చర్చ:సామెతల జాబితా
అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణంపెట్టేవాడు దూరంగావున్నా పర్వాలేదు
వికీవ్యాఖ్య
[మార్చు]ఈ సామెతలన్నిటినీ వికీవ్యాఖ్యలోకి చేర్చవచ్చనుకుంటా. ప్రతీ సామెత పేజీలోనూ ఒకటి రెండు వాక్యాల కంటే ఎక్కువ సమాచారం లేదు. వికీవ్యాఖ్యలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కోపేజీ చప్పున చేర్చి, ఆ అక్షరంతో మొదలయ్యే సామెతలన్నిటినీ అక్కడ చేర్చవచ్చు. సభ్యుల అభిప్రాయాలకై ఎదురు చూస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 12:13, 10 ఆగష్టు 2007 (UTC)
- ఇంగ్లీషులో సామెతల్లాంటివి విక్షనరీలో చేర్చారు. వికీకోట్లో చేర్చవచ్చో లేదో పరిశీలించాలి. (విక్షనరీలో మరియు వికీకోట్లో రెండిట్లో చేర్చినా ఫర్యాలేదనుకుంటా). కొన్ని కొన్ని అర్ధవంతమైన వ్యాసాలు (తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి లాంటివి) తప్ప మిగిలిన సామెతలన్నీ విక్షనరీకీ తరలించాలి. --వైజాసత్య 12:22, 10 ఆగష్టు 2007 (UTC)
- ఆంగ్ల వికీఖోటులో ఉన్న en:q:Category:Proverbs అనే వర్గం చూసి నాకు అలా అనిపించింది. proverb అంటే నీతి వాక్యాలు అనే అర్ధం వస్తుంది, అలాగే సామెతలను కూడా నీతివాక్యాలకు మళ్లేనే చూడవచ్చని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 12:47, 10 ఆగష్టు 2007 (UTC)
- ఈ రోజు ఉదయం లేచి నప్పుడు నాకు అనే అనిపించింది. ఇది వికీ వ్యాఖ్యలొ ఉండవలసిన అంశంకదా అని. నేననుకోవడం ప్రకారం వికీ వ్యాఖ్య దీనికి సరైన ప్రదేశం. విషయం మీద దీర్ఘ చర్చ జరగాలి. అప్పుడప్పుడు మీరు నేను పంపినట్లు ఆహ్వానాలు కూడా పంపాలేమో, స్పందన రాక పోతే...--మాటలబాబు 12:26, 10 ఆగష్టు 2007 (UTC)
- ఓ! వికీఖోట్లో ప్రావెర్బ్స్ కూడా ఉన్నాయా..అయితే ఇంకేం మనం నిక్షేపంగా సామెతలను వికీఖోట్లో చేర్చవచ్చు. సమయోచితంగా మంచి ఆలోచన చేశావు ప్రదీపు --వైజాసత్య 12:52, 10 ఆగష్టు 2007 (UTC)
వికీవ్యాఖ్య కి తెవికీ తేడా ఏమిటో చూసి వస్తా.. అక్షరక్రమంలో ఒక చోట పెడితే బావుంటుంది.నా అభిప్రాయం కూడా వ్యాసాల స్థాయికి చేరవనే .. రెండు మూడు లైన్లకు మించి రాయగలిగినవి ఎక్కువ ఉండవురాజశేఖర్ 17:34, 10 ఆగష్టు 2007 (UTC) hmm...వికీవ్యాఖ్య అంటే సినిమా డైలాగులు కూడా ఉంటాయన్న మాట!.వైజాసత్య గారు అన్నట్లు రెండిట్లో ఉన్నా ఫర్వాలేదనుకుంటా..రాజశేఖర్ 17:42, 10 ఆగష్టు 2007 (UTC)
మొత్తానికి సామెతలను వికీవ్యాఖ్యలో చేర్చడానికి అధికులు సుముఖంగా ఉన్నట్లనిపిస్తున్నది. నా సూచనలు:
- వికీ వ్యాఖ్యలలో సామెతలను వెంటనే చేరుద్దాము.
- కాని వికీ పీడియాలోంచి వాటిని ప్రస్తుతానికి తీసివేయవద్దు. ఎందుకంటే
- సామెతల జాబితా ప్రస్తుతం ఒక పేజీగానే ఉన్నది. విస్తరణ ఉన్న కొద్ది సామెతలకే వేరు వేరు పేజీలున్నాయి. మిగిలినవి ఎర్ర లింకులే. కనుక కృత్రిమంగా పేజీల సంఖ్య పెరుగడం లేదు.
- సత్తా గల పరిశోధకులు ఒకో సామెతకూ ఒకో పేజీ విషయం (ఏనాటికైనా) రాయగలరనుకొంటున్నాను. ఆ అవకాశాన్ని ఎందుకు తుంచి వేయాలి? కాస్త నిడివి ఉన్న పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు, అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు వ్యాసాలు చూడండి.
- వికీ వ్యాఖ్యలో ఒకో అక్షరంతో మొదలయ్యే సామెతకూ ఒకో పేజీ కేటాయించవచ్చును.
