చల్లూర్
చల్లూర్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని గ్రామం.[1]
చల్లూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°24′52″N 79°21′10″E / 18.414568°N 79.352795°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండలం | వీణవంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,429 |
- పురుషుల సంఖ్య | 2,734 |
- స్త్రీల సంఖ్య | 2,695 |
- గృహాల సంఖ్య | 1,403 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన వీణవంక నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1403 ఇళ్లతో, 5429 జనాభాతో 1695 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2734, ఆడవారి సంఖ్య 2695. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 985 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 49. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572531[3].పిన్ కోడ్: 505505.
గ్రామ చరిత్ర,విశేషాలు
[మార్చు]రెండు ఎత్తైన పర్వతాల మధ్యలో వెలసిన రెండు ఊర్ల సంగమం. మధ్యలో ఎత్తైన బండరాతిపైన వేణుగోపాలస్వామి దేవస్థానం ఉంది. దేవస్థానానికి ఓపక్క కొత్త చల్లూరు మరోపక్క పాత చల్లూరు ఉన్నాయి. చుట్టూరా చెట్లతో, గుట్లతో శోభాయమానంగా కనిపిస్తుంది. ఊరికి ఉత్తరంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో మానేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది ఒడ్డున పెద్ద తాటివనంలో రెండేళ్ళకొకసారి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తుంటారు.
ప్రతి ఏటా హోళీ పండగ రోజుల్లో వేణుగోపాల స్వామి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. రథోత్సవం చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోకెల్లా ఈ ఊరే పెద్దది కావడంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు ప్రతి అవసరానికీ ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడే విశ్వకర్మ దేవస్థానం కూడా ఉంది. ఇంద్రజాల విద్య, మాయలు మంత్రాలు చేసే సాధనాసురులు పుట్టినిల్లు చల్లూరు.
ఊరిలో పెద్ద గుట్టపైన మనిషి ఆకారంలో ఎత్తైన బొమ్మ కనిపిస్తుంది. దాన్నే గొల్లభామ అంటారు.ఆమె గుట్టపైనున్న శ్రీకృష్ణుని వద్దకు రోజూ పాలు, పెరుగు, వెన్న తీసుకుని వెళ్ళేదని, ఒకరోజు అదే గుట్టపైనున్న ఒక ముని ఆమెను ఆ పాలు, పెరుగు తనకిమ్మని అడిగాడు. ఆమె కృష్ణునికి తప్ప వేరెవ్వరికీ ఇవ్వనన్నది. దాంతో ఆ ముని కోపించి శపించడంతో ఆమె శిలగా మారిపోయిందని గ్రామస్థులు చెబుతారు. ఆమె పేరు చల్లమ్మ కాబట్టి ఊరు చల్లమ్మ ఊరు, క్రమంగా అది చల్లూరుగా రూపాంతరం చెందిందని గ్రామపెద్దలు అంటారు.[1]
ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందరి మధ్య వివాదాలు లేకపోయినా రెండు వాడలకు వేర్వేరు మసీదులున్నాయి. ప్రార్థన కోసం ఈ వాడ ముస్లింలు ఆవాడకీ, ఆ వాడ ముస్లింలు ఈ వాడకీ వెళ్ళరు. రంజాన్, బక్రీద్ లకు మాత్రం రెండు వాడలవాళ్ళు కలిసి ఊరు పక్కన గుట్టపైనున్న ఈద్గాకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. బతుకమ్మ పండుగ రోజున కూడా ఒక వాడ ప్రజలు వాళ్ళ వాడ దగ్గరున్న చెరువు దగ్గరే ఆడి వస్తారు. దసరా పండుగనాడు వేణుగోపాల స్వామి గుడి ముందు జరిగే జమ్మి కార్యక్రమానికి రెండు వాడలు కదిలి వస్తాయి.
స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం అతి పురాతనమైంది. అందులో గరుడ స్తంభంగా వ్యవహరించే ఏకశిలా స్తంభాన్ని చూపరులకు ఆశ్చర్యం కలుగ జేస్తుంది. నాలుగెకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఊరి దొర ఇల్లు అన్నింటికన్నా పెద్ద ఇల్లు. పెద్ద గుట్టపై ఓ కోనేరు ఉంది. అది ఎండాకాలంలో కూడా ఎండిపోకుండా ఉంటుంది. గుట్ట శిఖరాన పెద్ద బండరాయికి దిగుడులా ఓ కంత ఉంటుంది. అందులో కూడా నీళ్ళుంటాయి. ఆ నీళ్ళ రుచి అచ్చం కొబ్బరి నీళ్ళలా ఉంటుంది. ఆ కంతను గిన్నె బావి అని గ్రామస్థులు వ్యవహరిస్తుంటారు.
ఊర్లో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఉర్దూ మాధ్యమంలో బోధించే ఒక పాఠశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వైద్యశాల ఉంది.
జమ్మికుంట వెళితే ఢిల్లీకైనా, చెన్నైకి వెళ్ళడానికి పుష్కలంగా రైళ్లు ఉంటాయి. 1970 వ సంవత్సరం నుంచి నేతాజీ యువజన మండలి ప్రారంభమైంది. వీరు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల వీణవంకలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల జమ్మికుంటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కరీంనగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల జమ్మికుంటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు కరీంనగర్లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]చల్లూర్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఐదుగురు నాటు వైద్యులు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]చల్లూర్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]చల్లూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 164 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 182 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 7 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 275 హెక్టార్లు
- బంజరు భూమి: 522 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 531 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 884 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 444 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]చల్లూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 194 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 250 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]చల్లూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లంకెలు
[మార్చు][1] సాక్షి - 2010 జనవరి 17, ఆదివారం సంచికలో మా ఊరి ముచ్చట అనే శీర్షికకు వెగ్గళం రవి రాసిన వ్యాసం ఆధారంగా...