చేపల వాన
సముద్రాలపై టోర్నడోలు ఏర్పడి, వేగంగా సుడులు తిరుగుతూ, ప్రయాణించేటప్పుడు చేపలు తదితర సముద్ర జంతువులను అమితమైన శక్తితో పైకి లాగుతాయి. ఒక్కోసారి టోర్నడోలతో పాటు ఈ జీవులు గాలిలో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. ఒకసారి టోర్నడో బలహీనపడిన తరువాత ఈ జీవులు వర్షంలా నేలపై పడతాయి ఈ విధంగా చేపలు పడటాన్ని చేపల వానగా వ్యవహరిస్తారు.
కారణం
[మార్చు]ఆకాశం నుంచే వచ్చినా ఆకాశంలో ఏమీ చేపలుండవు. నిజానికి అవి భూమి మీదనుంచే ఆకాశానికి వెళతాయి. ఎలా అంటే నదులు సముద్రాలు దగ్గర నీరు ఆవిరై, అది మేఘమై తిరిగి భూమిపైనే మేఘాలు ఆ నీటిని వర్షిస్తాయని మనకు తెలుసు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు జరుగుతాయి. మెరుపులు, ప్రచండమైన గాలుల కారణంగా సముద్రంలో ఉండే చేపలగుడ్లు, చిన్న చిన్న కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాలలోకి చేరుకుంటాయి. అలా చేరుకుని, అవి తిరిగి వర్షం ద్వారా భూమిని చేరుతాయని కనుగొన్నారు.ఇది ఎంత వరకూ నిజమనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. [1]
ఆంధ్రప్రదేశ్‌లో చేపల వాన
[మార్చు]2015 జూన్ 19 న ఎన్టీఆర్ జిల్లా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఆకాశం నుంచి చేపలు, కప్పలు రాలిపడ్డాయి. అంతకు ముందరి రాత్రి కుండపోతగా కురిసిన వానలో చేపలు పడినట్లు భావిస్తున్నారు. ఉదయాని కల్లా పొలాల్లో పెద్ద ఎత్తున వాలుగ రకానికి చెందిన చేపలు ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. వాటిని ఏరుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఒక్కొక్క చేప బరువు 500 గ్రాముల లోపు ఉంది. పొలాల్లో పడిన చేపలను కర్రలతో కొట్టి వాటిని చేజిక్కించుకొని ఇళ్లకు తీసుకెళ్లారు.[2]
భారతదేశంలో చేపలవానలు
[మార్చు]2009 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం నవగాం జిల్లా, భాన్వాడ్ తాలూకా జమ్నావాడ్ గ్రామంలో చేపల వర్షం పడింది. ఆరోజు వాతావరణం మామూలుగానే ఉన్నా, అనుకోకుండా వర్షం కురవడం ప్రారంభించి ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి[3] 2008లో కేరళలోని కందనసెరీ గ్రామంలో మొదట ఎర్రటి ధారలు, ధారలుగా వర్షం కురిసింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయి
ప్రపంచంలొ చేపల వర్షాలు కురిసిన ప్రాంతాలు
[మార్చు]- 1861, ఫిబ్రవరి 22 : సింగపూర్[4]
- 1900, మే 15 : మాదేష్, నేపాల్ [5]
- 1903, జూలై 1 : మూస్‌జ్వా, సాస్చ్కవాన్ [6]
- 1947, అక్టోబరు 23 : మార్క్స్‌విల్లా, లూసియానా, అమెరికా [7]
- 2008, ఫిబ్రవరి 12 : కేరళ, భారత్ [8]
- 2009, అక్టోబరు 24 : జామ్‌నగర్, భారత్ [9]
- 2010, ఫిబ్రవరి 25, 26 : లజమాను, ఆస్ట్రేలియా[10]
- 2012, జనవరి 13 : లోరేటో, ఫిలిపీన్స్ [11][12]
- 2013, సెప్టెంబరు 12 : చెన్నై, తమిళనాడు, భారత్
- The yearly Lluvia de Peces in Yoro, Honduras
- Chilaw, Sri Lanka, 6 May 2014, [13]
- 2014, మే 6 : చిలావ్, శ్రీలంక
- 2014 ఏప్రిల్ 14: థాయిలాండ్
మూలాలు
[మార్చు]- ↑ http://www.andhrajyothy.com/Artical.aspx?SID=120953&SupID=25[permanent dead link]
- ↑ https://www.youtube.com/watch?v=7a3l5bu2O_g
- ↑ http://www.dnaindia.com/world/us-elections-fish-rain-takes-villagers-by-surprise-in-kerala-1150471
- ↑ McAtee, Waldo L. (May 1917). "Showers of Organic Matter" (PDF). Monthly Weather Review. 45 (5): 223. doi:10.1175/1520-0493(1917)45<217:soom>2.0.co;2. Retrieved 2009-01-26.
- ↑ "Rained Fish", AP report in the Lowell (Mass.) Sun, May 16, 1900, p4
- ↑ "Canada Day weather through the years", reported in The Weather Network : [1] Archived 2012-06-30 at the Wayback Machine, June 27, 2012
- ↑ "Greg Forbes. Spooky Weather. The Weather Channel. Posted: October 27, 2005". Archived from the original on 2009-12-10. Retrieved 2015-06-23.
- ↑ Fish Rain in Kerala, India
- ↑ "Fish Rain", reported in the India : [2], Oct 24, 2009
- ↑ "It's raining fish in Northern Territory", reported in news.com.au : [3] Archived 2015-06-01 at the Wayback Machine, February 28, 2010
- ↑ Lani Nami Buan (January 15, 2012). "It's raining fish! It's normal". GMA News. Retrieved January 16, 2012.
- ↑ Jereco O. Paloma (January 15, 2012). "Agusan's 'rain of fish' natural although unusual". SunStar Davao. Archived from the original on 2014-08-26. Retrieved January 16, 2012.
- ↑ "Fish rain down on Sri Lanka village, reported in http://www.bbc.com/news/world-asia[permanent dead link] : [4], 6 May 2014
ఇతర లింకులు
[మార్చు]- Raining cats and dogs
- Mysterious Falls from the Sky. A review on the American perspective.
- 10 Craziest Things To Fall From the Sky
- fish raining in thailand collected from BBC super natural video