Jump to content

జంగల్‌నామా

వికీపీడియా నుండి
పుస్తక ఆంగ్ల అనువాదం

జంగల్‌నామా ప్రముఖ పంజాబీ రచయిత సత్నాం రాసిన పుస్తకం. ఆయన దండకారణ్యంలో పర్యటించి, అక్కడ మావోయిస్టులు నడుపుతున్న జనతన సర్కార్ గురించి రాసిన అనుభవాలను ఈ పుస్తకంలో రాసారు. సత్నాం దండకారణ్యాన్ని జంగల్‌నామాగా మొదట 2002లో పంజాబీ పాఠకులకు, ఇంగ్లీషులో 2010లో ఇంగ్లీషులో పరిచయం చేశారు. 2012లో ఈ పుస్తకం తెలుగులోకి వచ్చింది. తెలుగులో కొణతాల దిలీప్ అనువాదం చేసారు.[1]

పుస్తక విశేషాలు

[మార్చు]

బయటి నుంచి దండకారణ్యానికి వెళ్లి మావోయిస్టు గెరిల్లా జోన్‌లోని నూతన ప్రపంచ నిర్మాణ ప్రయత్నాలను అక్షరబద్ధం చేసిన తొలి రచయిత సత్నాం. అలాంటి పని అవసరమని రచయితగా, విప్లవాభిమానిగా గుర్తించడంలోనే ఆయన విశిష్టత ఉన్నది. దండకారణ్యం పట్ల తీవ్రమైన అనురక్తి ఉన్నందువల్లే ఈపని ఆయన చేయగలిగారు. విప్లవ యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, ఆ యుద్ధపు అంతస్సారంలో మానవ వికాసక్రమం ఎలా ఉన్నదో ఆయన మనకు చెప్పదల్చుకున్నారు.

ఈ పుస్తకం క్రింద "మావోయిస్టు గెరిల్లా జోన్‌లో అనుభవాలు" అనే ఉపశీర్షిక ఉంటుంది. జంగల్‌నామా ఒక వాస్తవికతా కల్పనా రూపంగా, కాల్పనిక వాస్తవికతగా కనిపించడం వెనుక అలాంటి మానవ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. రక్తసిక్తమైన, కఠినమైన, సునిశితమైన యుద్ధ ఆచరణలోని సృజనాత్మకతను పట్టుకోగల విప్లవ దార్శనికత ఆయనకు ఉన్నదని ఆ రచన చదివితే అనిపిస్తుంది. ఈ పుస్తకం 2002 నాటి దండకారణ్య ఉద్యమ దశను గొప్పగా చిత్రించింది.

ఈ పుస్తకంలో యుద్ధంలో, ఉత్పత్తిలో, కళా సాంస్కృతిక రంగాల్లోని ఈ వికాస క్రమాన్ని సత్నాం చాలా సూక్ష్మస్థాయిలో పట్టుకోగలిగారని ఇప్పుడు మళ్లీ జంగల్‌నామా చదివితే అనిపిస్తుంది. సృజనాత్మక సాహిత్యానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు ఇందులో ఉన్నాయి. దండకారణ్యంలోని ఈ మార్పు క్రమాలను చూడ్డానికి, మనకు వివరించడానికే ఆయన లోపలికి వెళ్లి ఉంటారు. ప్రాథమిక దశలోని దండకారణ్య ప్రజాధికారం రూపొందిన క్రమాన్ని అధ్యయనం చేయడానికి ఒక పరిశోధనా రచనగా కూడా జంగల్‌నామా నిలబడుతుంది.[2]

అనువాదాలు

[మార్చు]

ఈ పుస్తకాన్ని 2010 లో భారతీయ జర్నలిస్టు విషవ్ భార్తి ఆంగ్లంలోనికి అనువదించారు. ఆ పుస్తకాన్ని హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, తెలుగు, ఆంగ్ల భాషల్లోకి అనువదించారు.[3]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]