ఎస్. రాజేందర్ రెడ్డి
ఎస్. రాజేందర్ రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2014 - 2018, 2018- ప్రస్తుతం | |||
ముందు | |||
---|---|---|---|
నియోజకవర్గం | నారాయణపేట శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మే 6, 1964 సేరివెంకటాపూర్, కోయిలకొండ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాజేశ్వర్ రెడ్డి- యశోధర | ||
జీవిత భాగస్వామి | స్వాతిరెడ్డి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | నారాయణపేట, తెలంగాణ |
సుంకి రాజేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, విద్యావేత్త. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నారాయణపేట శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] వివిధ కళాశాలలు స్థాపించాడు
జననం, విద్య
[మార్చు]రాజేందర్ రెడ్డి 1964, మే 6న రాజేశ్వర్ రెడ్డి- యశోధర దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, కోయిలకొండ మండలంలోని సేరివెంకటాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి రాజేశ్వర్‌రెడ్డి జనసంఘ్ పార్టీ నాయకుడిగా పనిచేశాడు. 1973, 1978లో రెండుసార్లు మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. రాజేందర్ రెడ్డి కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా యూనివర్సిటీ పరిధిలోని రాయచూర్ వి.వెల్.సి.పి. కళాశాల నుండి 1996లో ఎంఫార్మసీ పూర్తిచేశాడు.[2] రాజేందర్ రెడ్డికి ఇద్దరు అన్నలు (విజయభాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి), ఒక అక్క (శ్రీలత).[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం, బైరంపురం గ్రామానికి చెందిన డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి కుమార్తె స్వాతిరెడ్డితో 1994లో రాజేందర్ రెడ్డి వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (అమృతరెడ్డి), ఒక కుమార్తె (నందికారెడ్డి) ఉన్నారు.
ఉద్యోగ జీవితం
[మార్చు]బీ ఫార్మసీ తరువా హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌ఎన్ కంపెనీలో రూ.350కు నైట్‌డ్యూటీ చేశాడు. 1986 డిసెంబరు 15న బెంగళూరుకు వెళ్ళాడు. చిగ్‌బలాపూర్ ఫార్మ కంపెనీలో అధ్యాపకుడిగా చేరి, రెండేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా పనిచేశాడు. ఒక రూరల్ కాలేజీ ఆఫ్ ఫార్మసీని లీజుకు చేసుకుని ఐదేళ్లు నడిపి, షాపూర్‌లో ఎంఫార్మసీ కాలేజీ, రాయచూర్‌లో బిఫార్మసీ ఏర్పాటుచేసి మెడికల్ కాలేజీ పెట్టాడు.[3]
రాజకీయ విశేషాలు
[మార్చు]తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన రాజేందర్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కె. శివకుమార్ రెడ్డి పై 2270 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] 2016 ఫిబ్రవరిలో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి బిఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థి కె. శివకుమార్ పై 15,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] ఎస్. రాజేందర్ రెడ్డి 2022 జనవరి 26న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[8] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో నారాయణపేట నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[9][10]
హోదాలు
[మార్చు]- తెలంగాణ శాసనసభ గ్రంథాలయ కమిటీ సభ్యుడు
- తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై హౌస్ కమిటీ సభ్యుడు
- తెలంగాణ శాసనసభ గ్రంథాలయ కమిటీ చైర్మన్ (22.09.2019 నుండి)[11]
ఇతర వివరాలు
[మార్చు]- చైనా, హాంకాంగ్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
- రాయచూర్ జిల్లాకేంద్రంలో 1,100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాడు.
- బెంగళూరులో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేసి రూ.6 లక్షల విలువ చేసే విద్యను రూ.37వేలకే అందిస్తున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Member's Profile - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 2021-09-04. Retrieved 2021-09-04.
- ↑ admin (2019-01-08). "Narayanpet MLA S. Rajender Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-04.
- ↑ 3.0 3.1 3.2 సాక్షి, తెలంగాణ (28 July 2019). "'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'". Sakshi. Archived from the original on 28 July 2019. Retrieved 4 September 2021.
- ↑ Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ సమయం తెలుగు, తెలంగాణ (11 February 2016). "టీటీడీపీకి షాకిచ్చిన మరో ఎమ్మెల్యే!!". www.telugu.samayam.com. Archived from the original on 27 February 2021. Retrieved 4 September 2021.
- ↑ "S.rajender Reddy(TRS):Constituency- NARAYANPET(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-04.
- ↑ "Narayanpet Election Result 2018 Live Updates: S.Rajender Reddy of TRS Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-04.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "S. Rajender Reddy | Chairman | MLA | TRS | Narayanpet | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-06. Retrieved 2021-09-04.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- జీవిస్తున్న ప్రజలు
- 1964 జననాలు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తులు
- మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ నాయకులు
- మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు