Jump to content

చిట్టెం పర్ణికారెడ్డి

వికీపీడియా నుండి
చిట్టెం పర్ణికారెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి
నియోజకవర్గం నారాయణపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1993
నారాయణపేట, నారాయణపేట జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మీ (ఐఏఎస్‌)
జీవిత భాగస్వామి చింతలపని విశ్వజిత్ రెడ్డి
బంధువులు డీకే అరుణ (మేనత్త)
సంతానం అయాన్ష్ రెడ్డి
నివాసం సీవీఆర్ భవన్, సాయి విజయ్ కాలనీ, నారాయణపేట[1]

చిట్టెం పర్ణికారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో నారాయణపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చిట్టెం పర్ణికారెడ్డి 1993లో హైదరాబాద్‌లో కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మి (ఐఏఎస్‌) దంపతులకు జన్మించింది.[4] ఆమె 2016లో ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి, భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్‌) గా పని చేసింది.[5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

డా. పర్ణిక రెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబ నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా, మేనత్త డీకే అరుణ మంత్రిగా, బాబాయ్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణపేట నుండి పోటీ చేసి ఓడిపోయాయడు. పర్ణిక రెడ్డి ఆమె మేనమామ పోటీ చేసిన నారాయణపేట నియోజకవర్గం నుండి 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్‌. రాజేందర్‌ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో[7] గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.[8][9]

ఆమె 2025 జూన్ 9న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైంది.[10][11]

మూలాలు

[మార్చు]
  1. "CHITTEM PARNIKA REDDY Affidavit" (PDF). 2023. the original (PDF) నుండి 16 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 December 2023.
  2. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". the original నుండి 4 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2023.
  3. The Hindu (8 December 2023). "New wave, new wins" (in Indian English). the original నుండి 9 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2023.
  4. Eenadu (4 December 2023). "వయసు 30 ఏళ్లలోపే.. తొలి ఎన్నికలోనే సత్తా చూపించారు". the original నుండి 4 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2023.
  5. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". the original నుండి 4 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. TV9 Telugu (3 December 2023). "అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు". the original నుండి 16 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". the original నుండి 8 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 December 2023.
  8. Eenadu (4 December 2023). "పేటకు తొలి మహిళా ఎమ్మెల్యే". the original నుండి 4 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2023.
  9. "30 ఏండ్లలోపే అసెంబ్లీకి..సాధించిన యశస్విని రెడ్డి". V6 Velugu. 4 December 2023. the original నుండి 3 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 February 2025.
  10. "27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శులు". Eenadu. 10 June 2025. the original నుండి 10 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2025.
  11. "పీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం". Andhrajyothy. 10 June 2025. the original నుండి 10 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2025.