చావలి నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చావలి నాగేశ్వరరావు జాతీయ చిత్రకారుడు.వివిధ నేతల, స్వాతంత్ర్య సమరయోధులు, అసాధారణ చిత్రకారులుగా గుర్తింపు పొందిన మహనీయులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన రేపల్లె మండలం పేటేరు గ్రామములో 1891, ఆగష్టు 14న జన్మించారు. బాల్యం నుండి చదువు కంటే చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారు. పాఠశాలలో ఆయన పాఠాలను వినకుండా బోధిస్తున్న ఉపాధ్యాయుల చిత్రాలను గీసేవారు. 1909లో మెట్రిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఆయన తన చిత్రకళపై ఆసక్తి కారణంగా ముంబయి వెళ్ళి చిత్రకళాశాలలో చేరాలనుకున్నప్పటికీ పెద్దలు అంగీకరించలేదు. కానీ ఆయన ఎవరికీ చెప్పకుండా ముంబయి వెళ్ళి ఒక స్టుడియోలో పనిలో చేరారు. జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ద్స్ లో చేరారు. నాలుగేళ్ళ కోర్సు తర్వాత స్వంతంగా ముంబయిలో "ఆంధ్ర చిత్రశాల" పేరుతో స్టుడియో ప్రారంభించారు. ఆయన అనీబిసెంటు, మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, సర్థార్ వల్లభబాయి పటేల్ వంటి అనేకమంది జాతీయ నాయకుల చిత్రాలను గీసారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో అలంకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాలకు వీరు వరల్డ్ కాపీరైట్ ను పేటెంట్ హక్కును గూడా పొందినారు.

ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయ చిత్రకారునిగా ఎంతో సంపాదించారు. ఎందరికో ఆర్థిక సహాయం చేసారు. వీరు 1970 మే 9 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "వరల్డ్ కాపీరైట్ పొందిన చిత్రకారుడు "చావలి" - సాక్షి దినపత్రిక - 16-01-2017 ఆర్టికల్". Archived from the original on 2017-04-26. Retrieved 2017-03-19.