చర్చ:శ్రీ కృష్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



శ్రీకృష్ణుడు అవతారం దశావతారాలలో ఒకటి కాదు. మత్సః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో (పరశు రాముడు) రామశ్చ(శ్రీరాముడు) రామశ్చ(బలరాముడు) బుద్ధః కలికిరేవచ అని శ్లోకం.----కంపశాస్త్రి 15:58, 13 సెప్టెంబర్ 2007 (UTC)

శ్లోకం ఏ పురాణమో చెప్పగలరు. మూలం కోసం అడుగుతున్నాను. మిమ్మల్ని పరిక్షించడానికి కాదు. వ్యాసములొ ఉన్న విషయ సంగ్రహాన్ని మార్చండి.--మాటలబాబు 16:18, 13 సెప్టెంబర్ 2007 (UTC)
అయ్యా, ఆ శ్లోకం ఎక్కడిదో నేను చెప్పలేను. కాని వివరణకోసం ఈ శ్లోకాన్ని కూడా పరిశీలించండి.

వేదానుద్ధరతే(మత్సావతారం) జగన్నివహతే(కూర్మావతారం) భూగోళముద్బిభ్రతే(వరాహావతారం) దైత్యాన్ దారయతే(నరసింహావతారం) బలిం చలయతే(వామనావతారం) క్షత్రక్షయం కుర్వతే(పరశు రాముడు) పౌలస్త్యం జయతే(శ్రీరామావతారం) హలంకలయతే(బలరామావతారం) కారుణ్యమాతన్వతే(బుద్ధావతారం) మ్లేచ్ఛాన్ మూర్చయతే (కల్క్యావతారం) దశకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః . ఈ విషయం భాగవతం లోనిదనుకుంటున్నాను.----కంపశాస్త్రి 18:18, 13 సెప్టెంబర్ 2007 (UTC)

రాధభార్యకాదు

[మార్చు]

అష్టమహిషిల్లో రాధ లేదు. ఆ భావనను కొందరు కవులు తమ క్లపనతో సృషిటించారు. కాని, రాధ అలౌకికమైన భక్తి భావనకు, మధురభక్తికి ఉదాహరణగాను, ధార కు వ్యతిరిక్తమైన ధార రూపంగాను గుర్తించవచ్చు. పైనుంచి కిందికి పడే నీటిధార 'ధారా అయితే, భూగర్భం నుంచి పైకుబికి వచ్చే నీటి ఊటను రాధగాను భావించవచ్చనీ అదెంత సహజమో రాధ ప్రేమ లీలామోహనునిపై అంత సహజమని భాగవతుల భావన.--Satyavanijonnalagadda (చర్చ) 10:13, 6 ఆగష్టు 2012 (UTC)

ఈ విషయం వ్యాసంలో భాగంగా తగిన మూలాలతో పేర్కొనవచ్చు. --అర్జున (చర్చ) 06:22, 7 ఆగష్టు 2012 (UTC)

మనవి

[మార్చు]

వ్యాస రచయితలకు నా మనవి. మహాభారతము చరిత్ర పుస్తకం కాదు. అది కావ్యం మాత్రమే. మనిషి నన్మార్గంలో నడవడానికి రచించబడిన అద్భుత కావ్యం. కనుక వ్యాస రచనలో ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:33, 21 ఫిబ్రవరి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

చరిత్ర లోని కావ్యం లేదా కావ్య చరిత్ర.. లేదా చరిత్ర కావ్యం JVRKPRASAD (చర్చ) 06:41, 21 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశొధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుంది. [ఆధారం చూపాలి] క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 04:41, 22 ఫిబ్రవరి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

రమేష్ గారు, ఈ చర్చలు ఇప్పుడు ఇక్కడ అవసరమంటారా ? మీరు భారత దేశము హిందూ మతము లోని ఎన్ని గ్రంథాలు చదివారు ? కనీసం ఇప్పుడయినా చదవండి. అవి రచనలు కావు వాస్తవాలే. ఒకరి నుంచి ఒకరికి అనూచానముగా వారి వారి జీవిత చరిత్రములు శిష్యులకు బోధనలు జరిగాయి. ఆనాడు వారు రచయితలు కారు. అనవసర చర్చలు చేసి, వాడుకరులు, మీ కాలము వృధా చేసుకోవద్దని నా మనవి. ఇలా మీరు హిందూ మతము లోని వ్యాసముల మీద ఏదో ఒక విమర్శ (చేస్తున్నారు ఈ మధ్యన) మొదలు పెడితే చూసే మా లాంటి వారికి మానసికంగా బాధ, ఏదో ఆందోళనతో ఏదో ఒకటి వ్రాయాలనిపిస్తుంది. ఇక్కడ మీకు చేతనయితే వ్యాసాలు వ్రాయండి. కుదరకపోతే విమర్శలు చేయకండి. ఇది అటువంటి వేదిక కాదు. ఇది సలహా, సూచన అని మాత్రమే గ్రహించండి. JVRKPRASAD (చర్చ) 05:16, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ! నేను హిందూ మతములోని సుమారు అన్ని గ్రంధాలు, పురాణాలు చదివాను. నాకు నచ్చినవి రామాయణము, మహాభారతము అను ఇతిహాసాలు. ఏ మతమైనా ఒక్కటే. మత గ్రంధము ఏదైనా అది మనిషి మంచి కోసమే. వాటిలోని మంచిని మనము గ్రహించాలి. మానవ సాహిత్య చరిత్ర ప్రకారం ఇవి సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 200 మధ్య, అనగా మలివేద కాలంలో ఆర్యుల చేత సంస్కృత భాషలో వ్రాయబడినవి. ఆర్యుల రాక మునుపు దేశంలో సంస్కృత భాష లేదు. లోతుగా ఆలోచిస్తే ఇది విమర్శ కాదు, వాస్తవం. చర్చల్లో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. వికీపిడియన్లు ఆందోళన పడకూడదు. చక్కగా చర్చించుకోవాలి. ఇది కేవలం మతానికి సంబంధించిన వేదిక కాదు, విజ్ణానానికి సంబంధిన వేదిక అని అభిప్రాయం. ఆందోళన చెందక సాహిత్యంపై పరిశోధన చేయండి. సంతోషిస్తాను.(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:46, 23 ఫిబ్రవరి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

