Jump to content

చింపాంజీ

వికీపీడియా నుండి
(చింపాంజీలు నుండి దారిమార్పు చెందింది)

చింపాంజీ
కేమరూన్ దక్షిణ ప్రాంతంలో నివసించే చింపాంజీ
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Panina
Genus:
Pan

Oken, 1816
Type species
Simia troglodytes
Species

Pan troglodytes
Pan paniscus

distribution of Pan spp.

చింపాంజీ (ఆంగ్లం: Chimpanzee) హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు (two species of apes in the genus Pan).

వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో వివసించేది. దానిని అంగ్లంలో Common Chimpanzee అనీ, శాస్త్రీయంగా Pan troglodytes అనీ అంటారు. రెండవ జాతి చింపాంజీలు కాంగో పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం బొనొబో. శాస్త్రీయ నామం Pan paniscus. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు కాంగో నది సరిహద్దుగా ఉంటున్నది.[1]

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.

పరిమాణం, జీవిత కాలం

[మార్చు]

పూర్తిగా పెద్దదైన మగ చింపాంజీ 35-70 కిలోగ్రాములు బరువుంటుంది. 0.9-1.2 మీటర్లు (3-4 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26-50 కిలో గ్రాములు బరువు, 0.66-1 మీటర్లు (2-3½ అడుగులు) ఎత్తు ఉంటాయి.

అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.[2]

సాధారణ చింపాంజీ, బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు.[3]

చింపాంజీల్లో తేడాలు

[మార్చు]
బోనొబో

సాధారణ చింపాంజీ, బోనొబోల శరీర నిర్మాణంలో వ్యత్యాసాలు స్వల్పం. కాని వాటి సామాజిక జీవనంలోను, లైంగిక ప్రవర్తనలోను గణనీయమైన భేదాలున్నాయి. సాధారణ చింపాంజీలు శాకాహార, మాంసాహారాలు తింటాయి (omnivorous diet). కలసి వేటాడుతాయి. క్లిష్టమైన సమూహ సంబంధాలు కలిగి ఉంటాయి. alpha male నాయకత్వంలో వేటాడుతాయి.

బోనొబోలు అధికంగా ఫలభక్షణ చేస్తాయి. ( frugivorous diet). వీటి సమూహాలలో నాయకత్వ పోరు ఉండదు. ఆడ బొనొబోలు పిల్లల పెంపకంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.[4]

రెండు జాతులలోను పైకి కనిపించే చర్మం చిన్నపుడు లేత రంగులో ఉండి పెద్దయినాక ముదురు రంగులోకి మారుతుంది. సాధారణ చింపాంజీలకంటే బోనొబోలు అధికంగా రెండు కాళ్ళమీద నడుస్తాయి. చింపాంజీ జనాభాలో జన్యుపరమైన వ్యత్యాసాలు చాలానే ఉన్నట్లు చికాగో విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ అధ్యయనంలో తెలుస్తున్నది.[5] చింపాంజీలు పనిముట్లు వాడే విధానం కూడా ఒకో సమూహానికి ఒకో విధంగా ఉందని పరిశీలనలో తెలుస్తున్నది.[6] బోనొబోల కంటే సాధారణ చింపాంజీలలో అధికంగా దాడి చేసే ప్రవర్తన కనిపిస్తున్నది.[7]

చింపాంజీల గురించి అధ్యయనం చరిత్ర

[మార్చు]

ఆఫ్రికా వాసులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచే సంబంధాలు కలిగిఉండేవారు. కాంగో లాంటి కొన్ని ఆఫ్రికా దేశాలలోని కొన్ని గ్రామాలలో వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే వారు. యూరోపియన్లు మొదటి సారిగా చింపాంజీలను అంగోలా అనే దేశంలో 17వ శతాబ్దంలో కనుగొన్నారు. 1506లో ఒక పోర్చుగీస్ పరిశోధకుడు (Duarte Pacheco Pereira) తన డైరీలో వ్రాసుకొన్న విషయమే పాశ్చాత్య దేశాలలో చింపాంజీల గురించి మొదటి ప్రస్తావన కావచ్చును. ఇందులో చింపాంజీలు మౌలికమైన పనిముట్లను చేసుకొంటాయని అతడు వ్రాశాడు. 1640లో అంగోలా నుండి ఫ్రెడరిక్ హెన్రీ (Frederick Henry) కి బహుమతిగా పంపారు. తరువాత కొంతకాలం కొన్ని చింపాంజీలు వినోద జంతువులుగాను, జంతుప్రదర్శనశాలలో చూపడానికి దిగుమతి అయ్యాయి.

