చిట్టూరి సత్యనారాయణ
చిట్టూరి సత్యనారాయణ | |
---|---|
జననం | చిట్టూరి సత్యనారాయణ అక్టోబరు 6 1913 తూర్పు గోదావరి జిల్లా లో పామర్రు |
మరణం | ఏప్రిల్ 19 2012 |
ఇతర పేర్లు | చిట్టూరి సత్యనారాయణ |
వృత్తి | నలుగురు రాష్ట్రపతులకు వ్యక్తిగత వైద్యుడు |
ప్రసిద్ధి | ఇ.ఎన్.టి. వైద్యుడు |
చిట్టూరి సత్యనారాయణ (అక్టోబరు 6 1913 - ఏప్రిల్ 19 2012) భారతదేశ ఇ.ఎన్.టి నిపుణుడు. ఆయన భారత రాష్త్రపతికి వ్యక్తిగత వైద్యుడుగా పనిచేసారు.[1][2][3]
జీవిత విశెషాలు
[మార్చు]ఈయన తూర్పు గోదావరి జిల్లా లోని పామర్రు గ్రామంలో సర్వారాయుడు, సుభద్ర దంపతులకు అక్టోబరు 6 1913 న జన్మించారు. స్కూల్ ఫైనల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పిడుగు, వీరకేసరి లిఖిత పత్రికలను పంపిణీ చేశారు. 1944 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకోవడంతో వైద్యునిగా వృత్తి జీవితం ప్రారంభించారు. చెవి, ముక్కు, గొంతు విజ్ఞానంలో ఎం.ఎస్. చేసారు.అమెరికాలో ఎఫ్.ఐ.సి.ఎస్, ఎఫ్.సి.సి.పి, ఎఫ్.ఎ.సి.ఎస్. డిగ్రీలను ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడిసన్ లో ఎఫ్.ఎ.ఎం.ఎస్. డిగ్రీని అందుకున్నారు[4]. మద్రాసు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా, ప్రొఫెసర్ గా విశిష్ట సేవలను అందించారు. నలుగురు రాష్ట్రపతులకు శస్త్రచికిత్సలు చేసి వారి ప్రసంశలు చూరగొన్నారు.
పరిశోధనలు
[మార్చు]తాను నేర్చుకున్న ఆధునిక వైద్యం ప్రాచీన విజ్ఞానంలోని నిగూఢ శాస్త్ర సత్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అధర్వణ వేదాన్ని అధ్యయనం చేసారు. వేదపండితుల వద్ద శిక్షణ పొందారు. అధర్వణ వేదం నుండి అనేకానేక గర్బ నిరోధక పద్ధతులను వెలికితీసి, తమ వైద్య శాస్త్ర చరిత్రలో పొందువరిచారు. ప్రాచీన వైద్య విధానాలను మధించారు.[5]
ఇ.ఎన్.టి స్పెషలైజేషన్ గా పలు పరిశోధనలు చేసారు. వివిధ వైద్య పరిశోధక పత్రికలలో అనేక పరిశోధన వ్యాసాలు వ్రాసారు. ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన ఒక దాడిలో ఒక తూటా ఆయన కపాలం దిగువన సైనస్ మార్గంలో ఒక చోట చిక్కుకుపోయి, వైద్యులకే సమస్యగా మారింది. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆయన చాకచక్యంగా జూన్ 12 1967 న ఆ తూటాను తీసేసారు.[4] తన 83 వ యేట గాంధీ శాంతి బృంధం తరపున అమెరికా మొదలగు దేశాలలో రాజాజీ వెంట వెళ్లారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు.టోక్యోలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
ఈయన వారసులలో దాదాపు అందరూ వైద్యులే. ఈయన అనేక మంది రాష్ట్రపతులకు వ్యక్తిగత వైద్యుడు[4][6] వైద్య పరిశోధకుడు అయిన డాక్టర్ చిట్టూరికి వ్యాధిగ్రస్తులకు సాంత్వన చేకూర్చడమే ధ్యేయం.
ఆయన 2012 లో మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ "A Tribute to Professor Dr. C. Satyanarayana". Web.tnmgrmu.ac.in. 1913-10-06. Archived from the original on 2012-05-01. Retrieved 2012-05-21.
- ↑ R. Sujatha. "Cities / Chennai : Sons give shape to father's dream". The Hindu. Retrieved 2012-05-21.
- ↑ "Cities / Chennai : The Chitturi legacy". The Hindu. Retrieved 2012-05-21.
- ↑ 4.0 4.1 4.2 "Ear, Nose and Throat specialist who removed bullet from MGR's neck dead". The Times of India. 2012-04-22.
- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 188.
- ↑ The Chitturi legacy