చర్చ:లక్కరాజు వాణి సరోజిని
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పూర్తి పద్యాలు ఉదహరించడం సరికాదు
[మార్చు]కొండూరు రవి భూషణ్ శర్మ గారూ మీ కృషి చాలా బావుందండీ. ఐతే చిన్న సూచన - పూర్తి పద్యాలు వ్యాసంలోనే ఉదహరించడం సరికాదు, ఎందుకంటే:
- కాపీహక్కుల సమస్య: వికీపీడియాలో ఉండే సమస్త సమాచారం స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉంటుంది (ప్రధానమైన లైసెన్సు పేరు సీసీ-బై-ఎస్.ఎ.). అంటే కాపీహక్కులు అన్నీ రచయిత వద్దే ఉండేలాంటి లైసెన్సులా కాక ఎవరైనా తిరిగి ఉపయోగించుకోవచ్చు, తిరిగి ముద్రించుకోవచ్చు, మొత్తంగా పుస్తకంగా ముద్రించుకుని అమ్మేసుకోవచ్చు - వికీపీడియా నుంచి స్వీకరించినట్టు చెప్తూ, కుదిరితే వ్యాసాన్ని అభివృధ్ధి చేసినవారిని గుర్తిస్తే చాలు. ఐతే మనం రాసే పద్యాలు చాలావరకూ ఈ లైసెన్సులో ఉండవు, అవి కాపీహక్కుల పరిధిలో ఉంటాయి. అంటే వాటిని ఎవరైనా వాడుకోవాలంటే ముందుగా వాటి రచయితలను కోరాలి. ఐతే మీరు వికీపీడియా వ్యాసంలో భాగంగా వాటిని ముద్రించేప్పుడు తెలియకుండానే మనం ఆ కాపీహక్కులను ఉల్లంఘించడమే కాక పై లైసెన్సులో ప్రచురిస్తున్నందువల్ల ఇతరులు అలా చేయొచ్చని చెప్తున్నాం. అందుకు అది సరికాదు.
- విజ్ఞాన సర్వస్వం కావడం: వికీపీడియా విజ్ఞాన సర్వస్వం, మూడవ స్థాయి మూలం. ప్రాథమిక మూలాల్లో నేరుగా ఆయా కావ్యాలు ఉంటాయి, ద్వితీయ స్థాయి మూలాల్లో ఆ కావ్యాల గురించి ఇతరులు చేసిన పరిశోధనలు, సమీక్షలు, విమర్శలు ఉంటాయి, వీటిలో రచయితలు తమ అభిప్రాయాలు, మౌలిక పరిశోధన చేర్చవచ్చు. ఇక విజ్ఞాన సర్వస్వాలు తృతీయ స్థాయి మూలాలు - ఇవి మొదటి రెండు స్థాయి మూలాలను ఉపయోగించుకుని, తటస్థ వైఖరితో, అంశం "గురించి" చెప్పాల్సివుంటుంది. అంటే మీరో పుస్తకం "గురించి" వికీపీడియాలో రాయవచ్చు కానీ, పుస్తకాన్ని ఇక్కడ పెట్టకూడదు.
కాబట్టి పద్యాలు ఒకటో రెండో సందర్భోచితంగా తప్పనిసరైతే నోట్ గా చేర్చడం సరైనదన్నది నా వ్యక్తిగతాభిప్రాయం. అది కూడా మూలంగా ఆ పద్యాన్ని ఉదహరిస్తూంది కాబట్టి. కాబట్టి పుస్తకం "గురించి" సమీక్షలు, విమర్శలు మూలాలుగా ఇస్తూ వ్యాసం తయారుచేసే ప్రయత్నం చేయమని సూచిస్తున్నాను. ఒకవేళ ఇతర వ్యాసాల్లో అలాంటి కాపీరైట్ సమాచారం మరీ ఎక్కువగా ఉండివున్నా అది సరికాదు, మీరే దానిలో సరిదిద్దవచ్చు లేదా ఇలా చర్చించవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:00, 22 ఫిబ్రవరి 2017 (UTC)
- పవన్ సంతోష్ మీ సూచనలు స్వీకరించి తగినట్టు మార్పులు చేర్పులు చేస్తాను అండి. కాని ఒక సందేహం, ఈ పైన పేర్కొన్న పద్యాలు అన్ని సార్వత్రికంగా అంతర్జాలములో దొరికినవే కదా మరి ఇక్కడ ఉటంకించితే కుడా కాపీ రైట్స్ సమస్య వస్తుంది అంటారా? దయచేసి తెలియ జేయ గలరు. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 07:42, 22 ఫిబ్రవరి 2017 (UTC)"
- అంతర్జాలంలో దొరికేవన్నీ సార్వత్రికంగా లభించేవి కావండీ. నిజానికి వాటన్నిటికీ నేను పైన పేర్కొన్న కాపీహక్కుల పరిధి ఉంటుంది. కాకుంటే పలు అవగాహనాపరమైన, సాంస్కృతికమైన, ఇతరత్రా కారణాల వల్ల భారతీయులు తమకు అంతర్జాలంలో లభించేవన్నీ స్వేచ్ఛగా, ఉచితంగా తిరిగివాడుకుందుకు వీలు లేదన్న అంశం గుర్తించడం లేదు. ఉదాహరణకు నేను ఓ ఫోటోను గూగుల్లో వెతికి ఏదో వెబ్సైట్ కి వెళ్ళి సేవ్ చేసుకుని వాడుకుంటున్నానంటే, నేను కాపీహక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నానని అర్థం, నేరం చేస్తున్నట్టే. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు కనుక - ఫోటో పెట్టినవారితో సహా ఎవరూ - ఏమీ చర్య తీసుకోవట్లేదు కనుక మనకు తెలియట్లేదు. కానీ వికీపీడియా మాత్రం తన మౌలిక లక్ష్యమే స్వేచ్ఛగా పంచుకోదగ్గ విజ్ఞాన సర్వస్వాన్ని చేయి చేయి కలిపి నిర్మించడం తప్ప దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూంటుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:09, 22 ఫిబ్రవరి 2017 (UTC)
- పవన్ సంతోష్ మీ సూచనలు స్వీకరించి తగినట్టు మార్పులు చేర్పులు చేస్తాను అండి. కాని ఒక సందేహం, ఈ పైన పేర్కొన్న పద్యాలు అన్ని సార్వత్రికంగా అంతర్జాలములో దొరికినవే కదా మరి ఇక్కడ ఉటంకించితే కుడా కాపీ రైట్స్ సమస్య వస్తుంది అంటారా? దయచేసి తెలియ జేయ గలరు. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 07:42, 22 ఫిబ్రవరి 2017 (UTC)"