చింతమోటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతమోటు గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 257., యస్.ట్.డీ కోడ్=08648. [1]

చింతమోటు (భట్టిప్రోలు)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 257
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోగినేని విజయలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
  2. ఈ గ్రామ పంచాయతీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి రావలసిన పన్ను మొత్తం రు. 55,375-00 వసూలు చేసి 100% పన్ను వసూలు చేసిన గ్రామంగా రికార్డులకెక్కినది. [4]
  3. ఈ గ్రామానికి చెందిన ఎం.పి.టి.సి. సభ్యుడు శ్రీ శొంఠి సుబ్బారావు, గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కృషిచేసినారు. గ్రామములో 20 మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులు గుర్తించగా, లబ్దిదారులకు అవగాహన నిర్వహించి, స్వయంగా వారితో పనులు పూర్తిచేయించి, గ్రామంలో 100% మరుగుదొడ్లను పూర్తిచేయించినారు. అంతేగాక, మరుగుదొడ్లు నిర్మించుకోలేని పలువురు పేద గ్రామస్థులకు తన సహకారాన్ని అందించినారు. ఈ విధంగా కృషిచేసి, గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తయారుచేసినారు. అందుకుగాను వీరిని 2016-17 సంవత్సరానికి ఉత్తమ ఎం.పి.టి.సి సభ్యుడుగా ఎంపిక చేసినారు. వీరికి ఈ పురస్కారాన్ని 2017,ఏప్రిల్-22న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో భాగం, రాష్ట్ర మంత్రి శ్రీ నక్కా ఆనంద్‌బాబు, జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ శ్రీమతి జానీమూన్ చేతులమీదుగా అందించినారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం[మార్చు]

గ్రామములోని శ్రీ రామాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారం నుండి 22వ తేదీ సోమవారం వరకు భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలలో గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవారంనాడు శ్రీ షిర్డీ సాయిబాబా విగ్రహానికి జలాధివాసం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 25వ తెదీగురువారంనాడు వేదమంత్రాల నడుమ విగ్రహప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [2]&[3]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2017, ఫిబ్రవరి-23వతేదీ గురువారం నుండి 25వతేదీ శనివారం వరకు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [5]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.


"https://te.wikipedia.org/w/index.php?title=చింతమోటు&oldid=2985164" నుండి వెలికితీశారు