చెక్కభజనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తెలుగువారి పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్కభజన ఒకటి.పండుగలు, జాతరల సమయాలలో కొంతమంది యువకులు కలిసి రాత్రిపూట దేవాలయ ప్రాంగణంలో చెక్కభజన ప్రదర్శిస్తారు[1].పంచకట్టు , రంగుల తలగుడ్డ , నడుము పట్టి ,కాళ్ళగజ్జలు వీరి ఆహార్యం.ఇత్తడి బిళ్ళలున్న చెక్కలను ఒక చేతిలో పట్టుకుని ఆడిస్తూ, తాళానికి అనుగుణంగా ముందుకు ,వెనుకకు అడుగులేస్తూ, వలయాకారంగా తిరుగుతూ భజన చేస్తారు.అందరూ కలసి పాటకు అనుగుణంగా ఒకేసారి ఎగరడం, కూర్చోవడం,లేవడం గుండ్రంగా తిరగడం వంటి భంగిమలు ప్రదర్శిస్తారు.వీరు భారత ,రామాయణ, భాగవతాది పురాణాలలోని అంశాలను పాడుతారు .సీత ,రాముడు, ద్రౌపది ,కౌరవులు వంటి పాత్రలకు పాటలు కట్టి పాడుతారు[2].హరి భజనలు, పండరి భజనలు , కోలాట భజనలు, అడుగు భజనలు అనే ప్రక్రియలు ఉంటాయి. ఈ చెక్కభజన బృందాలు పూర్వం ప్రతి గ్రామంలోనూ ఉండేవి . ఎంతో ఉత్కృష్టమైన కళారూపం చాలా వరకు కనుమరుగైన ఛాయా మాత్రంగా అక్కడక్కడ కనిపిస్తుంది[3].

మూలాలు[మార్చు]

  1. "Chekka Bhajana, Rayalaseema's pride flies high at R-Day Parade". The Times of India. 2020-01-26. ISSN 0971-8257. Retrieved 2023-09-04.
  2. "Chekka Bhajanalu". TeluguISM - Telugu Traditions (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-02. Retrieved 2023-09-04.
  3. "Chekka Bhajana | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-09-04.