--కాసుబాబు 07:39, 18 ఆగష్టు 2007 (UTC)
ఇంకా కొన్ని సామెతలు
[మార్చు]నా దగ్గర ఓ రెండువేల సామెతలు ఉన్నాయి. ప్రతి దానికి ఆంగ్లంలో ఒకటి రెండు లైన్ల వివరణ ఉంది. నాకేమో అవన్నీ వికీపిడియాలోనే చేరుస్తామని ఉంది. జనాలేమంటారో --నవీన్ 09:18, 6 ఫిబ్రవరి 2008 (UTC)
- నవీన్, నీ రెండు వేల సామెతల కలెక్షన్ చర్చ ఇప్పుడే చూశాను. (ఫిబ్రవరిలో నేను సెలవులో ఉన్నాను). రెండువేల నిధిని వికీలో ఎక్కడో ఒకచోట పెట్టకుండా నీ దగ్గరే ఉంచుకోవడం పీనాసితనం కాదా! సామెతలు, జాతీయాలు పేజీలను పరిశీలించి తరువాత కొన్ని సూచనలను ప్రతిపాదిస్తాను. ఒక వారం ఆగు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:06, 7 జూన్ 2008 (UTC)
- వ్యవసాయ సామెతలు
స్తోత్ర లహరి వెబ్ సైట్ లో http://www.stotralahari.com/ తెలుగు సామెతలు చాలా వున్నాయి. అవి కూడా పరిశీలింఛి, మన తెవికీ లో లేని, సామెతలను అందులోనుంచి కాపీ చేసుకునే అవకాశం వుందేమో పరిశీలించండి. అలాగే, చాలాకాలం క్రితం నేను 'వ్యవసాయ సామెతలు' అనే చిన్న పుస్తకమ్ చూసాను. అందులో వ్యవసాయం గురించిన సామెతలు వున్నాయి. నాకు గుర్తు వున్న సామెత (ఉత్తర (ఉత్తర నక్షత్రం ను చూసి) చూసి ఎత్తర గంప ). ఈ సామెతలు మన రైతు సోదరులకు పనికి వస్తుంది. ఎవరికైనా, ఆ 'వ్యవసాయ సామెతలు' అనే చిన్న పుస్తకం దొరుకుతుందేమో చూడండి. నేను కూడా పుస్తకాల షాపులో చూస్తాను. Talapagala VB Raju 19:37, 9 ఫిబ్రవరి 2008 (UTC)సభ్యులు:తలపాగల విబి రాజు
సామెతలకు ప్రత్యేక పేజీలు
[మార్చు]సామెతలకు ప్రత్యేక పేజీల గురించి ఇంతకు ముందు జరిగిన చర్చ పైన చూడగలరు. ఈ విషయాన్ని తిరిగి పరిశీలించవలసిన అవుసరం కనిపిస్తున్నది. ప్రస్తుత ప్రతిపాదన ఏమంటె.
- ఒక్కో సామెతకూ ఒక్కో పేజీ అవుసరం కనిపించడంలేదు. అధికంగా సామెతలు ఒక వాక్యం నుండి ఒక పేరా వరకు మాత్రమే ఉంటున్నాయి. ఇంతవరకు ఒక్కటి కూడా "సమగ్ర వ్యాసాలు" అనబడే రేంజిలో విస్తరింపబడలేదు.
- కనుక విషయాన్ని ఇలా విభజింపవచ్చును.
- సామెతలు - అనే వ్యాసం : ఇందులో సామెతల "గురించి" వ్రాయాలి. సామెతల ప్రయోగం, భాషలో వాటి స్థానం, పుట్టుక, ఉపయోగాలు వంటివి. కొద్ది ఉదాహరణలతో.
- సామెతల జాబితా - అనే వ్యాసం - ఇందులో (ఇప్పుడున్నట్లే) సామెతల జాబితా మాత్రం ఉంటుంది.
- సామెతలు - అ, సామెతలు - ఆ, ఇలా షుమారు 50 వ్యాసాలు. ఇందులో ఒకో సామెత గురించీ కొంత వివరణ ఉంటుంది. (అమరావతి కథా సంగ్రహం 1-25 , అమరావతి కథా సంగ్రహం 26-50, అమరావతి కథా సంగ్రహం 51-75, అమరావతి కథా సంగ్రహం 76-100 లాగా).
- బాగా పెద్ద వ్యాసాలు ఉన్న సామెతలకు (ఏవైనా ఉంటే) మాత్రమే ప్రత్యేక వ్యాసాలు ఉంటాయి. అంటే ఒకో సామెత గురించి సమగ్ర వ్యాసం ప్రత్యేకంగా వ్రాయడానికి అడ్డంకి లేదు.
సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:31, 28 నవంబర్ 2008 (UTC)
- మీ ఆలోచన బాగుంది. అయితే నేననుకుంటున్న కొన్ని చిన్న సవరణలు. సామెతలు అ, సామెతలు ఆ లాంటి వ్యాసాలు సృష్టించకుండా సామెతల జాబితా పేజీలోనే వివరణలున్న సామెతలకు మాత్రం ఒక డ్రాప్ డౌన్ ఉండేట్టు అందులో వివరణ ఉండేట్టు చేద్దాం. అలా వివరణ కోసం ప్రత్యేక పేజీలకు వెళ్ళాల్సిన అవసరముండదూ మరియు సామెతలు ఋ లాంటి పేజీలు ఖాళీగా ఉండే అవకాశం తొలగించనూ వచ్చు. --వైజాసత్య 07:50, 28 నవంబర్ 2008 (UTC)
- బాగానే ఉంటుంది. ఎలా వీలుగా ఉంటుందో చూడండి. మీరు మూస తయారు చేస్తున్నారని గమనించాను. అయితే వ్యాసం సైజు మరీ పెద్దది కాకూడదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:58, 4 డిసెంబర్ 2008 (UTC)