చర్చ:లుంగీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మల కూర్పు మరియు హైపర్ లింకులు[మార్చు]

ఆంగ్ల వ్యాసాన్ని అనువదించాను. ఆంధ్రుల లుంగీ గురించి చేర్చాను. ప్రదేశాల వారీగా బొమ్మలని చేర్చాను. కానీ టెక్స్ట్ తక్కువ, బొమ్మల సైజు ఎక్కువగా ఉండటంతో బొమ్మలు అనవసరంగా చాలా ఖాళీ స్థలాన్ని సృష్టించాయి. దీనిని సరి చేయ మనవి. హైపర్ లింకులు కొన్ని చేశాను. ఆసక్తి గలవారు మిగతావి చేయగలరు. మిగతా దుస్తుల విస్తరణ తర్వాత ఇంకనూ ఏవైనా దిద్దుబాట్లు ఉంటే నేను చూసుకొంటాను. శశి (చర్చ) 22:01, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పంచె తో విలీనం[మార్చు]

నా దృష్టిలో (కొన్ని సందర్భాలలో కట్టే విధానం ఒక్కటే అయిననూ) పంచె వేరు లుంగీ వేరు. పంచె అనగానే

  • తెలుపు రంగు వస్త్రము
  • ధోవతి కట్టు గానీ పంచెకట్టు గానీ
  • Formal లేదా హుందాతనానికి
  • గ్రామ సాంప్రదాయిక దుస్తులు

అని స్ఫురిస్తాయి.

లుంగి అనగానే

  • గడుల, ప్రింటు కలిగిన వస్త్రము
  • ఇరువైపుల ఉన్న వెడల్పులు కుట్టినవి, కుట్టనివి
  • Casual
  • గ్రామాలలో, టౌనులలో, నగరాలలో ధరించే అసాంప్రదాయిక దుస్తులు

అని స్ఫురిస్తాయి.

Formal Trousers కీ Casuals (Jeans, Cargos) కీ ఎంత తేడా ఉందో, పంచె కీ లుంగీ కీ అంతే తేడా ఉంది.

ఆంగ్ల వికీలో సరోంగ్, ధోతీ, లుంగీ, ముండు వంటి వివిధ వ్యాసాలున్నాయి. కాకపోతే Formals/Traditionals అన్నీ పంచె క్రింద, Casuals అన్నీ లుంగీ క్రింద (బొమ్మలతో సహా) విభజించవచ్చును. టెక్స్టును, చిత్రాలను ఆయా మూడ్ లు ప్రతిబింబించేట్టు మార్పులు చేర్పులు రెండు వ్యాసాలలోనూ చేసుకొనవచ్చును. యుద్ధప్రాతిపాదికన (ఈ వారాంతం) పంచె వ్యాసాన్ని విస్తరించబోతున్నాను. బహుశ: ఆ విస్తరణ తర్వాత విలీనం పైన మరింత స్పష్టత రావచ్చు. శశి (చర్చ) 20:16, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పంచె అనునది సంప్రదాయక దుస్తులకు సంబంధించినది. లుంగీ కొన్ని ప్రాంతములలో సాంప్రదాయకమైనప్పటికీ మన ప్రాంతములో అసాంప్రదాయక దుస్తులకు సంబందించినది. అందువల్ల యివి వేర్వేరు వ్యాసాలు గానే ఉండాలి. అవి కట్టు విధానంలో వాటి రంగులలో, పొడవులో, నాణ్యతలో రకరకాల భేదాలు ఉండటం వలన విలీనం చేయటం అంత మంచిది కాదని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 01:23, 9 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
చర్చ చాలా బాగుంది. ఈ రెండూ వేర్వేరు వ్యాసాలుగానా బాగుంటుంది. చర్చ యొక్క సారాంశం. రెండు వ్యాసాలలోనూ ఒక విభాగంలో ఉంచిదే చదివేవారికి తికమక లేకుండా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 04:24, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెండు వ్యాసాల అంశం ఒకే వ్యాసంలో విలీనం చేసి, రెండవది మొదటి దానికి దారిమార్పు చేస్తే ఆ రెండింలొ ఉన్న భేదాన్ని ఒకేసారి గ్రహించవచ్చు.Somu.balla (చర్చ) 04:38, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెండింటిలో ఎక్కువ సమాచారం వుంది కాబట్టి వేర్వేరువ్యాసాలుగా వుంచటమే సబబు. --అర్జున (చర్చ) 06:20, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
భేదాన్ని ప్రధాన వ్యాసమైన ఆంధ్రులదుస్తులలో రాయవచ్చు.--అర్జున (చర్చ) 06:21, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]