చిలుకోటి కాశీ విశ్వనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలుకోటి కాశీ విశ్వనాథ్
చిలుకోటి కాశీ విశ్వనాథ్
జననంచిలుకోటి కాశీ విశ్వనాథ్
1946
విశాఖపట్నం
మరణండిసెంబరు 22 2015
ఇతర పేర్లుచిలుకోటి కాశీవిశ్వేశ్వరరావు
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకుడు, కథకుడు
పదవీ కాలం1980 నుండి 2015
మతంహిందూ
భార్య / భర్తమహలక్ష్మీ
పిల్లలుశ్రీధర్, కళ్యాణ్, ఒక కుమార్తె
తల్లిదండ్రులుకోటిఅప్పలస్వామి, బుచ్చమ్మ
తండ్రికోటిఅప్పలస్వామి
తల్లిబుచ్చమ్మ

చిలుకోటి కాశీ విశ్వనాధ్ కథా రచయిత, నటుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన విశాఖపట్నంలో కోటి అప్పలస్వామి, బుచ్చమ్మ దంపతులకు 1946లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చిలుకోటి కాళీవిశ్వేశ్వరరావు. ఆయన పేరును కాశీ విశ్వనాథ్ గా తన పాఠశాల రోజులలో తెలుగు ఉపాధ్యాయులు మార్చారు. ఆయన విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్ కళాశాలలో చదివారు. ఆయన ఆంధ్రావిశ్వవిద్యాలయంలో వెయిట్ లిప్టింగ్ విభాగంలో క్రీడలలో పాల్గొనేవారు. ఆయనకు ఆ విభాగంలో అనెక అవార్దులు వచ్చాయి. ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు కూడా వెళ్ళారు. విద్యాభ్యాసం తరువాత ఆయన విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అకౌంటెంట్ గా ఉద్యోగం చేసారు.

ఆయన 1968 లో తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన వ్రాసిన "ఓ వర్షం కురుసిన రాత్రి" కథకు అభినందన తెలుపడానికి రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి స్వయంగా ఆయన యింటికి వెళ్ళారు. అదే ఆయనకు మొదటి అభినందన.

సినిమా ప్రస్థానం[మార్చు]

ఆయన సినిమా ప్రస్థానాన్ని "రామాయణంలో పిడకలవేట" సినిమాతో 1980లో ప్రారంభించారు. తరువాత సుమారు 131 సినిమాలకు స్క్రిప్ట్, డైలగులను వ్రాసారు. ఆయన సుమారు 120 కథలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కథలు వ్రాసారు. ఆయన 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు దర్శకులు, నిర్మాతలు నటీ నటులతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ఆయన దాసరినారాయణ రావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయబాపినీడు వంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసారు.[1] ఆయన 52 సినిమాలలో నటించారు. ఆయనకు ఏడు నంది అవార్డులు వచ్చాయి. వాటిలో మూడు నందులు సినిమా కథలకు, మూడు నందులు నాటకాలకు, ఒక నంది దర్శకత్వానికి వచ్చాయి.[2]

సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

చిలుకోటి కాశీ విశ్వనాధ్ డిసెంబరు 22 2015 మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆయన సికిందరాబాద్ నుండి లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం వస్తుండగా రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకొంటున్న సమయంలో తీవ్రమయిన గుండెపోటు రావడంతో క్షణాలలోనే మరణించారు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన భార్య పేరు మహాలక్ష్మి. ఆయనకు శ్రీధర్, కళ్యాణ్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "సినీ పరిశ్రమకు మరో విషాదం.. గుండెపోటుతో మరణించిన సీకె విశ్వనాధ్". Archived from the original on 2015-12-25. Retrieved 2015-12-26.
  2. "Details of 20 Telugu celebs, who died in 2015". Shekhar H Hooli. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్. 23 December 2015. Retrieved 20 December 2015.
  3. ప్రముఖ రచయిత, నటుడు చిలుకోటి కాశీ విశ్వనాధ్ మృతి
  4. etails of 20 Telugu celebs, who died in 2015

ఇతర లింకులు[మార్చు]