1859లో ఛార్లెస్ డార్విన్ (Charles Darwin) ప్రచురించిన జీవ పరిణామ సిద్ధాంతము (en:theory of evolution) శాస్త్రీయ వర్గాలలో చింపాజీల అధ్యయనం పట్ల ఆసక్తిని ఒక్కసారిగా పెంపొందించింది. అయితే ఈ కాలంలోజరిగిన అధ్యయనాలలో చింపాంజీల మానవ తరహా ప్రవర్తన పట్ల అధికంగా దృష్టి సారించారు. ప్రచురణలలో చింపాంజీల ప్రవర్తన గురించి అతిశయోక్తులు తరచు వ్రాశారు. కనుక వాటి గురించి శాస్త్రీయ అవగాహన నిజానికి అభివృద్ధి కాలేదు.

లాస్ ఏంజిలెస్ జంతుప్రదర్శన శాలలో చింపాంజీ

1960లో జేన్ గూడాల్ (en:Jane Goodall) అనే శాస్త్రవేత్త టాంజానియా గోంబె నేషనల్ పార్క్ అడవులలో సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారని అంతతకుముందు అభిప్రాయం ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. Wolfgang Köhler, Robert Yerkes అనే శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేసి, చింపాంజీలు మానవుల వంటి ప్రవర్తననే కలిగి ఉంటాయని 1925లో ప్రచురించారు.("chimpanzees manifest intelligent behaviour of the general kind familiar in human beings ... a type of behaviour which counts as specifically human" -1925).[8]

(video) టోబు జూలో ఆడ చింపాంజీ సైతమా, జపాన్

సాధారణ చింపాంజీలు మనుషులపై దాడి చేయడం గురించి తరచు రిపోర్టులు ఉన్నాయి.[9][10] ఉగాండాలో పిల్లలపై చింపాంజీలు దాడిచేయడం పలుమార్లు జరిగింది. వీటిలో కొన్ని దాడులు మాత్రం చింపాంజీలు ఒక విధమైన స్థానిక సారాయి త్రాగి, మనుషుల పిల్లలను [11] Western Red Colobus అనే తమ అహారంగా భ్రమించడం కారణంగా జరిగిందని అభిప్రాయం ఉంది.[12] చింపాంజీలు మనుషులనుండి ప్రమాదాన్ని శంకించడం వలన కొన్ని దఅడులు జరిగాయి.[13] ఒక మనిషికంటే చింపాంజీ ఐదు రెట్లు పెద్దది కనుక చింపాంజీ దాడి మనిషికి ప్రాణాంతకం కావచ్చును.[14][15][16][17]

ఆగష్టు 2008లో American Journal of Primatologyలో ప్రచురించిన రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో చింపాంజీలు మనుషులనుండి సంక్రమించిన వైరస్ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాయి.[18]

ప్రజ్ఞా పాటవాలు

[మార్చు]
చింపాంజీ తల్లి, బిడ్డ

చింపాంజీలు పనిముట్లను తయారుచేసుకొని వాటిని ఆహార సేకరణకు, సామాజిక ప్రదర్శనకు ఉపయోగిస్తాయి. చింపాంజీలకు సమన్వయము, హోదా, ప్రభావము వంటివి అవసరమయ్యే క్లిష్టమైన వేటాడే వ్యూహాలు ఉంటాయి. ఇవి తమ హోదా, స్థాయిని యెరిగి ఉంటాయి. మోసము చేయగల, వంచించగల సామర్ధ్యము చింపాంజీలకు ఉంది. ఇవి సంజ్ఞలను ఉపయోగించటం నేర్చుకోగలవు, కొంత మానవ భాష యొక్క కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోగలవు. వీటిలో సంఖ్యా భావన, సంఖ్యాక్రమము, రిలేషనల్ సింటాక్స్ వంటివి ఉన్నాయి.[19] సంఖ్యలను గుర్తుపెట్టుకునే అవసరమున్న కొన్ని పనులు యువ చింపాంజీలు కళాశాల విద్యార్థులకంటే మెరుగుగా చేసినవి.[20]

