యాస పరిమాణం పెరగటమే గాని పెద్దగా అదనపు విలువ చేకూరదు.

  • అయితే అది గ్రామ వ్యాసం.ఇది మండల వ్యాసం.మండల వ్యాసం చూసినవార్కి అన్ని గ్రామాల జనాభా వివరాలు ఒకేచోట ఉండటం చాలా విలువైన విషయం.దీని వలన రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇతర మండలాల కన్నా కృష్ణా జిల్లాలోని మండల వ్యాసాలకు మరింత విలువ, శోభ చేకూరింది.వ్యాస పరిమాణం ఇంతే ఉండాలి (మొలక వ్యాసానికి తప్ప), ఇంత ఉండకూడదు అనే ప్రామాణికం నాకు తెలిసినంతవరకు వికీలో లేదనుకుంటాను.అవసరంలేని విషయ సంగ్రహం తొలగిస్తే తగ్గింది.అవసరమైన విషయసంగ్రహం చేరిస్తే పెరుగుతుంది. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ.

4.వికీడేటాలో వుంటాయి.ఇటువంటి సమాచారం కావలసిన వారికి వికీడేటా క్వెరీద్వారా తాజా సమాచారం పొందటం వీలవుతుంది.

  • నిజమే కాదనను.వికీలో పనిచేస్తున్న వాడకరులకు చాలా మందికి నాతో సహా దీనిలో పూర్తి అవగాహన లేదు.ఇక ఇటువంటి సమాచారం కావలసిన ఇతరులు వికీడేటా క్వెరీద్వారా తాజా సమాచారం ఎంతవరకు పొందగలరు. చివరగా ఇంకోటి వికీడేటా క్వెరీద్వారా తాజా సమాచారం పొందితే అసలు తెలుగు వికీపీడియా అనేది ఇంకొటి ఎందుకు అనేది నాసందేహం.
యర్రా రామారావు (చర్చ) 17:05, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]