చర్చ:స్థూల దేశీయోత్పత్తి
స్వరూపం
GDP కి తెలుగు అనువాదం
[మార్చు] సహాయం అందించబడింది
జిడిపి అనే పదానికి నిఘంటువులో స్థూల దేశీయోత్పత్తి అనే అర్థం ఉంది. అందుకే ఆ పేరుతో వ్యాసం ప్రారంభించాను అయితే స్థూల జాతీయోత్పత్తి అనే మాటను కూడా కొన్ని చోట్ల చూశాను. ఈ రెండు పదాలు ఒకటేనా లేక వేర్వేరా అని అనుమానంగా ఉంది. తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పగలరు. - రవిచంద్ర (చర్చ) 16:34, 8 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారూ రెండు ఒకే పదానికి చెందినవని నాఅభిప్రాయం. పేజీ సృష్టించినప్పడే నేను పరిశీలించాను.ఇంకొకటి జాతీయ అనే పదానికి ఆంగ్లంలో నేషనల్ అనే అర్థమే కదా సూచించేది.అదే National పదానికి నిఘంటుశోధనలో జాతీయ, దేశీయ అనే అర్దాలను సూచిస్తుంది.ఒకసారి పరిశీలించండి. మీరు పేజీ సృష్టించగానే నేను అంతకుముందు పశ్చిమ బెంగాల్ సవరణలు చేస్తూ సమాచారపెట్టెలో ఉన్న ఎర్రలింకు బ్లూ కలర్లో మారినప్పుడు పరిశీలించాను. సమాచారపెట్టెలో లింకుకు అవసరమైన మంచి వ్యాసం సృష్టించినందుకు ధన్యవాదాలు. స్థూల జాతీయోత్పత్తి దారిమార్పు చేయాలి.యర్రా రామారావు (చర్చ) 18:36, 8 మార్చి 2021 (UTC)
- సరైన తెలుగు అనువాదాలకు మనం నిఘంటువులలో వెతకటం, ప్రామాణిక తెలుగు అకాడమీ పుస్తకాల వాడుకు చూడటం, ఇతర ప్రామాణిక వనరులలో వాడుక చూడడం మంచి పద్ధతి. ఆంధ్రభారతి నిఘంటు శోధనలో GDP పదం లేదు, కాని స్థూల జాతీయోత్పత్తి పదానికి GNP అని ఆంగ్ల అనువాదం ఇచ్చారు. గూగుల్ లో GDP vs GNP వెతికితే, GDP దేశహద్దులలో పౌరులు సాధించిన వస్తు సేవల ఉత్పత్తి విలువ కాగా, GNP దేశహద్దుల పరిమితి లేకుండా పౌరులు సాధించిన వస్తు సేవల ఉత్పత్తి విలువ అని తెలిపారు. (GDP vs GNP investopedia), ఇదే విషయం ఆంగ్ల వికీపీడియా వ్యాసాలు en:Gross domestic product, en:Gross national income లో చూడవచ్చు. "రాష్ట్ర ఉత్పత్తి-తీరు తెన్నులు". ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ-అభివృద్ధి. తెలుగు అకాడమీ. 2010. p. 53. ప్రకారం స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనే పదాన్ని బ్రాకెట్లలో Gross State Domestic Product అని సూచించి వాడారు. కావున స్థూల దేశీయోత్పత్తి GDP కు బదులుగా వాడడం మెరుగు. --అర్జున (చర్చ) 23:20, 8 మార్చి 2021 (UTC)
- అర్జున గారూ, ఆంధ్రభారతి నిఘంటువులో ఈ పదానికి స్థూల దేశీయోత్పత్తి అనే అర్థం ఉంది. అదే నేను పైన చెప్పింది. మీరు ఆ నిఘంటువులో ఆంగ్ల భాషను ఎంచుకుని GDP అనే పాఠ్యం ఇవ్వండి. మీకు కూడా కనిపిస్తుంది.