పనిముట్ల వాడకం

[మార్చు]

ఆధునిక చింపాంజీలు పనిముట్లను ఉపయోగిస్తాయి. చింపాంజీల రాతి పనిముట్ల ఉపయోగము కనీసం 4300 యేళ్ళకు పూర్వము నుండే ఉన్నదని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.[21] ఇటీవలి ఒక అధ్యయనం మరింత మెరుగైన ఈటెల వంటి పరికరాలను కూడా చింపాంజీలు ఉపయోగించినట్లు వెల్లడించింది. సెనెగల్‌లోని సాధారణ చింపాంజీలు ఈటెలను పళ్ళతో సానబెట్టి, చెట్టుతొర్రల్లో నివసించే సెనెగల్ బుష్‌బేబీలను వాటి తొర్రల్లోనుండి ఈటెలతో పొడిచి బయటకు రప్పించడానికి ఉపయోగిస్తాయి.[22][23] చింపాంజీల పనిముట్ల ఉపయోగాన్ని కనుగొనకముందు కేవలం మానవ జాతి మాత్రమే పనిముట్లను తయారుచేసుకొని ఉపయోగించిందని భావించేవారు. అయితే ఇప్పుడు అనేక ఇతర పనిముట్లను ఉపయోగించే జాతులు తెలియవచ్చినవి.[24][25]

ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం చింపాంజీలు సాటి జీవుల పట్ల దయ, జాలి వంటి గుణాలను కలిగి ఉంటాయని ఋజువైంది.[26][27]. విచారాన్ని వెలిబుచ్చడం, ప్రేమను పంచడం, వానలో చిందులు, ప్రకృతి అందాలైన సూర్యోదయం, సూర్యాస్తమయం, జీవ జాలం పట్ల ఆసక్తి మొదలైన లక్షణాలు, చింపాంజీ ఆధ్యాత్మికతకు ఆధారాలు.[28]

భాషా అధ్యయనాలు

[మార్చు]
చింపాంజీ యొక్క పార్శ్వముఖము

మానవ జాతి యొక్క అనూహ్యమైన స్థితప్రజ్ఞతకు తార్కాణమైన భాషా పాటవంపై అధ్యయనాలలో చాలాకాలం నుండి శాస్త్రజ్ఞులు అత్యంత ఆసక్తి కనబరిచారు. భాష, మానవజాతి యొక్క ప్రత్యేక పాటవం అన్న ప్రతిపాదనను ఋజువు చేయటానికి శాస్త్రజ్ఞులు అనేక జాతుల యొక్క కోతులకు భాషను నేర్పించే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రయత్నాలలో మొట్టమొదటి దాన్ని 1960వ దశకంలో అలెన్, బియాట్రిస్ గార్డెనర్‌లు చేశారు. వీరీ ప్రయోగంలో భాగంగా వాషో అనే పేరుగల చింపాంజీకి 51 నెలల పాటు అమెరికన్ సంజ్ఞా భాషను నేర్పించే పయత్నం చేశారు. వాషో ఆ 51 నెలల్లో 151 సంజ్ఞలను నేర్చుకున్నది.[29] అయితే మరింత దీర్ఘకాలంలో వాషో 800 సంజ్ఞలను నేర్చుకున్నట్టు నివేదించారు.[30] నిమ్ చింప్‌స్కీ అనే మరో చింపాంజీతో చేసిన అనేక అధ్యయనాలు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నోమ్ చోమ్‌స్కీ, డేవిడ్ ప్రెమాక్ వంటి కొంతమంది శాస్త్రవేత్తల మధ్య పెద్ద కోతుల యొక్క భాషాగ్రహణ శక్తిపై ఇంకా చర్చ జరుగుతున్నది.

కోతుల్లో నవ్వు

[మార్చు]

"నవ్వు అనేది జంతువులలో మనుషులకు మాత్రమే ప్రత్యేకం" అన్న అభిప్రాయం ఉంది (అరిస్టాటిల్ అలా అన్నాడు). కాని ఈ అభిప్రాయం నిజం కాకపోవచ్చును. తనను గురించిన గుర్తింపు (Self-awareness of one's situation as seen in the mirror test), ఎదుటివారి ఇబ్బందిలో ఊహించుకొనే శక్తి (ability to identify with another's predicament - mirror neurons) అనేవి నవ్వగలగడానికి ముఖ్యమైన అవసరాలు. ఈ రెండూ జంతువులలో కూడా ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మానవులు నవ్వినపుడు వచ్చే శబ్దం మాత్రం వారి భాషకు అనుగుణంగా రూపుదిద్దుకున్న వ్యక్తీకరణ. ఇది మానవులకు ప్రత్యేకం. అది తప్పించితే జంతువులు కూడా మనుషులలాగానే నవ్వుతూ ఉండవచ్చును. వాటి "నవ్వు" మనకు గాలిపీల్చి విడచే శబ్దంలా అనిపించవచ్చును.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.[31]

ప్రయోగ శాలలో చింపాంజీలు

[మార్చు]
1961లో మెర్క్యురీ-అట్లాస్ 5 అనే పేటిక (capsule)లో ఉంచబడుతున్న ఇనోస్ అనే అంతరిక్ష చింపాంజీ

నవంబరు 2007 నాటికి అమెరికా పరిశోధనా శాలలలో 1300 చింపాంజీలున్నాయి. మొత్తం దేశంలో 3000 పెంపకం చింపాజీలు ఉన్నాయి. [32] వీటిపై అనేక విధాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి.[33] అంటు వ్యాధుల క్రిములను ప్రయోగించడం, ఆపరేషన్లు చేయడం, మందుల ప్రయోగం వంటివి అధికంగా జరిగే ప్రయోగాలు. వీటిని బాధాకరమైన, క్రూరమైన విధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ విషయమై చాలా విమర్శలు ఉన్నఅయి.

చింపాంజీ జినోమ్ ప్రాజెక్టు తరువాత ప్రయోగశాలలలో చింపాంజీల అవసరం ఇంకా పెరిగింది. పరిశోధనలకోసం చింపాంజీలను పెంచాలనే వాదాలు ఉన్నాయి.[34]

చింపాంజీలు చాలా విషయాలలో మనుషులను పోలి ఉన్నందున (వ్యక్తీకరణ, తమను గురించినజ్ఞానం, పనిముట్ల వాడకం వంటివి) వాటిని జంతువులలాగా ప్రయోగాలలో వాడకూడదని, మనుషులకు వర్తించే నియమాలను (తమ అంగీకారం తెలపడానికి అశక్తులైన మానవులకు వర్తించే నియమాలను) వాటికి వర్తింప జేయాలని కొందరు శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా వాదించేవారు కూడా ఉన్నారు.[35]. చింపాంజీలపై విషపూరిత పదార్ధాల ప్రయోగాలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. [36]

వర్గీకరణ

[మార్చు]
The taxonomic relationships of Hominoidea

Pan అనే genus, Homininae అనే ఉప కుటుంబంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు. మానవులు కూడా ఇదే జాతికి చెందుతారు. మానవ జాతికి జీవ పరిణామ క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉన్నజాతి ఇది ఒక్కటే. 5 మిలియన్ సంవత్సరాల క్రిందటి ప్లయోసీన్ ఇపోక్ నుండి 8 మిలియన్ సంవత్సరాల క్రిందటి మయోసీన్ ఇపోక్ మధ్యకాలంలో చింపాంజీ జాతి నుండి మానవజాతి విడివడి వేరు జాతిగా పరిణామం పొంది ఉండవచ్చును.[37] 1973లో మేరీ క్లెయిర్ కింగ్ జరిపిన అతి ముఖ్యమైన పరిశోధనల ప్రకారం చింపాంజీలకు, మానవులకు డి.ఎన్.ఏ క్రమంలో 99% సారూప్యత ఉంది అని వెల్లడైంది.[38] తరువాత మరింత విపులంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ సారూప్యత 94% వరకు మాత్రమే ఉందని తెలిసింది.[39]

కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లార్క్, నీల్సన్ అనేవారి అధ్యయనాలు 2003 డిసెంబరు సైన్స్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. వాటి ప్రకారం చింపాంజీలకు, మానవులకు ఉన్న ఒక మౌలిక భేదం— భాషను అర్ధం చేసుకోవడం, మాటల ద్వారా భావాన్ని వ్యక్తీకరించగలగడం. అయితే ఈ భేదాలు చింపాజీలకు, మానవులకు ఉన్న శరీర నిర్మాణ భేదాల కారణంగా వచ్చి ఉండవచ్చును. పరిణామ క్రమంలో మానవులు ఈ శక్తిని అభివృద్ధి చేసుకొని ఉండవచ్చును. ఆరంభ కాలంలో లక్షలాది సంవత్సరాలదాకా పనిముట్ల వాడకంలో మానవులు ఇతర 'హోమో' జాతులతో పోటీపడి ఉండవచ్చును.

శిలాజ అవశేషాలు

[మార్చు]

మానవ శిలాజాలు ఎన్నో కనుగొన బడ్డాయి కానీ చింపాంజీకి సంబంధించిన శిలాజాలు మాత్రం 2005 వరకు వెలుగు లోకి రాలేదు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఇప్పుడున్న చింపాంజీలు తూర్పు ఆఫ్రికాలో లభ్యమైన మానవ శిలాజాలతో overlap కావడం లేదు. అయితే ఇటీవలే కెన్యాలో లభ్యమైనాయి. దీని ద్వారా మానవులు, పాన్ క్లేడ్ జాతికి చెందిన చింపాంజీల మధ్య Pleistocene కాలంలో తూర్పు ఆఫ్రికాలో జీవించినట్లుగా తెలుస్తోంది.[37]