రమేష్ గారు, మీరు హిందూ మతములోని సుమారు అన్ని గ్రంధాలు, పురాణాలు చదివాను అని అనటము అనుకోవటము అవివేకమే అవుతుంది. వేదకాలములోనే వేద అధ్యయనము చేయడానికి ఆయా యుగాలలో (ప్రస్తుతము వైవస్వతము, కలియుగం) ఒక్కొక్కరు కొన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయము కలిగి యున్ననూ, మళ్ళీ మళ్ళీ (భరద్వాజుడు లాంటి వారు జన్మలు ఎత్తటము చదివి యున్నాము. ఎంతో మహర్షులకు వారి శక్యము కాక, వ్యాసుడు కేవలం ఒక వేదాలనే నాలుగు సంహితలుగా, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, పురాణాలు ఇలా విడగొట్టడం జరిగింది. ఆ సంహితలు కూడా చదవలేక లేదా గురువు దగ్గర అభ్యసించ లేక అనేక సంహెతలుగా విడగొట్ట బడ్డాయి. అసలు మనకు వేదాలే దొరకనప్పుడు సంపూర్ణ హిందూ మతము (దర్మము) మీరు ఎలా చదివారో మరి ? మీతో చర్చలు అనవసరం. మీతో చర్చలు చేసి నా సమయము వృధా చేసుకోవడమే. మీ మానసిక పరిస్థితి మాత్రము ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ? హిందూ మతము విమర్శలు, క్రీస్తు వ్యాసము, ఎవరైనా విమర్శ చేస్తే సంభోగము వ్యాసము..........గుప్తశాస్త్రము. అంత చదివిన వారు, ఒకనాడు వికీకి అంత సేవలు చేసిన వారు, ఇప్పుడు ఎందుకు విరమిచుకున్నట్లు ? ఇలా పునరాగమనము ఏమంత సబబుగా లేదు. ఒకనాడు వికీ పునాది రాళ్ళలో మీరు ఒకరు. మీకంటూ ఒక గౌరవం ఉంది. వ్యాసాలే వ్రాయండి. విమర్శలు ఎందుకు ? మతం (ధర్మము) మీద చర్చలు చేసి ఏదీ ఇక్కడ సాధించేది ఏముంటుంది ? భారతంలో ఉన్న విషయాలు అన్నీ ఇప్పుడు కనిపెట్టారు, కాని కానీ భారతం మాత్రము కాల్పనికం అని అంటారు. ఆనాడు విద్యలు అభ్యసించడానికే కాలం సరిపోయేది కాదు. వేదకాలంలో కాల్పానిక సాహిత్యం దాదాపు శూన్యం. మీరు చెప్పే కాలం వేదాకాలం అనంతరం గురించి, ముద్రణ కాలం గురించి చెబుతారు. మీరు ప్రవర చెప్పుకుంటారు, మరి ప్రవరలు ఎలా వచ్చాయి ? మీ వంశవృక్షం సంగతి ఏమిటి ? మరి ఆ కాలం ఉన్నట్లా లేదా లేనట్లా ? ఇదంతా చర్చలు చేయలని ఉంటే, మీడియాకి రండి. మీరు ఏం చెప్పదలచు కున్నది చెబితే, అందరికీ అర్థం అవుతుంది. ఇంక ముందు మీకు నా స్పందనలు ఉండవు. చూసి వదలి వేయడమే. ఇంత మేధావులయిన మీకు ఈ భారతదేశములో సరియైన గుర్తింపు ఎందుకు రాలేదు ? మీ పేజీలో కనీసం మీ ముఖచిత్రం ఒకసారి పొందు పరచండి. కనీసం ఆ దర్శన భాగ్యం కలిగించండి. మీ లాంటి మహనీయులాంటి వారిని చూసినా ఎంతో మానసిక సంతోషం కలుగుతుంది. JVRKPRASAD (చర్చ) 11:52, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ! మీరు వయస్సులో నాకంటే చాలా పెద్దవారు. మీరు ఈ విధంగా ప్రత్యుత్తరమివ్వడం విచారకరం. ఈ లోకంలో అన్నీ తెలిసినవారు, ఏమీ తెలియనివాడరు ఉండరు అని మీకు తెలుసు. నేను మేధావి అని నేను అనుకోవడంలేదు. వేదాలు ఆర్యుల రచనలు. సంస్కృతం ఆర్యుల అధికారిక భాష. సాహిత్య చరిత్ర్ర ప్రకారం అవి సుమారు 2000 B.C లోనే సంస్కృతంలో వ్రాయబడ్డాయి. వేదాలు చరిత్ర పుస్తకాలు కావు, చరిత్రలో వ్రాయబడిన పుస్తకాలు. వాటిలో ఆనాటి సమాజంలో మనుషులు నిర్వర్తించవలసిన యజ-యాగాదులు, పాటించవలసిన కట్టుబాట్లు, ప్రజాపతి దేవుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు గురించి కధలు ఉంటాయి. ఆర్యుల రాక పూర్వం దేవనాగరి భాష అనబడిన సంస్కృతమే కాదు, భారతదేశంలో అసలు లిపి లేనే లేదు. కనుక మహాభారతం, రామాయణం అను ఇతిహాస కావ్యాలు వేదకాలం తర్వాత వ్రాయబడినవి. నేటికీ మనకు వేదాలు సంస్కృతంలోను, తెలుగులోను, ఆంగ్లంలోను లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు Sacred Texts.com చూడండి. వేల సంవత్సరాల ఆయుర్దాయము మానవుడికి ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా రుజువులు లేవు. పూర్వం మానవుడి సగటు ఆయుర్ధాయము సుమారు 150 సంవత్సరాలు ఉండేది. అంతే. ఇక బ్రాహ్మణులకు, రాజులకు - సప్త ఋషులు, వారి ప్రవరలు పేర్లతో గోత్రాలుంటాయి. గోత్రాలు, ప్రవరలు మధ్య యుగం వరకూ సమాజంలో ఒక వ్యక్తిని గుర్తించడానికే ఉపయోగించేవారు. ఋషులు కూడా మనలాంటి మనుషులే. వారు దైవస్వరూపులు(Saints)గా జీవించారు అంతే. క్రీస్తు పూర్వం ఎటువంటి చరిత్ర పుస్తకాలు వ్రాయబడలేదు. నేను గుర్తింపు కోసం ఎదురు చూసే మనిషిని కాదు. మనుష్యుల ఎదుట ఘనముగా ఎంచబడునది దేవుడి దృష్టిలో హేయం అని నా నమ్మకం. ఆత్మ సంతృప్తి చాలు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 04:26, 24 ఫిబ్రవరి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన బోధనలు కూడా ఎవరైనా దయచేసి పోస్ట్ చేయండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 11:39, 16 మార్చి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

శ్రీకృష్ణుని రక్షణ కొరకు అభ్యర్థన పేజీ

[మార్చు]

Semi-protection:High level of IP vandalism వాడుకరి:యర్రా రామారావు,plz ఈ పేజీని రక్షించండి అసంబద్ధ సమాచారం జోడించబడుతోంది