- GDP (Gross Domestic Product) : పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004 - స్థూలదేశీయోత్పత్తి
- నేను రాసిన వ్యాసం GDP గురించి కాబట్టి ఈ వ్యాసానికి స్థూల దేశీయోత్పత్తి పదం సరిపోతుంది. GNP/GNI కి అవసరమైతే వేరే స్థూల జాతీయోత్పత్తి పేరుతో వేరే వ్యాసమైనా సృష్టించవచ్చు, లేదా ఈ రెండు పదాలకు అర్జున రావు గారు చెప్పినట్లు కొద్దిపాటి తేడాలే ఉంటే ఈ వ్యాసంలోనే విభాగంగా కూడా చేర్చవచ్చు. రవిచంద్ర (చర్చ) 05:39, 9 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారూ "నేను రాసిన వ్యాసం GDP గురించి కాబట్టి ఈ వ్యాసానికి స్థూల దేశీయోత్పత్తి పదం సరిపోతుంది" అని అనుకున్నప్పుడు మీరు సందేహం గురించి సహాయం అడగనవసరంలేదని భావిస్తున్నాను.అదే GDP కి ఈ లింకులో బిబిసి వారు స్తూల జాతీయోత్పత్తి అని క్లియర్ గా నిర్వచించారు. అదే ఉద్దేశ్యంతో నేను దారిమార్పు చేయాలనే అభిప్రాయం తెలిపాను.ఒకసారి పరిశీలించండి. యర్రా రామారావు (చర్చ) 06:01, 9 మార్చి 2021 (UTC)
- రామారావు గారూ, జిడిపి అంటే నాకు స్థూల దేశీయోత్పత్తి అని మాత్రమే తెలుసు. కానీ బిబిసి వారు రెండు పదాలను (దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి) మార్చి మార్చి వాడారు కాబట్టి రెండూ ఒకే పదాలా అని అనుమానం వచ్చి సహాయం కోరాను. అర్జున గారు ఆంగ్ల వికీలో రెండింటికీ రెండు వ్యాసాలు ఉన్నాయని చూపించిన తర్వాత అవి వేర్వేరు అని అభిప్రాయం కలిగింది. ఈ సాంకేతిక పదజాలం గందరగోళమైనది. మీరన్నట్లు నేషనల్ అనే పదానికి దేశీయ, జాతీయ పదాలు రెండూ తెలుగులో సమానార్థకాలు అయిననూ, చూడబోతే స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి విభిన్న భావనలుగా కనిపిస్తున్నాయి. మీ స్పందనకు ధన్యవాదాలు. రవిచంద్ర (చర్చ) 06:28, 9 మార్చి 2021 (UTC)
- వాడుకరి:రవిచంద్ర గారు, GDP కి నిఘంటు లింకు ఇచ్చినందులకు ధన్యవాదాలు. ఆంగ్ల GDP వ్యాసంలో GNP విభాగంగా కూడా వుంది కావున, తెవికీలో కూడా అలానే చేయటం మంచిది. అర్జున (చర్చ) 22:07, 9 మార్చి 2021 (UTC)
- నేను అనువదించి చేర్చాను.--అర్జున (చర్చ) 01:04, 11 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారూ "నేను రాసిన వ్యాసం GDP గురించి కాబట్టి ఈ వ్యాసానికి స్థూల దేశీయోత్పత్తి పదం సరిపోతుంది" అని అనుకున్నప్పుడు మీరు సందేహం గురించి సహాయం అడగనవసరంలేదని భావిస్తున్నాను.అదే GDP కి ఈ లింకులో బిబిసి వారు స్తూల జాతీయోత్పత్తి అని క్లియర్ గా నిర్వచించారు. అదే ఉద్దేశ్యంతో నేను దారిమార్పు చేయాలనే అభిప్రాయం తెలిపాను.ఒకసారి పరిశీలించండి. యర్రా రామారావు (చర్చ) 06:01, 9 మార్చి 2021 (UTC)