మూలాలు

[మార్చు]
  1. "ADW:Pan troglodytes:information". Animal Diversity Web (University of Michigan Museum of Zoology). Retrieved 2007-08-11.
  2. Moehringer, J.R. (2007-04-22). "Cheeta speaks". latimes.com Los Angeles Times]. Retrieved 2007-04-22.
  3. "Analysis of Chimpanzee History Based on Genome Sequence Alignments". Archived from the original on 2013-08-01. Retrieved 2008-09-24.
  4. Courtney Laird. "Bonobo social spacing". Davidson College. Archived from the original on 2011-05-19. Retrieved 2008-03-10.
  5. "Gene study shows three distinct groups of chimpanzees". EurekAlert. 2007-04-20. Archived from the original on 2016-03-03. Retrieved 2007-04-23.
  6. "Chimp Behavior". Jane Goodall Institute. Archived from the original on 2007-09-27. Retrieved 2007-08-11.
  7. de Waal, F (2006). "Apes in the family". Our Inner Ape. ISBN 1594481962.
  8. Goodall, Jane (1986). The Chimpanzees of Gombe: Patterns of Behavior. ISBN 0-674-11649-6.
  9. Osborn, Claire. "Texas man saves friend during fatal chimp attack". The Pulse Journal. Retrieved 2006-06-27.[permanent dead link]
  10. "Chimp attack kills cabbie and injures tourists". guardian.co.uk The Guardian]. 2006-04-25. Retrieved 2006-06-27.
  11. "'Drunk and Disorderly' Chimps Attacking Ugandan Children". 2004-02-09. Archived from the original on 2006-06-19. Retrieved 2006-06-27.
  12. Tara Waterman (1999). "Ebola Cote D'Ivoire Outbreaks". Stanford University. Archived from the original on 2008-02-16. Retrieved 2008-03-24.
  13. "Chimp attack doesn't surprise experts". msnbc.msn.com/ MSNBC]. 2005-03-05. Retrieved 2006-06-27.
  14. "Re: Chimpanzee strength". answers.google.com Google Answers]. 2005-08-23. Archived from the original on 2008-02-10. Retrieved 2008-02-21.
  15. "Can a 90-lb. chimp clobber a full-grown man?". straightdope.com The Straight Dope]. 1976-09-10. Archived from the original on 2006-07-21. Retrieved 2006-06-27.
  16. "Birthday party turns bloody when chimps attack". usatoday.com/ USATODAY]. 2005-03-04. Retrieved 2006-06-27.
  17. Amy Argetsinger (2005-05-24). "The Animal Within". washingtonpost.com The Washington Post]. Retrieved 2006-06-27.
  18. Newswise: Researchers Find Human Virus in Chimpanzees Retrieved on June 5, 2008.
  19. "Chimpanzee intelligence". Indiana University. 2000-02-23. Archived from the original on 2016-09-17. Retrieved 2008-03-24.
  20. Rowan Hooper (2007-12-03). "Chimps outperform humans at memory task". New Scientist. Retrieved 2008-03-24.
  21. Julio Mercader; Huw Barton; Jason Gillespie; Jack Harris; Steven Kuhn; Robert Tyler; Christophe Boesch (2007). "4300-year-old Chimpanzee Sites and the Origins of Percussive Stone Technology". PNAS. Feb.
  22. Fox, M. (2007-02-22). "Hunting chimps may change view of human evolution". Archived from the original on 2007-02-24. Retrieved 2007-02-22.
  23. "ISU anthropologist's study is first to report chimps hunting with tools". Iowa State University News Service. 2007-02-22. Archived from the original on 2007-08-16. Retrieved 2007-08-11.
  24. Whipps, Heather (2007-02-12). "Chimps Learned Tool Use Long Ago Without Human Help". LiveScience. Retrieved 2007-08-11.
  25. "Tool Use". Jane Goodall Institute. Archived from the original on 2007-05-20. Retrieved 2007-08-11.
  26. "చింపాంజీల్లో దయాగుణం". Science Daily. 2007-06-25. Retrieved 2007-08-11.
  27. Bradley, Brenda (1999). "Levels of Selection, Altruism, and Primate Behavior". The Quarterly Review of Biology. 74 (2): 171–194. doi:10.1086/393070. Retrieved 2007-08-11.
  28. "Appendices for chimpanzee spirituality by James Harrod" (PDF). Archived from the original (PDF) on 2008-05-27. Retrieved 2008-09-24.
  29. Gardner, R. A.; Gardner, B. T. (1969). "Teaching Sign Language to a Chimpanzee". Science. 165: 664–672. doi:10.1126/science.165.3894.664. PMID 5793972.
  30. Allen GR, Gardner, B. T. (1980). "Comparative psychology and language acquisition". In Sebok TA, Sebok JU (eds.). Speaking of Apes: A Critical Anthology of Two-Way Communication with Man. New York: Plenum Press. pp. 287–329.
  31. Steven Johnson (2003-01-01). "Emotions and the Brain". Discover Magazine. Archived from the original on 2006-10-21. Retrieved 2007-12-10.
  32. "End chimpanzee research: overview". Project R&R, New England Anti-Vivisection Society. 2005-12-11. Archived from the original on 2008-04-17. Retrieved 2008-03-24.
  33. "Chimpanzee lab and sanctuary map". The Humane Society of the United States. Archived from the original on 2008-03-07. Retrieved 2008-03-24.
  34. Langley, Gill. Next of Kin: A Report on the Use of Primates in Experiments Archived 2007-11-28 at the Wayback Machine, British Union for the Abolition of Vivisection, p. 15, citing VandeBerg, JL et al. "A unique biomedical resource at risk", Nature 437:30-32.
  35. Stuart Zola, director of the Yerkes National Primate Research Laboratory, disagrees. He told National Geographic: "I don't think we should make a distinction between our obligation to treat humanely any species, whether it's a rat or a monkey or a chimpanzee. No matter how much we may wish it, chimps are not human."
  36. Guldberg, Helen. The great ape debate Archived 2011-05-21 at the Wayback Machine, Spiked online, March 29, 2001, accessed August 12, 2007.
  37. 37.0 37.1 McBrearty, S.; Jablonski, N. G. (2005-09-01). "First fossil chimpanzee". Nature. 437: 105–108. doi:10.1038/nature04008. మూస:Entrez Pubmed.
  38. Mary-Claire King, Protein polymorphisms in chimpanzee and human evolution, Doctoral dissertation, University of California, Berkeley (1973).
  39. "Humans and Chimps: Close But Not That Close". Scientific American. 2006-12-19. Archived from the original on 2007-10-11. Retrieved 2006-12-20.
General references

ఇవి కూడా చూడండి

[మార్చు]
ఆంగ్ల వికీలో కొన్ని వ్యాసాలు

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చింపాంజీ&oldid=4365773" నుండి వెలికితీశారు